By: ABP Desam | Updated at : 19 Sep 2021 06:10 AM (IST)
Edited By: RamaLakshmibai
2021 సెప్టెంబరు 19 నుంచి 25 వరకూ వార ఫలాలు
ఈ వారం మేషరాశివారు ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. వారం మొదట్లో ఉన్న చిన్న చిన్న టెన్షన్లు వారాంతానికి తగ్గుతాయి. వ్యాపారస్తులు లాభపడతారు. దూర ప్రాంత ప్రయాణాలకు ఈ వారం అనుకూల సమయం. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఈ వారం స్నేహితులు, బంధువులను కలుస్తారు. వృద్ధులకు ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండొచ్చు.
మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు చేస్తారు. ఈ వారం ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సహాయంతో పనులు పూర్తిచేస్తారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు ఉపాధ్యాయుల మద్దతు లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
వారం ప్రారంభంలో శుభవార్తలు వింటారు. లావాదేవీలు జరిపేందుకు ఈ వారం అనుకూలం. ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. వారాంతంలో కొన్ని అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. శత్రువు పై ఆధిపత్యం చెలాయిస్తారు. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. కార్యాలయ వాతావరణం సాధారణంగా ఉంటుంది. యువత కెరీర్ ఊపందుకుంటుంది. ప్రయాణాలు వాయిదా వేయండి.
ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మీ ప్రత్యర్థులు ఈ వారం చురుకుగా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి. కుటుంబ అవసరాలు తీరుస్తారు. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు. మానసికంగా దృఢంగా ఉండండి. కొన్ని పనులలో అంతరాయం ఏర్పడవచ్చు. ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. వారం మధ్యలో ధన లాభం ఉండొచ్చు.
పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులేసేందుకు అనుకూల సమయం. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు వెంటాడవచ్చు. ప్రయాణ సమయంలో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. దానధర్మాలు చేయండి. వారం మధ్యలో అదృష్టం కలిసొస్తుంది. కొత్త బాధ్యతలు తీసుకుంటారు.
మీకు ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా కలిసొస్తుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు కొత్త ప్రణాళికలను రూపొందించవచ్చు. విద్యార్థుల సమస్యలు తొలగిపోతాయి.
కొత్త ప్రణాళికలు అమలుచేసే అవకాశం లభిస్తుంది. యువత ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని పొందుతారు. వృద్ధులకు అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. రుణం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అప్పుల నుంచి బయటపడతారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.
ఈ వారం మీరు శుభవార్త వింటారు. స్నేహితుల సహాయంతో పనులు పూర్తవుతాయి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. వారం మధ్యలో సమస్యలను ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీరు మానసికంగా బలంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండండి.
అప్పు చేయాల్సిన పరిస్థితులు రావొచ్చు. వివాదానికి దూరంగా ఉండండి. చేపట్టిన పనిని ఎలగైనా పూర్తిచేసేందుకు ప్రయత్నించండి…ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయవద్దు. ప్రస్తుతానికి పెట్టుబడి ఆలోచన వదులుకోండి. వ్యాపారస్తులు విజయం సాధిస్తారు. కొత్త ప్రణాళికను అమలు చేయవచ్చు. అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశం ఉంది.
ఈ వారం మీరు తెలియని వ్యక్తుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. పూర్వీకుల విషయాల్లో మీరు అసమ్మతిని ఎదుర్కోవచ్చు. సహోద్యోగుల సహకారం పొందుతారు. మీ బాధ్యతను సకాలంలో పూర్తి చేయగలరు. దినచర్యలో మార్పులొస్తాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.
ఈ వారం కొత్త సమాచారం అందుబాటులో ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. డబ్బు చేతికందే అవకాశం ఉంది. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మీ నైపుణ్యంతో అధిగమిస్తారు. మతపరమైన కార్యక్రమాలు ఇంట్లో జరుగుతాయి.
ఈ వారమంతా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. చాలామంది సమస్యలు పరిష్కరిస్తారు. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. ఏదో విషయంపై ఒత్తిడికి గురవుతారు. లావాదేవీల విషయంలో అప్రమత్తత అవసరం. మానసికంగా మీరు బలంగా ఉంటారు. రిస్క్ తీసుకోవద్దు.
Also Read: నదిలో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా?
Spirituality: అష్ట (8), అష్టాదశ (18) - ఈ సంఖ్యలు హిందువులకు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!
జూన్ 2023 రాశి ఫలాలు: జూన్ నెలలో ఈ రాశులవారికి ఎదురులేదు, ఆ రెండు రాశులపై కుజుడి ప్రభావం
జూన్ 1 రాశిఫలాలు, ఈ రాశులవారిపై ఈ రోజు లక్ష్మీదేవి కరుణాకటాక్షాలుంటాయి!
Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!
Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !