అన్వేషించండి

Guntur Kaaram Movie Review - గుంటూరు కారం రివ్యూ : మహేష్ ఎనర్జీ, ఆ మాస్ సూపర్, మరి సినిమా?

Guntur Kaaram Review: సూపర్ స్టార్ మహేష్ బాబు, గురూజీ త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా 'గుంటూరు కారం'. ట్రైలర్, కుర్చీ మడతపెట్టి పాటలో మహేష్ మాస్ అవతార్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మరి, సినిమా?

Guntur Kaaram Movie Review in Telugu: సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు త్రివిక్రమ్ రెండు సినిమాలు తీశారు. 'అతడు', 'ఖలేజా' బాక్సాఫీస్ రిజల్ట్స్ పక్కన పెడితే... 'అతడు' క్లాసిక్స్ అనిపించుకుంది. 'ఖలేజా'లో మహేష్ కామెడీ టైమింగ్ సూపర్. పన్నెండేళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సినిమా చేస్తుండటంతో 'గుంటూరు కారం' మీద అంచనాలు ఏర్పడ్డాయి. 'కుర్చీ మడత పెట్టి...' సాంగ్ సినిమాకు కావాల్సిన ప్రచారాన్ని తీసుకొచ్చింది. మహేష్ బాబు మాస్ అవతార్, డ్యాన్సుల్లో ఎనర్జీ చూసి జనాలు థియేటర్లకు క్యూ కట్టారు. మరి, సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ: జనదళం పార్టీ అధినేత వైరా వెంకట సూర్యనారాయణ (ప్రకాష్ రాజ్) కుమార్తె వసుంధర (రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతుంది. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కాటా మధు (రవిశంకర్) తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరతాడు. అయితే... తన కుమార్తెను మంత్రి చేస్తానని పార్టీ అధినేత చెబుతారు. భర్తకు విడాకులు ఇచ్చి వసుంధర రెండో పెళ్లి చేసుకోవడం, మొదటి భర్త ద్వారా కలిగిన సంతానాన్ని వదిలేసి వచ్చిన విషయాలు బయట పెడతానని కాటా మధు బెదిరించే ప్రయత్నం చేస్తాడు. దాంతో రమణ (మహేష్ బాబు)ను పిలిచి తల్లితో తనకు ఎటువంటి సంబంధం లేదని రాసిన బాండ్ పేపర్స్ మీద సంతకం చేయమని తాతయ్య కోరతాడు. 

రమణ గుంటూరు కారం లాంటోడు. ఎవ్వరికీ భయపడడు. తండ్రి రాయల్ సత్యం (జయరామ్) సాఫ్ట్ అయితే... కొడుకు పక్కా మాస్. పాతికేళ్ల తర్వాత తల్లి నుంచి పిలుపు రావడంతో ఎంతో ఆశగా హైదరాబాద్ వచ్చిన రమణ... బాండ్ పేపర్స్ మీద సంతకం చేయడానికి నిరాకరిస్తాడు. అసలు రాయల్ సత్యానికి వసుంధర ఎందుకు విడాకులు ఇచ్చింది? పాతికేళ్లు కొడుకును కనీసం ఎందుకు చూడలేదు? చివరకు ఏమైంది? మధ్యలో అమ్ము (శ్రీ లీల)తో రమణ కథేంటి? మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ: 'గుంటూరు కారం' ప్రచార చిత్రాలు, 'కుర్చీ మడత పెట్టి' సాంగ్ చూసిన తర్వాత మహేష్ బాబు మాస్ అవతార్ కంటే అటువంటి మాసీ క్యారెక్టర్ క్రియేట్ చేసిన త్రివిక్రమ్... ఎటువంటి సినిమా తీశారోననే ఆసక్తి ప్రేక్షకుల్లో ఎక్కువైంది. థియేటర్లలో కూర్చున్న జనాలకు ఆ ఆసక్తి సన్నగిల్లడానికి ఎంతో సేపు పట్టదు. మహేష్ మాస్ తప్ప స్క్రీన్ మీద కొత్త కథ, కథనం, సన్నివేశాలు కనిపించవు.

త్రివిక్రమ్ సినిమాల్లో బంధాలు, భావోద్వేగాలది ప్రధాన పాత్ర. అతి సాధారణమైన సన్నివేశాన్ని తన మార్క్ సంభాషణలతో అద్భుతంగా మార్చగల నేర్పు మాటల మాంత్రికుడికి మాత్రమే సాధ్యం. అయితే... 'గుంటూరు కారం'లో అడుగడుగునా త్రివిక్రమ్ మార్క్ కనిపించడం లేదనే వెలితి ప్రేక్షకులకు కలుగుతుంది. 

త్రివిక్రమ్ రచన, సంభాషణల శైలిని యువ రచయితలు అనుకరిస్తూ ప్రాస కోసం పాకులాడుతున్నారు. అటువంటి త్రివిక్రమ్ నుంచి 'కుర్చీ మడత పెట్టి...' సాంగ్ రావడం ఒక షాక్. పోనీ, అది మాస్ అని సరిపెట్టుకుంటే... సాంగ్ చివర 'కల్ట్ బొమ్మ ఇచ్చాం' అని 'వెన్నెల' కిశోర్ చేత డైలాగ్ చెప్పారు. నక్కిలీసు గొలుసు పాటకు మహేష్, శ్రీ లీల చేత స్టెప్పులు వేయించారు. త్రివిక్రమ్ మాట రాస్తే, పాట తీస్తే వైరల్ అవ్వాలి. అంతే గానీ డిజిటల్ మీడియాలో వైరల్ కంటెంట్ త్రివిక్రమ్ సినిమాల్లో ఉండటం ఏంటి? అని అభిమానులు ఫీలయ్యే సందర్భాలు అవి.

'గుంటూరు కారం' కథ, కథనాల్లో కొత్తదనం లేదనేది పక్కన పెడితే... ఆ కథలో అత్తారింటికి దారేది, అల వైకుంఠపురములో సినిమాల ఛాయలు కనిపించాయి. కథలో బలం లేకపోవడంతో త్రివిక్రమ్ పెన్ కూడా పెద్దగా కదల్లేదు. సంభాషణల్లో ఆయన శైలి కనిపించలేదు. 

'కుర్చీ మడత పెట్టి...', 'నక్కిలీసు గొలుసు' పాటల్లో మహేష్ బాబు డ్యాన్సులు బాగా చేశారు. తమన్ నుంచి ప్రేక్షకులు ఇంకా మంచి పాటలు ఆశించారు. రీ రికార్డింగ్ కూడా! బహుశా... కథలో విషయం తక్కువ కావడంతో సంగీతం మీద ప్రభావం చూపించినట్టు ఉంది. ఫైట్స్ ఓకే. ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి... మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సూపర్. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఎప్పటిలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి. ఖర్చుకు వెనగడుగు వేయలేదు.

Also Read: హనుమాన్ రివ్యూ: తేజ సజ్జ & ప్రశాంత్ వర్మ సినిమా గుంటూరు కారం కంటే బావుందా? అసలు ఎలా ఉంది?

'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త్రివిక్రమ్ చెప్పినట్లు... రమణ పాత్రకు మహేష్ వందకు 200 శాతం న్యాయం చేశారు. పాటల్లో డ్యాన్స్ ఇరగదీయడమే కాదు... డైలాగ్ డెలివరీలోనూ కొత్త మహేష్‌ బాబును చూపించారు. అంత మాసీ క్యారెక్టర్‌లోనూ సూపర్ స్టైలిష్‌గా కనిపించారు. శ్రీ లీల డ్యాన్స్ కుమ్మేశారు. లంగా ఓణీలు, చీరల్లో మరింత అందంగా కనిపించారు. మీనాక్షి చౌదరి పాత్ర పరిధి తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు.

Also Readకాథల్ ది కోర్ రివ్యూ: అమెజాన్ ఓటీటీలో మమ్ముట్టి గే రోల్ చేసిన సినిమా... జ్యోతిక డామినేట్ చేసిందా?

త్రివిక్రమ్ సినిమాల్లో తల్లి, అత్త పాత్రలు ప్రత్యేకంగా ఉంటాయి. రమ్యకృష్ణ నటించడంతో వసుంధర పాత్రకు హుందాతనం వచ్చింది. మొదటి సాదాసీదాగా ఉన్నా... ఆమె నటన ప్రెస్ మీట్, క్లైమాక్స్‌ సీన్లను నిలబెట్టింది. ప్రకాష్ రాజ్ గెటప్ & యాక్టింగ్ రిజిస్టర్ అవుతాయి. ఆయన చక్కగా చేశారు. జయరామ్, రావు రమేష్, ఈశ్వరి రావు, మురళీ శర్మ, రఘుబాబు తమ తమ పాత్రలకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లారు. జగపతి బాబును సరిగా వాడుకోలేదు. సునీల్ ఒక్క సన్నివేశానికి పరిమితం అయ్యారు. వెన్నెల కిశోర్ టైమింగ్ కొన్ని సన్నివేశాల్లో నవ్విస్తుంది. బాబ్జిగా అజయ్ కనిపించేది రెండు మూడు సీన్లు అయినప్పటికీ... కడుపుబ్బా నవ్విస్తారు. త్రివిక్రమ్ మార్క్ హ్యూమర్ అజయ్ క్యారెక్టర్‌లో కనిపించింది. అజయ్ ఘోష్ సీన్స్ కూడా!

'గుంటూరు కారం'లో మమకారం లేదు... హీరో నటనలో ఘాటు తప్ప! మహేష్ బాబు ఎనర్జీ, ఆ మాస్ క్యారెక్టరైజేషన్ సూపర్! మిర్చిలో ఘాటు డ్యాన్సుల్లో చూపించారు. అయితే, త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యింది. ఒక్క సీనులోనూ ఎమోషన్ వర్కవుట్ కాలేదు. కామెడీ అనుకున్నంత లేదు. హై ఇచ్చే మూమెంట్స్ అసలే లేవు. మహేష్ బాబు వీరాభిమానులను సైతం డిజప్పాయింట్ చేసే చిత్రమిది.

రేటింగ్: 2.25/5

Also Read#90's ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ రివ్యూ : ఈటీవీ విన్‌లో శివాజీ నటించిన వెబ్ సిరీస్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
Embed widget