Horoscope Today : ఈ రోజు ఈ రాశికి చెందిన వారు ప్రత్యర్థుల వల్ల ఇబ్బంది పడతారు, వీరికి తొందరపాటు తగదు..ఏ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాం..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
2021 సెప్టెంబరు 19ఆదివారం రాశిఫలాలు
మేషం
మీరు ఈ రోజు శుభవార్త వింటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమికులు ఈరోజు దూకుడుగా వ్యవహరించవద్దు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు. సమయానికి తన బాధ్యతలు నిర్వర్తిస్తారు. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ఈరోజు అలసటగా అనిపించవచ్చు.
వృషభం
వృషభ రాశివారికి కలిసొచ్చే రోజు. పెట్టిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. రిస్క్ తీసుకోవద్దు. విద్యార్థులు చదువుని నిర్లక్ష్యం చేస్తారు.
మిథునం
గతంలో చేసిన పని ఫలితం విషయంలో ఓపికగా ఉండాలి. అసహనం చూపవద్దు. లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఈరోజు అంత అనుకూలమైన రోజు కాదు. ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ రోజు పిల్లలతో సమయం గడపండి. రిస్క్ తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉంటుంది.
కర్కాటక రాశి
ఈరోజు మంచి రోజు అవుతుంది. బంధువులతో మీ వివాదం పరిష్కారమవుతుంది. సామాజిక సేవలో పాల్గొంటారు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. మీ దినచర్యలో మార్పు ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెండింగ్ పని పూర్తవుతుంది. ఉద్యోగస్తులకు పురోభివృద్ధి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
సింహం
మీరు చేసే పని పట్ల సీరియస్‌గా ఉండాలి. ప్రత్యర్థుల నుంచి ఆటంకం ఎదురవొచ్చు. మీ పనిని ప్రశాంతంగా, సహనంతో చేయండి. ఉదర సంబంధిత సమస్య ఉండొచ్చు. స్నేహితులు లేదా బంధువులను కలుస్తారు. ఈ రోజు మీరు సానుకూలంగా ఉంటారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది.
కన్య
ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ప్రయాణాలు చేయవద్దు. ప్రస్తుతానికి పెట్టుబడి ఆలోచన వదులుకోండి. విద్యార్థులు కష్టపడక తప్పదు. తల్లిదండ్రులతో సమయం గడపండి. ఏదైనా పనిని పూర్తి చేయడంలో స్నేహితుల సహకారం ఉంటుంది. కష్టపడి డబ్బు సంపాదించే అవకాశం వస్తుంది.
Also read: అవార్డులన్నీ మహేష్, నానిలకే.. బెస్ట్ హీరోగా సూపర్ స్టార్, బెస్ట్ హీరోయిన్ గా సమంత..
తులారాశి
వ్యాపారులకు మంచి రోజుది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఓ పనిలో బిజీగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలు ఉండొచ్చు. కుటుంబ బాధ్యతలను కూడా మెరుగైన రీతిలో నిర్వర్తించగలరు. ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంటుంది. అప్పుల నుంచి బయటపడతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలున్నాయి. మానసిక ఒత్తిడి తొలగి పోతుంది.
వృశ్చికరాశి
కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మంచి రోజు. జీవిత భాగస్వామి కారణంగా కొంత టెన్షన్ ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. చిరాకు పెరుగుతుంది. చేసిన పనిలో ఆశించిన విజయం అందుకోలేరు. ప్రశాంతంగా ఉండండి. కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయవద్దు. వ్యాపారంలో లాభం ఉంటుంది.
Also Read: హౌస్ మేట్స్ కి క్లాస్ పీకిన నాగ్.. ఈ వారం ఆ ముగ్గురూ సేఫ్..
ధనుస్సు
వివాదాలు తలెత్తవచ్చు. చేపట్టిన పని పూర్తి చేయడం కష్టం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో సమయాన్ని గడపగలుగుతారు.
Also Read: ‘హనుమాన్ ఫ్రం అంజనాద్రి’ అంటూ మరో కాన్సెప్ట్ తో ఆసక్తి పెంచిన జాంబిరెడ్డి దర్శకడు ప్రశాంత్ వర్మ
మకరం
అనవసరమైన ఖర్చులను నియంత్రించండి. కొత్త వ్యక్తులను కలిసే అవకాశం లభిస్తుంది. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మార్పు ఉండొచ్చు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారవేత్తలు కొత్త ప్రణాళికలు రూపొందించవచ్చు. పెండింగ్ పనులు పూర్తవుతాయి. సామాజిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం
డబ్బు సంపాదించేందుకు మంచి అవకాశాలున్నాయి. చాలా కాలం తర్వాత పాత స్నేహితులను కలుస్తారు. జీవనశైలిలో మార్పు ఉంటుంది. సమాజంలో హోదా పెరుగుతుంది. విద్యార్థులకు మంచి రోజు. వ్యాపారంలో లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ అవసరాలను తీర్చగలుగుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
మీనం
వ్యాపార ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది. ఖర్చు పెరుగుతుంది. ప్రస్తుతానికి కొత్త ప్రణాళికలు వేసుకోవద్దు. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. స్నేహితుల నుంచి సహాయం పొందుతారు. చేపట్టిన పని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.
Also Read: పవన్ కళ్యాణ్-రానా ‘భీమ్లానాయక్’ లో నిత్యామీనన్ తో పాటూ మరో మీనన్..రానాకు జోడీగా మలయాళ మారుతం..
Also Read: ‘MAA’ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది..షెడ్యూల్,నియమనిబంధనలు ఇవే..