Bigg Boss 5 Telugu: ఉమాదేవి ఔట్.. ఎమోషనల్ అయిన ప్రియాంక..
ఎప్పటిలానే గ్రాండ్ ఇచ్చేశారు నాగార్జున. 'లాహే లాహే' సాంగ్ కి డాన్స్ చేసి అలరించారు.
ఎప్పటిలానే గ్రాండ్ ఇచ్చేశారు నాగార్జున. 'లాహే లాహే' సాంగ్ కి డాన్స్ చేసి అలరించారు. అనంతరం అమ్మాయిలు, అబ్బాయిల మధ్య డాన్స్ కాంపిటిషన్ పెట్టారు.
- ముందుగా షణ్ముఖ్-ఉమాదేవి కలిసి 'మైండ్ బ్లాక్' సాంగ్ కి డాన్స్ చేశారు.
- లహరి-జెస్సీ కలిసి 'స్వింగ్ జరా' సాంగ్ కి డాన్స్ చేశారు.
- కాజల్-లోబో కలిసి 'భీమవరం బుల్లోడా' సాంగ్ కి డాన్స్ చేశారు.
- శ్వేతవర్మ-వీజే సన్నీ కలిసి 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు' సాంగ్ కి డాన్స్ చేశారు.
- ప్రియా-యాంకర్ రవి కలిసి 'లక్ష్మీ బావా' సాంగ్ కి డాన్స్ చేశారు.
- హమీద-శ్రీరామచంద్ర కలిసి 'లంచ్ కి వస్తావా.. మంచ్ కొస్తావా..' అనే సాంగ్ కి డాన్స్ చేశారు.
- ప్రియాంక-మానస్ కలిసి 'నచ్చావే నైజాం పోరీ' సాంగ్ కి డాన్స్ చేశారు.
- యానీ మాస్టర్-విశ్వ కలిసి 'జ్వాలారెడ్డి' సాంగ్ కి డాన్స్ చేశారు.
- నటరాజ్ మాస్టర్-సిరి కలిసి 'గరం గరం చిలకా' సాంగ్ కి డాన్స్ చేశారు.
- ఈ డాన్స్ టాస్క్ లో అమ్మాయిలంతా డాన్స్ బాగా చేశారని మార్క్ లతో డిసైడ్ చేశారు.
కాజల్ సేఫ్..
మొత్తం నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో నిన్నటి ఎపిసోడ్ లో ముగ్గురు సేఫ్ అయ్యారు. మిగిలిన కంటెస్టెంట్స్ నటరాజ్ మాస్టర్, కాజల్, ఉమాదేవి, ప్రియాలలో ముందుగా కాజల్ సేఫ్ అయినట్లు అనౌన్స్ చేశారు.
అనంతరం కాజల్.. తనకు మటన్ బిరియాని తినాలనుందని నాగార్జునను అడిగింది. దానికి వండుకొని తినమని నాగార్జున కాసేపు కాజల్ ని ఏడిపించారు. ఆ తరువాత కాజల్ అడిగింది కాబట్టి మటన్ బిరియాని పంపిస్తానని చెప్పారు.
ఇంట్లో ఉన్న దెయ్యం..
హౌస్ మేట్స్ అందరికి నాగార్జున ఒక టాస్క్ ఇచ్చారు. ఇంట్లో మీరెవరిని దెయ్యమని ఫీల్ అవుతున్నారో వాళ్లకి దెయ్యం స్టిక్కర్ అంటించాలని చెప్పారు.
- ముందుగా ప్రియా.. సిరికి స్టిక్కర్ అంటిస్తూ నైట్ టైమ్ సరిగ్గా పడుకోదని, నేను పడుకున్న తరువాత వచ్చి మాట్లాడుతూ ఉంటుందని అన్నారు.
- మానస్-శ్రీరామచంద్రకు దెయ్యం స్టిక్కర్ అంటిస్తూ.. టాస్క్ లో అతడి ప్రవర్తన నచ్చలేదని చెప్పాడు.
- లహరి-ఉమాదేవి గట్టిగా మాట్లాడుతుందని 'స్వీట్ రాక్షసి' అంటూ స్టిక్కర్ అంటించింది.
- హమీద-యానీ మాస్టర్ కి స్టిక్కర్ అంటించింది
- శ్రీరామచంద్ర-మానస్ ఓటమిని తీసుకోలేకపోతున్నాడని అతడికి దెయ్యం స్టిక్కర్ అంటించాడు.
- యాంకర్ రవి- శ్రీరామచంద్రకు దెయ్యం స్టిక్కర్ అంటించాడు.
- వీజే సన్నీ-ప్రియాంకకు దెయ్యం స్టిక్కర్ అంటిస్తూ.. గేమ్ లో తన కాళ్లు పట్టుకొని లాగేసింది ఫన్నీ రీజన్ చెప్పాడు.
- విశ్వ- కాజల్ కి అంటిస్తూ.. దెయ్యంలాగా నా వెంట పడుతుందంటూ రీజన్ చెప్పాడు.
- ప్రియాంక- లోబోకి దెయ్యం స్టిక్కర్ అంటించింది.
- జెస్సీ- సిరికి దెయ్యం స్టిక్కర్ అంటించాడు.
- శ్వేతావర్మ- టాస్క్ లో సిరితో హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయిందని.. ఆమెకి దెయ్యం స్టిక్కర్ అంటించింది.
- యానీ మాస్టర్- హమీదకు దెయ్యం స్టిక్కర్ అంటించింది.
- కాజల్- విశ్వకు స్టిక్కర్ అంటిస్తూ.. నన్ను టార్గెట్ చేస్తున్నాడనిపిస్తుందని చెప్పుకొచ్చింది.
- సిరి- ఉమాదేవికి స్టిక్కర్ అంటిస్తూ కొన్ని విషయాల్లో ఆమె రాజీ పడడం లేదని చెప్పింది.
- నటరాజ్- విశ్వకు స్టిక్కర్ అంటిస్తూ టాస్క్ లో విశ్వ బిహేవియర్ ను రీజన్ గా చెప్పారు.
- షణ్ముఖ్- సన్నీ విషయంలో తప్పు చేశానంటూ తనకు తానే స్టిక్కర్ అంటించుకోగా.. అలా కుదరదని నాగ్ చెప్పగా.. సిరికి స్టిక్కర్ పెట్టాడు.
- ఉమాదేవి- సిరికి స్టిక్కర్ అంటించింది.
- లోబో- సిరికి స్టిక్కర్ అంటిస్తూ ఏదైనా ఉంటే టక్కున బయటకు చెప్తుంది కానీ అదే మనం చెప్తే తీసుకోలేదని రీజన్ చెప్పాడు.
నామినేషన్స్ లో మిగిలిన ముగ్గురు నటరాజ్,ప్రియా, ఉమాదేవిలలో ముందుగా ప్రియా సేఫ్ అయింది. ఆ తరువాత నటరాజ్, ఉమాదేవిలకు టాస్క్ ఇచ్చి వారిద్దరిలో నటరాజ్ మాస్టర్ సేఫ్ కాగా.. ఉమాదేవి ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు.
ఆ సమయంలో ప్రియాంక చాలా ఎమోషనల్ అయింది. కొన్ని మాటలు అనేశాను అంటూ ఉమాదేవి దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తరువాత స్టేజ్ పైకి వచ్చిన ఉమాదేవి 'కుండ బద్దలు కొడుతూ' కొందరు హౌస్ మేట్స్ కి సలహాలు ఇచ్చింది.
- సిరి ఎవరైనా చెప్తే తీసుకోలేదని.. షణ్ముఖ్ గేమ్ ఆడకుండా తన ఆట ఆడాలని చెప్పింది.
- బిగ్ బాస్ ఫ్లాట్ ఫామ్ మీద లహరి చాలా వీక్ అని.. ఏ టాస్క్ ఇచ్చినా కూడా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదని.. పక్క వాళ్లు సపోర్ట్ చేస్తేనే తప్ప ఆమె సరిగ్గా ఆడలేకపోతుందని చెప్పింది. అవి మార్చుకోమని సలహా ఇచ్చింది.
- ప్రియా సేఫ్ గా ఆడుతున్నారే తప్ప మనసుతో ఆడితే ఇంకొంచెం నిరూపించుకోవచ్చని అనుకోవట్లేదని చెప్పింది.
- షణ్ముఖ్.. 'నీ గేమ్ నువ్ ఆడుకో.. సిరి నీకు ఫ్రెండ్ మాత్రమే.. నీ లైఫ్ లో నువ్ ఏం సాధించాలనుకుంటున్నావో సాధించు..' అంటూ సలహా ఇచ్చింది.
- యాంకర్ రవి.. 'అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తున్నావ్ అంతా బాగుంది.. ఆ ప్రాసెస్ లో కొంతమందికి దూరమవుతున్నావేమో అనిపిస్తుందని' అన్నారు.
- లోబో.. 'నిన్ను నువ్ ప్రూవ్ చేసుకోవాలి, నిన్ను తక్కువ చేసి చూస్తున్న వాళ్లకు నువ్వేంటో నిరూపించు' అని చెప్పింది.
- యానీ మాస్టర్.. 'మీకు కోపం చాలా ఎక్కువ.. తొందరగా రియాక్ట్ అవుతారు మంచిదే కానీ పాయింట్ ఉన్నప్పుడు రైజ్ అవ్వండి. ఎవరేంటి అనేది తెలుసుకొని గేమ్ ఆడండి.. రిలేషన్స్ అనేవి పక్కన పెట్టండి' అంటూ చెప్పుకొచ్చింది.
- నటరాజ్ మాస్టర్.. ఎవ్వరి మాటకు లొంగొద్దు అంటూ ఉమాదేవి సలహా ఇచ్చింది.