ANR Jayanthi Special: నాన్నకు ప్రేమతో నాగార్జున..పంచెకట్టు వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నం అంటున్న ‘బంగార్రాజు’

నాన్నకి ఇష్టమైన పంచెకట్టు, నాన్నకి ఇష్టమైన నవరత్నాల హారం, నాన్నకి ఇష్టమైన ఉంగరం..ANR జయంతి సందర్భంగా నాగ్ ట్వీట్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

FOLLOW US: 

తెలుగు సినిమాకు బాలరాజు, బాలచంద్రుడతడే,దేవదాసు,కాళిదాసు,కబీరు,క్షేత్రయ్య, అర్జునుడు, అభిమన్యుడు , అమరప్రేమికుడు ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు చిత్రపరిశ్రమకు ఆయనో బహుదూరపు బాటసారి. ఆ మహానుటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా తనయుడు నాగార్జున విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది.

తండ్రిని తలుచుకుంటూ ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు నాగార్జున. తన తండ్రికి ‘పంచకట్టు’ పై ఉన్న ప్రేమ, తన తదుపరి చిత్రం బంగార్రాజుతో  తన తండ్రి వైభవాన్ని ఎలా తిరిగి తీసుకురావాలనుకుంటున్నారో చెప్పారు నాగ్. ఆ వీడియోలో ఏముందంటే… “సెప్టెంబర్ 20  నా జీవితంలో ఒక ముఖ్యమైన రోజు. ఇది నా స్ఫూర్తి, నా హీరో, నాన్నగారి పుట్టినరోజు. నాన్నగారికి ‘పంచకట్టు’ అంటే చాలా ఇష్టం. ఆయన పంచెకట్టుకున్నప్పుడు చూస్తే చాలా ముచ్టటేస్తుంది.  ఇది పొందూరు ఖద్దరే, ఇది ఆయన నవరత్నాల హారం, ఇది ఆయన నవరత్నాల ఉంగరం, ఈ వాచ్ నాకన్నా సీనియర్. ఆయన ఫేవరెట్ వాచ్ ఇప్పుడు నా ఫేవరెట్. ఇవన్నీ వేసుకుంటే ఆయన నాతోనే ఉన్నట్టుంటుంది. మా సినిమా (బంగార్రాజు) తో అతని ‘పంచకట్టు వైభవాన్ని’ తిరిగి తీసుకురావడానికి మేము ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం' అన్నారు.

Also Read: అక్కినేని నాగేశ్వరరావు అరుదైన చిత్రాలు.. 41 ఏళ్ల కిందట అన్నపూర్ణ స్టూడియో ఇలా ఉండేది

రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌గా ’బంగార్రాజు’  రాబోతోంది. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య, కృతి శెట్టి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  టైటిల్ రోల్ లో నాగార్జున, నాగ్ కి జోడీగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను జీ స్టూడియోస్‌తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. అనూప్ రెబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నాడు. చిత్రంలో చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Also Read: ఈ వారం సందడే సందడి..’లవ్ స్టోరీ’, ‘ఆకాశవాణి’, ‘పరిణయం’, ‘మోదీ బయోపిక్’, ‘మరో ప్రస్థానం’ అన్నీ ఈ వారమే...

Also Read: స్టూడెంట్ బుగ్గ కొరికిన హెడ్ మాస్టర్…స్కూల్లోనే ఉతికి ఆరేసిన తల్లిదండ్రులు

Also Read: గర్భం దాల్చిన మహిళ.. విషయం తెలిసి ఇద్దరు ప్రియుల ఫైటింగ్.. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే..

Published at : 20 Sep 2021 12:30 PM (IST) Tags: Akkineni Nagarjuna ANR Jayanthi Special Pays Special Tribute Panchakattu Father ANR

సంబంధిత కథనాలు

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

NTR: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను - ఎన్టీఆర్ థాంక్యూ లెటర్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

Bindu Madhavi: ‘నువ్వు టైటిల్‌కు  అర్హురాలివి’ ఆడపులికి సపోర్ట్ చేస్తున్న పాయల్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

F3 Movie: 'ఎఫ్3' సెన్సార్ టాక్ - క్లీన్ ఎంటర్టైనర్

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ

Sanjanaa Galrani: మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ సంజన గల్రానీ
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం

Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం