Madhura Nidhivan Temple: అర్థరాత్రి వేణుగానం, గజ్జెల శబ్దాలు…ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతుచిక్కని రహస్యం..ఆ ఆలయంలో చీకటి పడ్డాక ఏం జరుగుతుంది..!
నాస్తికులకు, హేతువాదులకు కూడా ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం అది. అక్కడ దేవుడు లేడని నిరూపించేందుకు అర్థరాత్రి కాపుకాసినా, కెమెరాలు పెట్టినా కనిపెట్టలేకపోయారు. ఇంతకీ ఎక్కడుందా ఆలయం..ఏం జరుగుతుందక్కడ..!
మన దేశంలో ఎన్నో ప్రాంతాలు అంతుచిక్కని రహస్యాలుగా మిగిలిపోయాయి. వాటిలో కొన్ని చారిత్రక ప్రదేశాలైతే మరికొన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలు. వాటి వెనుకున్న అసలు విషయాన్ని చేధించి ప్రపంచానికి చాటిచెప్పాలని ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. అలాంటి ప్రదేశాల్లో ఒకటి మధురలో నిధివన్. ఇక్కడ అర్థరాత్రి ఏం జరుగుతుందో తెలుసుకుందామనుకున్నప్పటీ ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అది రహస్యంగానే మిగిలిపోయింది.
ఉత్తర ప్రదేశ్ రాష్ర్టంలోని మధుర జిల్లా బృందావనలోని ఉంది నిధివన్. ఈ స్థలం ప్రత్యేకత ఏంటంటే ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ప్రతి రోజూ రాధను కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేవాడని చెబుతారు. అది ఇప్పటికీ కొనసాగుతుందని చెబుతుంటారు. అదృశ్య రూపంలో రాధాకృష్ణులు గోపికలతో కలసి ఇక్కడ రాత్రిపూట నాట్యం చేస్తుంటారని చెబుతారు. ఆ సమయంలో కృష్ణుడి భటులు రాత్రి పూట ఈ నిధివన్ చుట్టూ అదృశ్య రూపంలో కాపాలా కాస్తూ కృష్ణుడి ఏకాంతానికి భంగం కలగకుండా చూస్తారని చెబుతారు. అందుకే నిధివన్ లోని ప్రధాన ఆలయం ద్వారాలను సూర్యాస్తమయం అయిన వెంటనే మూసివేస్తారు. నిధివన్ కు ప్రవేశించే ద్వారానికి ఏకంగా తాళం పెట్టేస్తారు.
మనుషులే కాదు పక్షులు కూడా వెళ్లవు: చీకటి పడిన తర్వాత మనుషులు మాత్రమే కాదు పక్షులు కూడా ఇక్కడకు వెళ్లవంటారు. ఇందుకు నిదర్శనం ఏంటంటే పగలంతా ఆ వనంలో ఉండే వందల సంఖ్యలో కోతులు, పక్షులు కూడా చీకటిపడగానే ఏమైపోతాయో తెలియదని చెబుతారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆతృతతో ఎవరైనా సహాసం చేసినా చనిపోవడమో, మతిస్థిమితం కోల్పోవడమో జరుగుతుందని స్థానికుల విశ్వాసం. గతంలో అలా జరిగిందని కూడా కథలు కథలుగా చెబుతారు. పైగా ఆ వనానికి చుట్టూ ఉన్న ఏ ఇంటికీ ఎంట్రన్స్ అటువైపు ఉండదు. పైగా చీకటి పడగానే అటువైపు ఉన్న కిటికీలు కూడా మూసేస్తారట.
అర్థరాత్రి శబ్దాలు: ఇప్పటికీ రాథాకృష్ణులు అక్కడ ఏకాంతంగా గడుతారని ఇందుకు నిదర్శనంగా రాత్రివేళ గజ్జెల శబ్దం, వేణనాదం వినిపిస్తాయని అక్కడి చుట్టుపక్కల వారు చెబుతారు. కృష్ణుడి వేణుగానం, గోపికల నృత్యంచేయడం వల్ల గజ్జెల శబ్దం వస్తుందంటారు. ఇక్కడి మరో ప్రత్యేకత ఏంటంటే మొక్కల కాండాలన్నీ ఒకేలా ఉంటాయి. చుక్కనీరు పోయకపోయినా పచ్చగా కళకళలాడుతుంటాయంటే అదంతా కృష్ణమాయ అంటారు. వనం మధ్యలో ఉన్న రంగమహల్ లోనే రాధ, కృష్ణులు నాట్యం తర్వాత ఏకాంతంగా గడుపుతారని పూజారులు చెబుతారు. అందువల్లే రాత్రి ఆలయ ద్వారం మూసే ముందు అలంకరించిన మంచం, ఓ వెండి గ్లాను నిండా పాలు, స్వీట్స్, పళ్లు, తాంబూలం, అలంకార వస్తువులు అక్కడ ఉంచుతారట. ఆలయ ద్వారం తీసే సమయానికి తాంబూలం తిని ఉమ్మిన గుర్తులు, పాలు తాగిన ఆనవాళ్లతో పాటూ మంచంపై దుప్పటి చెదిరి ఉంటుందట. వేల సంవత్సరాలుగా ఇదే తంతు జరుగుతోందని చాలామంది భక్తులు చెబుతారు. ఇక్కడ ఏం జరుగుతోందో వాస్తవం తెలుసుకుంటామంటూ ఎందరో నాస్తికులు, హేతువాదులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదని దేవుడున్నాడని చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శం ఏంటంటారు కృష్ణ భక్తులు.