Crime News: స్టూడెంట్ బుగ్గ కొరికిన హెడ్ మాస్టర్…స్కూల్లోనే ఉతికి ఆరేసిన తల్లిదండ్రులు
‘విద్యాలయం’ పేరులోనే ఆలయం అనే మాట ఉంది. అలాంటప్పుడు అక్కడ వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉండాలి. విధులు నిర్వర్తించేవారు ఎంత ఉన్నతంగా ఆలోచించాలి. కానీ ఓ హెడ్ మాస్టర్ స్టూడెంట్ తో ఎలా ప్రవర్తించాడో తెలుసా..
దేవాలయంలో దేవుడు విద్యాలయంలో ఉపాధ్యాయుడు ఇద్దరూ సమానమే. దేవుడున్నాడో లేదో అన్నది ఎవరి విశ్వాసం వాళ్లది కానీ అజ్ఞానం అనే చీకటిని తరిమేసి జ్ఞానాన్నిచ్చేది గురువు అన్నది అందరికీ తెలిసిందే. మరి అలాంటి గురువే అజ్ఞానాంధకారంలో కూరుకుపోతే…అక్కడ విద్యనభ్యసిస్తున్న పిల్లల పరిస్థేతేంటి. కొందరు ఉపాధ్యాయుల అసభ్య ప్రవర్తన కారణంగా ఆ వృత్తిపై ఉన్న గౌరవం నానాటికీ దిగజారిపోతోంది. పైగా హెడ్ మాస్టర్ అంటే మొత్తం పాఠశాలనే చక్కదిద్దాల్సిన వ్యక్తి. అలాంటిది ఆయనే వెకిలి వేషాలేస్తే ఏం చేయాలి.
Alos Read: ఓ భర్త..ఓ భార్య..ఇద్దరు ప్రియులు..ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరు..
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ హెడ్ మాస్టర్ నీచానికి ఒడిగట్టాడు. నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ విద్యార్థిని బుగ్గ కొరకడంతో ఆ చిన్నారి కేకలు వేసింది. ఆవిషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ హెడ్ మాస్టర్ ను స్కూల్ గదిలో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన బీహార్ లోని కతిహార్ జిల్లా పిప్రి బహియార్ లోని ప్రాథమిక పాఠశాలలో జరిగింది. పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత ఉగ్రరూపం చూపిన బాలిక తల్లిదండ్రులు, బంధువులు.. హెడ్ మాస్టర్ ను బయటకు లాగి పోలీసుల ముందే కర్రలతో చితకబాదారు. వారిని ఆపడం పోలీసులకు కూడా చాలా కష్టమైంది. ఎలాగోలా వారి బారి నుంచి తప్పించిన ఆ కీచక హెడ్ మాస్టర్ ను స్టేషన్ కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందో అర్థం కాలేదని..తన బుర్ర పనిచేయలేదన్నాడు నిందితుడు. మరోవైపు హెడ్ మాస్టర్ ని చితకబాదిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: అలర్ట్..అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాాళ వర్షాలు..
ఈఒక్క ఘటనే కాదు నిత్యం ఎక్కడోచోట కీచక ఉపాధ్యాలు బాగోతాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. పాఠశాల స్థాయి నుంచి కళాశాల, విశ్వవిద్యాలయాలు, చివరికి ఉద్యోగాలు చేసే ప్రదేశాల్లోనూ బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరు ధైర్యంగా బయటకొచ్చి కీచకులకు తగిన శాస్తి చెబుతున్నారు..మరికొందరు ఎందుకొచ్చిన గొడవ అని మరోసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉంటున్నారు. అయితే ఎన్ని ఘటనలు వెలుగులోకి వచ్చినా..ఎంత కఠినమైన చర్యలు తీసుకుంటున్నా రోజురోజుకీ ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ALso Read: ఆ నాలుగు రాశులవారికి మినహా మిగిలిన వారికి ఈ రోజంతా శుభసమయమే…ఏ రాశిఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Also Read: సాయిపల్లవిని చూస్తూ ఉండిపోయా.. సినిమా ఆఫర్ ఇస్తే రిజెక్ట్ చేసింది.. చిరు మాటలకు హీరోయిన్ షాక్..
Also Read: స్థిరంగా పసిడి ధరలు.. దిగొచ్చిన వెండి.. మీ ప్రాంతాల్లో తాజా రేట్లు ఇలా..