అన్వేషించండి
Tollywood Updates: 'రౌడీబాయ్స్' టీజర్.. 'దృశ్యం-2' లేటెస్ట్ అప్డేట్..
ఈరోజు టాలీవుడ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం..

'రౌడీబాయ్స్' టీజర్
'రౌడీబాయ్స్' టీజర్..
ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబంలో నుంచి ఒకరు హీరోగా పరిచయమవుతోన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'రౌడీ బాయ్స్'. ఇందులో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. హర్ష దర్శకత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగుతుంది. రెండు వేర్వేరు కాలేజీల మధ్య గొడవ, హీరోయిన్ కోసం ఇద్దరు అబ్బాయిలు గొడవ పడడం వంటివి టీజర్ లో చూపించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రంగాఉంది.
'దృశ్యం-2'కి క్లీన్ 'యు'..
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'దృశ్యం-2' సినిమా తెలుగులో అదే పేరుతో విడుదల కానున్న సంగతి తెలిసిందే. వెంకటేష్, మీనా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు 'యు' సర్టిఫికెట్ ఇచ్చినట్లు సురేష్ ప్రొడక్షన్స్ సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కృతిక, ఎస్తర్ అనిల్ కీలకపాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు.
Censor done ! It's a clean U for #Drushyam2 💯@venkymama #MeenaSagar #JeethuJoseph @aashirvadcine @antonypbvr #RajkumarTheatres @anuprubens #SatheeshKurup pic.twitter.com/1kFjtw8Ww9
— Suresh Productions (@SureshProdns) September 20, 2021
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆరోగ్యం
లైఫ్స్టైల్
లైఫ్స్టైల్





















