అన్వేషించండి
Advertisement
Nandita Swetha: హీరోయిన్ నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం..
ప్రముఖ సినీ నటి నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో నందిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ప్రముఖ సినీ నటి నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో నందిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తండ్రిని కోల్పోయిన విషయాన్ని నందిత సోషల్ మీడియాలో నేరుగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె పోస్ట్ పెడుతూ.. ''నా తండ్రి శ్రీ శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులందరికి ఈ విషయాన్ని తెలియజేయాలనుకున్నాను'' అంటూ రాసుకొచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకి సంతాపం తెలియజేస్తున్నారు. నందిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 'నంద లవ్స్ నందిత' అనే సినిమాతో నందిత నట జీవితాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత 2012లో 'అట్టకత్తి' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 2016లో తెలుగులో విడుదలైన 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
This is to inform all my wellwishers that My father Mr.shivaswamy aged 54 passed away today. May his soul rest in peace
— Nanditaswetha (@Nanditasweta) September 19, 2021
Sorry for your loss Nandita. May his soul RIP. More strength to you and the fam.
— ReginaaCassandraa (@ReginaCassandra) September 19, 2021
sorry nandita his blessings ll always be ther for u.
— aishwarya rajesh (@aishu_dil) September 19, 2021
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion