అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Promo: చిన్న చెడ్డీలు వేసుకొని ఎంతకాలం.. కౌంటర్ వేసిన యాంకర్ రవి.. ఫైర్ అయిన నటరాజ్ మాస్టర్..
బిగ్ బాస్ సీజన్ 5 రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలో సరయు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో ఉమాదేవి ఎలిమినేట్ అయింది.
బిగ్ బాస్ సీజన్ 5 రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారంలో సరయు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో ఉమాదేవి ఎలిమినేట్ అయింది. ఇక మూడో వారం నామినేషన్స్ సోమవారం నాడు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రోమోను చూస్తుంటే హౌస్ లో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినట్లే ఉన్నాయి. సెకండ్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో శ్రీరామచంద్ర-మానస్ ల మధ్య గొడవ జరిగింది. ఆ డిస్టర్బన్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది.
నామినేషన్స్ లో కూడా శ్రీరామచంద్ర అదే రీజన్ చెప్పి మానస్ ను, కాజల్ లను నామినేట్ చేసినట్లు ఉన్నాడు. వీజే సన్నీ.. ప్రియాను నామినేట్ చేస్తూ.. 'మీరు అన్న ఆ మాటను తీసుకోలేకపోయాను' అంటూ రీజన్ చెప్పాడు. 'ఏం మాట అన్నాను చెప్పు' అని ప్రియా అడగ్గా.. 'మీకు తెలుసు అది.. నాకు రిపీట్ చేయడం ఇష్టం లేదని' సన్నీ చెప్పగా.. వెటకారంగా చప్పట్లు కొట్టింది ప్రియా. లహరి కూడా ప్రియానే నామినేట్ చేయడంతో.. ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది.
'వాటే సేఫ్ ప్లే..!' అని ప్రియా అనగా.. 'సేఫ్ కాదు.. సేఫ్ అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు నామినేట్ చేయడానికి' అని కౌంటర్ ఇచ్చింది. ప్రియాంక సింగ్.. హమీద మీద ఫైర్ అయింది. 'నామినేషన్స్ లో చెండాలమైన రీజన్స్ ఇస్తున్నారని.. ఇదొక పనికిమాలిన రీజన్ అని' హమీద మీద మండిపడింది. ఆ తరువాత నటరాజ్ మాస్టర్-జెస్సీల మధ్య చర్చ జరిగింది.
'ఒకరు చెప్తే నువ్ నన్ను నామినేట్ చేశావ్ అని నాకు తెలుసు' అంటూ నటరాజ్.. జెస్సీపై ఫైర్ అయ్యారు. 'నువ్ చిన్నపిల్లోడివి.. జుజూ' అంటూ రియాక్ట్ అయ్యారు నటరాజ్ మాస్టర్. 'ఒక విమెన్ నిన్ను అడుగుతున్నప్పుడు.. నీ రెస్పెక్ట్ ఏది' అంటూ నటరాజ్ కి రీజన్ చెప్తూ నామినేట్ చేశాడు విశ్వ. ఇక రవి.. జెస్సీని నామినేట్ చేస్తూ.. 'ఎన్నిరోజులు చిన్న చెడ్డీలు వేసుకొని ఆ దెబ్బ చూపించి ఇంత మంచి ఫ్లాట్ ఫామ్ ని వేస్ట్ చేసుకుంటున్నావేమో అనిపిస్తుంది' అంటూ రీజన్ చెప్పాడు.
Nominations are on...Baddalakotti mari cheppali 🔥 🔥 #BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/m1mtYmkRXl
— starmaa (@StarMaa) September 20, 2021
Also Read: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రాకి థ్యాంక్స్ చెప్పిన సమంత అక్కినేని, వైరల్ అవుతున్న పిగ్గీచాప్స్, సామ్ ట్వీట్స్
Also Read: నాన్నకు ప్రేమతో నాగార్జున..పంచెకట్టు వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నం అంటున్న ‘బంగార్రాజు’
Also Read: అక్కినేని నాగేశ్వరరావు అరుదైన చిత్రాలు.. 41 ఏళ్ల కిందట అన్నపూర్ణ స్టూడియో ఇలా ఉండేది
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
సినిమా రివ్యూ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion