Bigg Boss 5 Telugu: హౌస్ మేట్స్ కి క్లాస్ పీకిన నాగ్.. ఈ వారం ఆ ముగ్గురూ సేఫ్..
ఎప్పటిలానే హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున..
ఎప్పటిలానే హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. శుక్రవారం ఎపిసోడ్ హైలైట్స్ ను చూపించారు.
అందులో జెస్సీ, షణ్ముఖ్ లు శ్రీరామచంద్ర గురించి మాట్లాడుకున్నారు. అమ్మయిలందరినీ కావాలనే కవర్ చేస్తున్నాడని.. అలా చేస్తే పులిహోర అనే ముద్ర పడుతుందే కానీ ఓట్లు రావంటూ తన అభిప్రాయాన్ని చెప్పాడు షణ్ముఖ్. అనంతరం జైల్లో ఉన్న సన్నీను బిగ్ బాస్ రిలీజ్ చేశాడు. ఉమాదేవి, లోబోల రొమాన్స్ చూడడానికి చాలా ఎబ్బెట్టుగా అనిపించింది.
చరణ్ ఎంట్రీ..
Vinodame ikkada mana sontham! Blockbuster Movies, Telugu Hotstar Specials, Sports and so much more! Swagatam palukutondi #ManaVinodaVishwam @DisneyPlusHS pic.twitter.com/ZTXJQuZvoD
— Ram Charan (@AlwaysRamCharan) September 18, 2021
బిగ్ బాస్ టీవీలో 'మన వినోద విశ్వం' అనే ట్యాగ్‌లైన్‌తో రామ్ చరణ్ డిస్నీ హాట్ స్టార్‌ను ప్రమోట్ చేస్తోన్న యాడ్ ను ప్రసారం చేసి రామ్ చరణ్ ను స్టేజ్ పైకి పిలిచారు నాగార్జున. స్టేజ్ పైకి వచ్చిన చరణ్ ను.. 'ఆర్ఆర్ఆర్' ఎలా వస్తుందని ప్రశ్నించారని నాగ్. దానికి చరణ్.. 'నాక్కూడా అదే క్వశ్చన్.. మేం నటించిన షాట్స్ కూడా మాకు చూపించట్లేదు..' అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆచార్య గురించి మాట్లాడుతూ.. తన తండ్రితో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేనని.. బెస్ట్ మూమెంట్స్ అని చెప్పుకొచ్చారు చరణ్. సాయి ధరమ్ తేజ్ హెల్త్ గురించి చరణ్ ను అడిగి తెలుసుకున్నారు నాగ్. ప్రస్తుతం తేజు చాలా బావున్నాడని.. మెల్లగా రికవర్ అవుతున్నాడని వివరించారు చరణ్.
- ఆ తరువాత చరణ్ ను బిగ్ బాస్ టీవీలో చూసిన హౌస్ మేట్స్ థ్రిల్ ఫీల్ అవుతూ.. అందరూ లేచి నిల్చొని వెల్కమ్ చెప్పారు. అది చూసిన నాగ్.. 'గుర్తు పెట్టుకుంటాను.. నేనొచ్చినప్పుడు ఎవరూ లెగలేదు' అంటూ హౌస్ మేట్స్ ని ఆటపట్టించాడు. అనంతరం రామ్ చరణ్ 'ఈరోజు నేను కొంచెం లోబోలాగా డ్రెస్ అయి వచ్చినా' అంటూ చెప్పగా.. లోబో మోకాళ్లపై నుంచొని దండం పెట్టాడు.
- ఆ తరువాత నాగ్.. ఉమాదేవిని పరిచయం చేస్తూ.. 'చాలా మంది మనిషి.. మాటలు కొంచెం అప్పుడప్పుడూ.. బూతులు మాట్లాడుతుంది' అనగానే చరణ్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ ఆకట్టుకుంది. 'మీతో వర్క్ చేయాలనుకుంటున్నా' అంటూ శ్వేతా.. రామ్ చరణ్ కి చెప్తుండగా.. 'పైకి అలా మాట్లాడుతుంది చరణ్.. కానీ చాలా వైల్డ్' అంటూ కౌంటర్ వేశారు. నటరాజ్ మాస్టర్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు.. చరణ్ తో తనకున్న మెమరీను గుర్తు చేసుకున్నారు. యాంకర్ రవిని ఆటపట్టించాడు రామ్ చరణ్. ప్రియాంకను పరిచయం చేస్తూ.. 'ఇంత అందమైన అమ్మాయిని ఎక్కడా చూడలేదంటూ' నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చారు.
- సిరిని పరిచయం చేస్తూ.. 'గొంతులో మైక్ పెట్టేసుకుందంటూ' నాగ్ కామెంట్ చేశారు.ఆ తరువాత ప్రియా.. చరణ్ ను హౌస్ లోపలకి పంపించమని నాగ్ ని రిక్వెస్ట్ చేయగా.. 'రెండు వారాలు ఉంచేద్దామా లోపల' అని నాగ్ అనగా.. 'హ్యాపీగా' అంటూ ఆన్సర్ చేసింది ప్రియా. యానీని పరిచయం చేసినప్పుడు చరణ్ ఆమెని పొగుడుతూ కొన్ని మాటలు చెప్పారు. ఆ తరువాత షణ్ముఖ్.. చరణ్ కి లవ్యూ సర్ అని చెప్పాడు. అది విన్న నాగ్.. 'ఇప్పుడు నీకు చెప్తున్నాడు.. రోజూ మాత్రం దీప్తికి చెప్తాడు' అని సెటైర్ వేయగా.. అందరూ నవ్వేశారు.
- శ్రీరామ్ చంద్రను హౌస్ లో చూడడం చాలా సంతోషంగా ఉందని రామ్ చరణ్ అన్నారు. అతడితో 'బంగారు కోడిపెట్ట' సాంగ్ పాదిచుకున్నారు రామ్ చరణ్. హమీదకి చరణ్ హాయ్ చెప్పగా.. 'హమీదాను ప్రేమించడానికి శ్రీరామ్ ట్రై చేస్తున్నాడు.. కానీ హమీద మాత్రం ఇప్పటివరకు ఎస్ చెప్పలేదు' అంటూ డైలాగ్స్ వేశారు నాగ్. ఆ తరువాత చరణ్ కు మానస్ ని ఇంట్రడ్యూస్ చేశారు నాగ్. హౌస్ మేట్స్ ని ఉద్దేశిస్తూ.. 'డోంట్ బి టూ హ్యాపీ.. చాలా సెట్ చేయాలి' అంటూ వార్నింగ్ ఇచ్చారు నాగ్.
బిగ్ బాస్ సెట్ లో 'మ్యాస్ట్రో' టీమ్..
నాగార్జున దగ్గర నుంచి కాసేపు బిగ్ బాస్ స్టేజ్ తీసుకున్న రామ్ చరణ్.. 'మాస్ట్రో' టీమ్ ను స్టేజ్ పైకి ఆహ్వానించారు. సినిమాలో హీరో నితిన్ అంధుడిగా కనిపించిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ స్టేజ్ మీదకు కూడా అలానే వచ్చాడు నితిన్. తమన్నా దగ్గరుండి మరీ నితిన్‌ను తీసుకొచ్చింది. ఇక అలా స్టేజ్ మీదకు వచ్చిన నితిన్.. రామ్ చరణ్ ముందు అంధుడిగా నటించాడు. ఏదీ కనబడనట్టుగా రామ్ చరణ్ బాడీని పట్టుకుని తడిమాడు. సినిమాలో అందరినీ ఆడించావ్.. ఇక్కడ కూడా అవసరమా? అని నితిన్‌కు చెర్రీ కౌంటర్ వేశాడు.
సినిమా సంగతుల గురించి చరణ్.. నితిన్ ని అడగ్గా.. సైకో విలన్ గా యాక్ట్ చేసిన తమన్నా చెబుతుందంటూ ఆమెకి మైక్ ఇచ్చాడు నితిన్. ఆ తరువాత ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు.. రిస్క్ అవసరమా అనిపించింది కానీ నటుడిగా ఇలాంటి సినిమాలు చేయాలని ఒప్పుకున్నా.. ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుందని నితిన్ చెప్పుకొచ్చాడు.
#Maestro celebrates the success with #BiggBoss tonight along with @AlwaysRamcharan who marks his debut as the Official Ambassador for @DisneyPlusHs Great fun shooting for this special show! 😎😎@IamNagarjuna @Tamannaahspeaks @NabhaNatesh
— nithiin (@actor_nithiin) September 18, 2021
#BiggBossTelugu5 @StarMaa pic.twitter.com/jwWLl8OxMU
క్లాస్ పీకిన నాగార్జున..
హౌస్ లో అందరూ ఆటలు బాగా ఆడారని.. కానీ బిహేవియర్ బాలేదని నాగార్జున అన్నారు. ఆడియన్స్ దగ్గర నుంచి కూడా అదే ఫీడ్ బ్యాక్ వచ్చిందని.. ఎవరెవరు బిహేవియర్ బాలేదని అనుకుంటున్నారో వాళ్లను నుంచోమని చెప్పారు నాగ్. వెంటనే.. ఉమాదేవి, శ్వేతావర్మ, సిరి, యానీ మాస్టర్, లోబో, శ్రీరామ్ చంద్ర, సన్నీ.
- నామినేషన్స్ లో ఆవేశంతో అసభ్యపదజాలం వాడినట్లు నెక్స్ట్ టైమ్ రిపీట్ చేయనని తెలిపింది ఉమాదేవి. హౌస్ మేట్స్ కి, ఆడియన్స్ కు మూడు గుంజీలు తీసి క్షమాపణలు చెప్పమని నాగ్ చెప్పడంతో.. సారీ చెబుతూ.. గుంజీలు తీసింది.
- నామినేషన్స్ సమయంలో ఫ్లోలో మానస్ ని రెండు మాటలు అనేశానని.. అండ్ టాస్క్ లో హెల్త్ ఇష్యూస్ కారణంగా గేమ్ ఆడలేకపోయానని చెప్పాడు లోబో. బిగ్ బాస్ షో అయ్యేలోగా.. 'నో మోర్ సిగరెట్స్' అని నాగ్ చెప్పగా.. మానేస్తానని చెప్పాడు లోబో.
- ఉమా గారితో హీట్ ఆర్గుమెంట్ అయినప్పుడు కొంచెం ఎమోషనల్ అయి అరిచానని.. అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో అని యానీ మాస్టర్ చెప్పగా.. అందులో తప్పు లేదని.. ఎలాంటి బూతులు రాలేదని ఆమెని సపోర్ట్ చేశారు నాగార్జున.
- నామినేషన్స్ సమయంలో హమీద ముఖం మీద కొట్టినట్లుగా పెయింట్ పూసానని తన తప్పుని ఒప్పుకుంది శ్వేతావర్మ. తన తప్పుకి శిక్షగా.. అందరి ముందు తన రెండు చేతులతో మొహం మీద రెండు దెబ్బలు కొట్టుకుంది.
- సన్నీ, సిరి ఇష్యూ డిస్కషన్ కి రాగా.. తన టీషర్ట్ లోపల సన్నీ చేయి పెట్టాడని సిరి, పెట్టలేదని సన్నీ నాగార్జునకు చెప్పారు. దీంతో వీడియో ప్లే చేసి చూపిస్తానని.. ఆ తరువాత నిర్ణయం కెప్టెన్ చెప్పాలని నాగ్ సూచించారు. ఆ వీడియోలో సన్నీ చేయి పెట్టలేదని క్లియర్ గా కనిపించింది. దీంతో నాగ్.. సిరికి క్లాస్ పీకి నిజాలు తెలియకుండా క్యారెక్టర్ అసాసినేషన్ చేయకూడదని చెప్పారు. దీంతో సన్నీకి సారీ చెప్పింది సిరి. ఆ ఇష్యూని క్లియర్ చేసినందుకు నాగార్జునకు థాంక్స్ చెప్పాడు సన్నీ.
ఇక నామినేషన్స్ లో ఉన్న ఏడుగురిలో యానీ మాస్టర్, లోబో సేఫ్ అయ్యారు. ఆ తరువాత మరో టాస్క్ తో ప్రియాంక సేఫ్ అయినట్లు నాగార్జున వెల్లడించారు.