అన్వేషించండి
Advertisement
Samantha: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రాకి థ్యాంక్స్ చెప్పిన సమంత అక్కినేని, వైరల్ అవుతున్న పిగ్గీచాప్స్, సామ్ ట్వీట్స్
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే అక్కినేని సమంత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాకి థ్యాంక్స్ చెప్పింది.
సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ బిజీగా ఉన్న సమంత ఈ మధ్యే గుణశేఖర్ ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తిచేసుకుని కొన్ని రోజులు హాలిడేస్ ని ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం ‘కాతు వాకుల్ రెండు కాదల్’ సినిమాలో నటిస్తోంది.
This is super encouraging for us as a team .. Thankyou dear @priyankachopra 🙏❤️🤗🙌 https://t.co/t9jquNPZbr
— S (@Samanthaprabhu2) September 19, 2021
విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలుగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి టు టు టు మ్యూజికల్ వీడియో విడుదలైంది. యూ ట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండ్ అయింది కూడా. ఈ పాట బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రాని కూడా ఆకట్టుకుందట. ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా చెప్పింది ప్రియాంక. ఈ పాట బాగా నచ్చింది , బాగా చేశారు అని ట్వీట్ చేసింది. విఘ్నేష్ శివన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ.. చిత్ర యూనిట్‌కి కంగ్రాట్స్ తెలిపిన సమంత ప్రియాంక ట్వీట్‌పై స్పందించింది. మీ వ్యాఖ్యలు మా టీమ్‌కి ఎంకరేంజ్మెంట్గాఉందని ట్వీట్ చేసింది. థ్యాంక్యూ ప్రియాంక అంటూ రిప్లై ఇచ్చింది సామ్.ప్రస్తుతానికి సమంత మూవీస్ అప్ డేట్ కన్నా పర్సనల్ విషయంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. చైతూ-సామ్ మధ్య ఏదో జరుగుతోందని ప్రచారంపై ఇప్పటి వరకూ సమంత కానీ నాగచైతన్య కానీ స్పందించలేదు. రెండు రోజుల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమంత అక్కడ చైతూ విషయాన్ని అడిగితే.. గుడి దగ్గర బుద్ది ఉందా? అంటూ కామెంట్ చేసింది కానీ క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు ఈ ఇద్దరు విడిపోతున్నారన్న చర్చకు బలం చేకూరేలా వరుస ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో పేరును మార్చుకోవటం, గోవా టూర్ కి చైతూ లేకుండా వెళ్లిరావడం జరిగింది. ఈ మధ్యన చైతూ నటించిన లవ్ స్టోరీ మీద ట్వీట్ కూడా అభిమానుల ఒత్తిడి మేరకు చేసినదే అనే టాక్ ఉంది. అన్నటికీ మించి తాజాగా లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హాజరు కాలేదు. చాలా రోజుల తర్వాత చైతూ సినిమాకు సంబంధించిన ఫంక్షన్ జరుగుతున్నా ఎక్కడా సామ్ కనిపించకపోవడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. ఇప్పటికైనా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెడతారో..లేదా మౌనంగా ఉంటూ మరింత రచ్చ అయ్యేలా చేసుకుంటారో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion