Bheemla Nayak Update: పవన్ కళ్యాణ్-రానా ‘భీమ్లానాయక్’ లో నిత్యామీనన్ తో పాటూ మరో మీనన్..రానాకు జోడీగా మలయాళ మారుతం..
‘భీమ్లానాయక్’ లో పవన్ కి జోడీగా నిత్యామీనన్, రానాతో ఐశ్వర్యా రాజేశ్ అన్నారు. అయితే ఐశ్వర్యా రాజేశ్ విషయంలో క్లారిటీ రాలేదు. ఇప్పుడు రానా భార్య పాత్రలో మరో పేరు తెరపైకి వచ్చింది. ఈమె ఫైనల్ అని టాక్..
ఎప్పుడెప్పుడు వస్తుందా అని టాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి ‘భీమ్లానాయక్’. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ సినిమాకి సాగర్ చంద్ర దర్శకుడు. ఇప్పటికే విడుదలైన టీజర్ తోపాటు భీమ్లా నాయక్ టైటిల్ ట్రాక్ కు విశేషమైన స్పందన వచ్చింది. తాజాగా విడుదల చేసిన రానా ఫస్ట్ లుక్ కూడా అదుర్స్ అనిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్, రానాకు జోడీగా ఐశ్వర్యా రాజేశ్ నటిస్తోందని అన్నారు. అయితే నిత్యామీనన్ విషయంలో ఎలాంటి మార్పూ లేదుకానీ…ఐశ్వర్యా రాజేశ్ స్థానంలో మరో మీనన్ వచ్చి చేరిందని టాక్. మలయాళ నటి సంయుక్త మీనన్ ని రానాకు జోడీగా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అఫీషియన్ల్ అనౌన్స్ మెంట్ ఒక్కటే పెండింగ్ అని టాలీవుడ్ సర్కిల్ టాక్
Get ready to experience the #BLITZofDANIELSHEKAR, @RanaDaggubati from 20th Sept💥#BheemlaNayak @pawankalyan #Trivikram @MenenNithya @MusicThaman @saagar_chandrak @dop007 @NavinNooli @vamsi84 @adityamusic pic.twitter.com/2BYtBOzLEK
— Sithara Entertainments (@SitharaEnts) September 17, 2021
ఈ చిత్రంలో రానా డానియల్ శేఖర్ పాత్రలో నటిస్తున్నాడు. మొన్నటి వరకూ ‘భీమ్లానాయక్’ అంటే పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే అన్నట్టు చేస్తున్నారు కానీ రానాకి సంబంధించి ఏ అప్ డేట్ ఇవ్వలేదనే విమర్శలొచ్చాయి. దగ్గుపాటి అభిమానులు ఈ విషయంపై హర్ట్ అయ్యారు కూడా. దీంతో శుక్రవారం సాయంత్రం రానా పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్ రానా ఫస్ట్ గ్లింప్స్ కోసం ఎదురుచూడాలని ట్వీట్ చేశారు. ఇందులో డేనియల్ శేఖర్ తెల్ల లుంగీ కట్టుకుని కనిపించాడు. ఓ చెత్తో లుంగీ పట్టుకుని ..మరో చేత్తో పిడికిలి బిగించి ఉన్నాడు. మాతృకలో ఇదే పాత్రను పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించాడు. ఓరిజినల్ లో ఆపాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది..మరి రానా క్యారెక్టర్ ని రీమేక్ వెర్షన్లో ఎలా చూపించారో చూడాలి.
Also Read: ‘MAA’ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది..షెడ్యూల్,నియమనిబంధనలు ఇవే..
మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్ గా భీమ్లానాయక్ తెరకెక్కుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. భీమ్లా నాయక్‌లో పవన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా.. రానా డానియల్ శేఖర్‌గా అలరించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పవన్ ఫస్ట్ గ్లింప్స్, టైటిల్ సాంగ్ కి ఏ రేంజ్ లో స్పందన వచ్చిందో చూశాం. రానా ఫస్ట్ లుక్ కూడా బావుందనిపిస్తోంది. ‘భీమ్లానాయక్’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
Also Read:బ్లాక్ డ్రెస్సులో క్లీవేజ్ షో చేస్తున్న అందాల రాశి
Also read: బిగ్ బాస్ ఎపిసోడ్ 13: ఇంతులతో శ్రీరామ్.. బంతులతో బిగ్ బాస్.. హమీదాకు అంతా ఫిదా!
Also Read: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజుల వరకు వర్షాలు..