అన్వేషించండి

Hanuman: 'హనుమాన్'కు న్యాయం చేయాలి, నష్టాన్ని భరించాలి - ఎగ్జిబిటర్లకు TFPC లేఖ

Hanuman Vs Guntur Kaaram: 'హనుమాన్' థియేటర్స్ ఇష్యూలో తెలుగు సినిమా నిర్మాతల మండలి ఒక లేఖ విడుదల చేసింది. సినిమా నష్టాన్ని ఎగ్జిబిటర్లు నటించాలని అందులో కోరింది.

Telugu Film Producers Council on Hanuman Theaters Issue In Nizam: 'హనుమాన్' సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది. థియేటర్లకు ప్రేక్షకులకు క్యూ కడుతున్నారు. మార్నింగ్ టు మిడ్ నైట్... ప్రతి షో హౌస్ ఫుల్ అవుతోంది. అయితే... సినిమా చూడాలని కోరుకునే ఆడియన్స్ డిమాండ్ మేరకు షోలు పడటం లేదన్నది వాస్తవం. సంక్రాంతి బరిలో మహేష్ బాబు 'గుంటూరు కారం' ఉండటంతో మెజారిటీ థియేటర్లు ఆ సినిమాను ప్రదర్శిస్తున్నాయి. 

అసలే థియేటర్లు దొరకడం లేదంటే... ముందుగా అగ్రిమెంట్ చేసుకున్న నాలుగు థియేటర్లు (ఎగ్జిబిటర్లు) చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చి, పెద్ద సినిమా 'గుంటూరు కారం'ను ప్రదర్శించడం 'హనుమాన్' డిస్ట్రిబ్యూటర్లకు షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ ఇష్యూ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (TFPC)కి చేరింది. ఆ సమస్యపై నిర్మాతల మండలి ఓ లేఖ విడుదల చేసింది.

'హనుమాన్‌'కు న్యాయం చేయాలి!
''మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ 'హనుమాన్' సినిమా ప్రదర్శన కోసం జనవరి 12 నుంచి తెలంగాణలో కొన్ని థియేటర్లు వారితో అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ, సదరు థియేటర్ల వారు అగ్రిమెంట్ బేఖాతరు చేస్తూ నైజాం ఏరియాలో సినిమాను ప్రదర్శించలేదు.

ఆ విషయమై మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్, 'హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. థియేటర్ల అగ్రిమెంట్ ప్రకారం 'హనుమాన్' సినిమా ప్రదర్శన చేయకపోవడం వలన డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు అపార నష్టం జరిగింది. కాబట్టి ఆ థియేటర్లు వెంటనే 'హనుమాన్' ప్రదర్శనను ప్రారంభించడంతో పాటు ఇప్పటి వరకు జరిగిన నష్టం భరించాలి. థియేటర్ల వారి ఇటువంటి చర్యలకు పాల్పడటం వలన తెలుగు సినిమా పరిశ్రమ మనుగడకే ప్రమాదం. థియేటర్లు వారు చేసిన ఈ చర్యను తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీవ్రంగా ఖండిస్తోంది. ఇటువంటి అనైతిక చర్యలను నిరసిస్తూ నమ్మకం నైతికత నిబద్దత న్యాయం ఆధారంగా ముందుకు నడిచే యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ న్యాయానికి విరుద్ధంగా వ్యవహరించిన సదరు ఎగ్జిబిటర్లు ముందుగా చేసుకున్న ఒప్పందాన్ని గౌరవిస్తూ 'హనుమాన్' నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లకు సత్వర న్యాయం చేయాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కోరుతున్నది'' అని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి లేఖలో పేర్కొంది.

Also Read: సైంధవ్ రివ్యూ : సైకోగా వెంకటేష్ ఎలా చేశారు? ఆయన 75వ సినిమా హిట్టా? ఫట్టా?

నాలుగు థియేటర్లలో హనుమాన్ ప్రదర్శిస్తారా?ఇప్పుడు నైజాంలోని ఆ నాలుగు థియేటర్లలో 'హనుమాన్' చిత్రాన్ని ప్రదర్శిస్తారా? లేదంటే నిర్మాతల మండలి లేఖను బేఖాతరు చేస్తారా? అనేది చూడాలి. 'హను మాన్' బదులు ఆ థియేటర్లలో 'గుంటూరు కారం' ప్రదర్శించారు. అయితే... సూపర్ స్టార్ సినిమాకు సూపర్ హిట్ టాక్ రాలేదు. అందువల్ల, 'హనుమాన్' ప్రదర్శనకు ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు.

Also Read: గుంటూరు కారం రివ్యూ: మహేష్ బాబు ఎనర్జీ & ఆ మాస్ సూపర్, మరి సినిమా?

టాప్ హెడ్ లైన్స్

Romantic Drama OTT : ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ సడన్ స్ట్రీమింగ్ - 3 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చాయ్... తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ సడన్ స్ట్రీమింగ్ - 3 కోట్లు పెడితే 150 కోట్లు వచ్చాయ్... తెలుగులోనూ చూడొచ్చు
Karthika Deepam 2 Serial Today November 17th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న 2 కోట్లకి ప్రేమను అమ్ముకుంది.. సూరజ్ మనసు విరిచేసిన మాలిని! కార్తీక్, దీప రివేంజ్ తీర్చుకుంటారా!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న 2 కోట్లకి ప్రేమను అమ్ముకుంది.. సూరజ్ మనసు విరిచేసిన మాలిని! కార్తీక్, దీప రివేంజ్ తీర్చుకుంటారా!
Jagadhatri Serial Today Nov 16:జగధాత్రి,కేదార్‌ను ఇంటికి పిలిచి అవమానించిన రేఖ...పిన్నికి గట్టిగా బుద్ధి చెప్పిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్:జగధాత్రి,కేదార్‌ను ఇంటికి పిలిచి అవమానించిన రేఖ...పిన్నికి గట్టిగా బుద్ధి చెప్పిన ధాత్రి
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Lakshya Raichandani Reply: ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
ఆసియా కప్ ఫైనల్ సంబరాలపై విమర్శలకు భారత కెప్టెన్ దిమ్మతిరిగే సమాధానం, కుర్రాళ్లకు అండగా నిలిచిన బీసీసీఐ
Bigg Boss Season 10 Today November 16th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ పాయింట్స్ హైలెట్! వంశీని పొడిచేసిన త్రిగుణ్‌! 'మబ్బు' లేనిదే 'వర్షం' లేదు?
సింగిల్‌ ఛార్జ్‌తో Kia Syros EV నిజంగా ఎంత దూరం వెళ్తుంది? సిటీలో అదరగొట్టినా హైవేపై తగ్గిన రేంజ్!
Kia Syros EV రియల్‌ రేంజ్ టెస్ట్.. కంపెనీ చెప్పినట్లు నిజంగానే 526 కి.మీ. ప్రయాణించిందా?
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
BJP on Rahul Gandhi: భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
భారత్ సమ్మిట్ వేదికగా దేశ ప్రతిష్ఠను దెబ్బతీశారు - రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్
Crime News: పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
పోలీసు జీపు నుంచి లాగి మరీ చితక్కొట్టిన గ్రామస్తులు.. అంత దారుణం చేశాడు మరి!
Embed widget