News
News
X

Tollywood Latest Updates : ఆర్యపై పోలీస్ కేసు.. మెగాస్టార్ పై బండ్ల ట్వీట్.. 

ఈరోజు టాలీవుడ్ లో కొన్ని లేటెస్ట్ అప్డేట్స్..

FOLLOW US: 

ఆర్యపై శ్రీలంక యువతి ఫిర్యాదు.. 

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ప్రముఖ సినీ నటుడు ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తమిళనాడులోని చెన్నైలో కమిషనర్ ఎదుట ఆర్య విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పోలీసులు పలు విషయాలు ఆరా తీశారు. శ్రీలంకకు చెందిన యువతి.. జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఆన్ లైన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు ఆర్యతో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్ లను విడుదల చేసింది. దీంతో చెన్నైలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ వాయిదా వేశారు. 

మెగాస్టార్ పై బండ్ల గణేష్ ట్వీట్.. 

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్.. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఎప్పుడూ పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని కురిపించే బండ్ల గణేష్ ఈసారి చిరంజీవిపై తన ప్రేమను చాటుకున్నాడు. ''మా దేవరకి అన్న.. అందరికి నేను అనే నమ్మకం. మనిషి అంటే ఇలా ఉండాలి.. అని ప్రజలకు చెప్పిన మహోన్నత వ్యక్తి మా పెద్దన్న మెగాస్టార్‌'' అంటూ చేతులు జోడించిన ఎమోజీను జత చేశాడు. అయితే ఈ ట్వీట్ ను బండ్ల గణేష్ ఏ సందర్భంగా చేశాడనేది మాత్రం స్పష్టం చేయలేదు. 

తమిళనటి, బిగ్ బాస్ ఫేమ్ యషికా ఆనంద్ ఇటీవల ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆమెని హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రీసెంట్ గానే ఈమె కోలుకొని డిశ్చార్జ్ అయింది. తన స్నేహితురాలు పావని.. మరో ఇద్దరితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. మహాబలేశ్యరం వద్ద ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం యషికా ర్యాష్ డ్రైవింగ్ వలన జరిగిందని గుర్తించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. చెంగల్పట్టు జిల్లా కానత్తూరు పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్‌ 279, 304 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అంతేగాక పోలీసులు ఆమె డ్రైవింగ్‌ లైసెన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 

Also Read : Salaar Movie : క్యాజువల్ లుక్ లో ప్రభాస్.. 'సలార్' వీడియో లీక్..

Published at : 11 Aug 2021 03:52 PM (IST) Tags: Megastar Chiranjeevi Hero Arya Bandla Ganesh Yashika Anand

సంబంధిత కథనాలు

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sridevi Sarees Auction: అతిలోక సుందరి చీరలు వేలం, ఆ డబ్బుతో ఏం చేస్తారంటే?

Sree Leela: రామ్, బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, షూటింగ్ తేదీ ఫిక్స్!

Sree Leela: రామ్, బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, షూటింగ్ తేదీ ఫిక్స్!

Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

Puneeth Rajkumar : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - దసరాకు 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్

Puneeth Rajkumar : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - దసరాకు 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్

Ginna Movie Trailer: జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదురా, లోడ్ చేసిన గన్ను, ‘జిన్నా’ ట్రైలర్ వచ్చేసింది!

Ginna Movie Trailer: జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదురా, లోడ్ చేసిన గన్ను, ‘జిన్నా’ ట్రైలర్ వచ్చేసింది!

టాప్ స్టోరీస్

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

ఉన్న ప్రతిపక్షాలకే ఆదరణ లేదు- వచ్చే బీఆర్‌ఎస్‌ ఏం చేస్తుంది: ఏపీ మంత్రులు

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

Amit Shah Jammu Kashmir Visit: 'మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్'- పాక్‌తో చర్చలపై అమిత్ షా

Amit Shah Jammu Kashmir Visit: 'మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్'- పాక్‌తో చర్చలపై అమిత్ షా