అన్వేషించండి

India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!

Justin Trudeau |  సిక్కు మత స్థాపకుడు గురునానక్ ఈ నేలపై పుట్టిన ఆధ్యాత్మిక నేత.  స్వాతంత్రోధ్యమంలో సిక్కుల పాత్ర,  సైన్యంలో సిక్కుల శౌర్య పరాక్రమాలను ఎంత పొగిడినా తక్కువే.  

Canada India Relations - సిక్కులు భారతీయులు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ ఈ నేలపై పుట్టిన ఆధ్యాత్మిక నేత. స్వాతంత్య్రోద్యమంలో సిక్కుల పాత్ర గణనీయమైంది. సైన్యంలో సిక్కుల శౌర్య పరాక్రమాలను ఎంత పొగిడినా తక్కువే.  ఇక క్రీడా సామర్ధ్యం కోసం ఎంత చెప్పినా తక్కువే. ఇలా దేశం కోసం ప్రాణాలు అర్పించే  తత్వం సిక్కు వర్గానిది. అలాంటిది కెనడాలో కొన్న సిక్కు సంఘాలు ఎందుకు భారత్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. గత కొన్నెళ్లుగా కెనడా , ఇండియా మధ్య సంబంధాలు ఉప్పు నిప్పుగా మారింది.  అందుకు కారణం అక్కడి సిక్కులలో కొందరు చేపట్టిన వేర్పాటు వాద ఉద్యమం .

 సిక్కులు ఇండియన్లు. అయితే కెనడా వెళ్లిన్న తర్వాత ఎందుకు ఇండియాకు వ్యతిరేకంగా  ఉద్యమం చేస్తున్నారు  అన్న ప్రశ్నలు తలెత్తక మానవు. కేవలం కొద్ది మంది  సిక్కుల భారతీయ వ్యతిరేకత కారణంగా కెనడా మనతో ఎందుకు వైరం పెంచుకుంది.  అసలు అక్కడి  సిక్కులు ఏం కోరుకుంటున్నారు.  కెనడా పాలకులు  ఏ కారణంలో మనతో  శత్రుత్వం పెంచుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం మొత్తం చదివితే అర్థం అవుతుంది.

 సిక్కులు ఎవరు...?

భారతదేశంలోని పంజాబ్  లో సిక్కు మత స్థాపన జరిగింది. దీన్ని గురు నానక్ దేవ్  1469-1953 కాలంలో  స్థాపించారు. సిక్కు అనే పదం  షియా అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం  విద్యార్థి, శిష్యుడు,  అన్వేషి అనే అర్థాలు వస్తాయి. శాంతి, సమానత్వం , పరమత సహనం వంటి  గురునానక్ ప్రవచనాలతో ఈ మతం పురుడు పోసుకుంది.  ఇయనే సిక్కు మతం తొలి గురువుగా  సిక్కులు గుర్తించి గౌరవిస్తారు. ఆయన తర్వాత  ఈ మత వ్యాప్తికి గురు అంగదే, గురు అమర్ దాస్, గురు రామ్ దాస్, గురు అర్జున్ దేవ్, గురు గోవింద్, గురు తేజ్ బహుదూర్, గురు హర్ రాయ్, గురు హర్ కిషన్, గురు తగ్ బహుదూర్, గురు గోవింద్ సింగ్ వంటి 9 మంది గురువులు  తోడ్పడ్డారు. అయితే ఈ సిక్కు మత స్థాపకుడు గురు నానక్ అయితే, చివరి గురువు  గోవింద్ సింగ్ ఖల్సా అని సంస్కృతిని ఏర్పాటు టేసి, సిక్కు మత ధర్మ పరిరక్షుడిగా పేరు పొందారు.


India vs Canada: కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!

ఖల్సా అంటే ఏంటి..?

1699 లో గురు గోవింద్ సింగ్  సిక్కు మత వ్యాప్తి మాత్రమే కాకుండా, ధర్మ పరిరక్షణ, సిక్కులకు సమ న్యాయం,  సమానత్వం,  స్వాంత్ర  సాధన  వంటి లక్ష్యాలతో ఖల్సా  ఏర్పాటు చేశారు.  ఇది సిక్కులను ప్రత్యేక పరిచే సంస్కృతికి బాటలు వేసింది. వారి ఆహార్యం, దుస్తులు, సంప్రదాయాలకు ఖల్సా పెద్ద పీట వేసింది. ఖల్సాలో  5 KS లు  లేదా ఐదు కకార్లుగా పిలుస్తారు. ఈ ఐదు సిక్కులను సుళువుగా గుర్తించే అంశాలుగా ప్రాచుర్యం పొందాయి.అవేంటంటే 1.  కేశ్  -  ఇందులో జుట్టు కత్తిరించుకోకండా సహజంగా పెరిగేలా ఉంచడం ముఖ్యమైన విధి. 2.   కారా - కంకణం ధరించడం ముఖ్యం. ఇది సిక్కులు పవిత్రంగా ఉండాలన్నదానికి సూచిక. 3.  కిర్పాన్ -  చిన్నకత్తిని ధరించాలి. ఇది యుద్ద సన్నద్ధతకు గుర్తు. 4.  కచేరా-  సిక్కుల ధరించే ప్రత్యేకమైన లోపలి వస్త్రం. 5.  కంగా - చిన్న చెక్క దువ్వెన.  రోజుకు రెండు సార్లు జుట్టును  దువ్వాల్సి ఉంటుంది.   ఇది సిక్కుల శుచి,శుభ్రత, క్రమశిక్షణకు  సూచిక.  ఈ ఐదు కకార్లు సిక్కులను  ప్రత్యేక వ్యక్తులుగా కనబరుస్తోంది.

మన దేశంలో సిక్కు ఉద్యమాలు 

స్వాతంత్రోద్యమం సమయంలో జలియన్ వాలా బాగ్  ఉదంతంలో జనరల్  డయ్యర్ జరిపిన కాల్పుల్లో మెజార్టీ సిక్కులు మృత్యువాత పడ్డారు.  అప్పటి నుండే కొద్ది మంది సిక్కుల్లో ఆత్మగౌరవం, మత స్వేచ్ఛ, స్వతంత్ర పాలన అన్న బీజాలు పడ్డాయి. స్వాంత్రం వచ్చాక అదే ధోరణిలో కొద్ది మంది  ప్రత్యేక రాజ్యం పేరుతో ఉద్యమాన్ని తలపెట్టారు. ముఖ్యంగా 1960లలో  ఆర్థిక,సాంఘీక, రాజకీయ కారణాలో కొద్ది మంది సిక్కుల్లో  ఉద్యమ భావజాలాలు పుట్టాయి. సిక్కుల ఆత్మగౌరవం,  సంప్రదాయాలు మత స్వేచ్ఛ కాపాడాంలంటే స్వతంత్ర రాజ్యమే సరైందన్న భావనలను కొందరు సిక్కు నేతలు నూరిపోశారు. 1966లో పంజాబ్ ప్రత్యేక రాష్ట్రంగా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో కొద్ది మంది రాజకీయ నేతలకు ఇది కొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. 1970 -80ల నాటికి జర్నైల్ సింగ్ బింద్రన్ వాలే నాయకత్వంలో హింసాత్మక పద్దతిలో ఉద్యమం కొనసాగింది.

స్వతంత్ర ఖలిస్తాన్ ఏర్పాటు లక్ష్యమని ప్రకటించి  ఆందోళన కార్యక్రమాలను పంజాబ్ లో చేపట్టారు. ఈ ఆందోళనలు ఉగ్రవాద పందాకు దారి తీశాయి.  అదే క్రమంలో 1984లో దీనికి నాయకత్వం వహిస్తున్న బింద్రేవాల్  అమృత్ సర్ లోని స్వర్ణ దేవాలయంలో తన అనుచరులతో  చొరబడటం జరిగింది.  వీరిని అక్కడి నుండి  తెచ్చేందుకు అప్పటి  ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఆపరేషన్ బ్లూస్టార్ ను నిర్వహించింది. ఈ ఆపరేషన్ లో బింద్రన్ వాలే, అతని అనుచరులను సైన్యం కాల్చి చంపింది.  ఆ తర్వాత ప్రధాని ఇందిర హత్య జరిగింది. సిక్కులైన ఆమె బాడీ గార్డులే కాల్చి చంపడంతో  సిక్కుల ఊచకోత జరిగింది.   ఆ తర్వాత కూడా పంజాబ్ లో ఉగ్రవాద ఘర్షణలు తలెత్తాయి.  చివరకు వాటిని తర్వాతి ప్రభుత్వాలు అణిచివేశాయి. అయినప్పటికీ  భారతదేశం వెలుపలి శక్తుల సహకారంతో అప్పడప్పుడు పంజాబ్ లో ఖలిస్తాన్  డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఎక్కడిక్కడ ఇలాంటి విభజన స్వరాలను అణిచివేస్తూ వచ్చింది. 

కెనడాలో సిక్కుల మూలాలు ఎందుకు ఏర్పడ్డాయి.?

కెనడాకు సిక్కులు 19వ శతాబ్ధం చివరలో, 20వ శతాబ్దం  మొదట్లో బ్రిటిష్ పాలనలో ఉన్న ఇండియా నుండి కెనడాకు వెళ్లారు. అప్పడు కెనడా కూడా బ్రిటీష్ సామ్రాజ్యంలో భాగమే.  బ్రిటీష్ పాలకుల ప్రోత్సాహంతో  సిక్కులు కెనడాకు వలస వెళ్లారు. వీరు అక్కడికి వెళ్లడానికి ఆర్థిక కారణాలే మూలం.  అక్కడ వ్యవసాయం చేసేందుకు, రైల్వే నిర్మాణ పనుల్లో, భవన నిర్మాణ పనుల్లో పాల్గొనేందుకు తొలి తరం సిక్కులు కెనడాకు వలస వెళ్లారు.  కెనడాలోని బ్రిటీష్ కొలంబియా,  అల్బర్టా ప్రాంతాల్లో వారు పని చేశారు.  ఆ తర్వాత వారు అక్కడే భూములు కొనుక్కొని వ్యవసాయం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాతి తరం నుండి వ్యాపార, సాంకేతిక, విద్యారంగాల్లో  స్థిరపడ్డారు.   ప్రస్తుతం కెనడాలో  టోరోంటో,  బ్రిటీష్ కొలంబియా,  అల్బర్టా ప్రాంతాల్లో సిక్కులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

కెనడా రాజకీయాల్లో సిక్కులు...

కెనడాలో ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన  సిక్కులు   ఆ దేశ రాజకీయాలనే కాదు ఏకంగా ఇండియాతో సంబంధాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు. వీరి ప్రస్థానం పరిశీలిస్తే 1960-70  లలో  ఉర్దేశ్ సింగ్ పటేల్ అనే సిక్కు జాతీయుడు కెనడా పార్లమెంట్ కు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత మరి కొద్ది మంది సిక్కులు కెనడా రాజకీయాల్లో సిక్కు వర్గం తరపున రాజకీయాల్లో  చక్రం తిప్పారు.  ఆ తర్వాత ఎన్డీపీ పార్టీ నుండి 2017 లో ఎన్నికయ్యారు. బర్దీష్ చగ్గర్ అనే మహిళా రాజకీయవేత్త  కెనడాలోని  ఫెడరల్ లిబరల్ పార్టీకి చెందిన  రాజకీయనాయకురాలు. ఆమె పలు దఫాలుగా మంత్రిగా పని చేశారు.  హర్జీత్ సింగ్ సజ్జన్ లిబరల్ పార్టీ నుండి  డిఫెన్స్ మినిస్టర్ గా  పని చేశారు. అయితే ప్రస్తుతం   కెనడాలో ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో  పార్టీ లిబరల్ పార్టీ కి  మద్ధతు ఇస్తున్న  జగ్మిన్ సింగ్  నేతృత్వంలో ఉన్న  న్యూ డెమెక్రటిక్ పార్టీ మద్ధతు ఇస్తోంది. దీన్ని బట్టే సిక్కులు రాజకీయంగా ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారో  అందుకు ఉదాహరణ.


కెనడా - భారత్ సంబంధాలు చెడటానికి సిక్కు వర్గాలు కారణమా.?
అంతర్జాతీయంగా భారత్ - కెనడాల మధ్య సంబంధాలు మొదటి నుండి బాగానే ఉండేవి. జస్టిన్ ట్రూడో అధికారంలోకి వచ్చిన తర్వాతి నుండి  ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయిన పరిస్థితి. అందుకు కారణం అక్కడి కొన్ని సిక్కు సంఘాల వేర్పాటు వాద  ఆందోళనలకు  కెనడా ప్రధాని ట్రూడో మద్ధతు ఇవ్వడం ప్రధాన కారణం.   జగ్మిన్ సింగ్ నేతృత్వంలోని న్యూడెమెక్రటిక్ పార్టీ మద్దతు తో ఉన్న జస్టిన్ ట్రూడో    భారత్ వ్యతిరేకంగా ఖలిస్తాన్ ఉద్యమానికి  అనుకూల సిక్కు వర్గాలకు మద్దతు ఇవ్వడం అందుకు కారణం.  దీన్ని భారత్ వ్యతిరేకిస్తున్నా పట్టించుకోకుండా ట్రూడో వారికి  వంత పాడటం ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయే పరిస్థితులు తలెత్తాయి. 

 హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కారణమా...?

 హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రే సమీపంలోని గురద్వారా లో పని చేసే వారు. ఆయన ఖలిస్తాన్ ఉద్యమానికి మద్ధతు దారుడు. ఖలిస్తాన్ ఉద్యమం పట్ల భారత ప్రభుత్వ తీరును ఆయన  తీవ్రంగా విమర్శించే వాడు.  అలాంటి హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023 జూన్ 18వ తేదీన  గన్ మెన్లచే హత్య చేయబడ్డారు. దీని వెనుక భారత ప్రభుత్వం ఉందని తన ఏజెంట్ల ద్వారా ఈ హత్య చేయించిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో   ఆరోపణ చేశారు. దీన్ని భారత ప్రభుత్వం ఖండించింది.ఈ హత్యలో ఇండియన్ గవర్నమెంట్  పాత్ర లేదని, అలాంటి దాడులు చేసే సంస్కృతి భారత్ కు లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆ హత్యకు సంబంధించి భారతీయుల పాత్ర ఉంటే ఆ వివరాలు ఇవ్వాలని భారత్ కోరినా ఇవ్వలేదు.  పదే పదే జస్టిన్ ట్రూడో  భారత్ ను నిందిస్తూ మాట్లాడటంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇలా అంతర్జాతీయ వేదికలపై భారత్ పై నిందలు వేస్తూ వస్తుండటంతో  ఇండియన్  గవర్నమెంట్ సైతం అదే రీతిలో సమాధానమిస్తోంది. 

Also Read: Canada Khalistanis: కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !

 ట్రూడో ఇండియాను ఎందుకు టార్గెట్ చేశారు..?

 కారణం సింపుల్.  కెనడాలో  సిక్కు వర్గాల నుండి రాజకీయ మద్దతు పొందేందుకు జస్టిన్ ట్రూడో ఇండియా టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇండియాను నిందించడం ద్వారా ఖలిస్తాన్ వేర్పాటు వాద సంఘాల మద్ధతుతో ఓట్లు పొంద వచ్చన్నది ట్రూడో  రాజకీయ వ్యూహం. ఈ వ్యూహం లో భాగంగా పలు విధాలుగా ఇండియాను సిక్కు వ్యతిరేక శక్తిగా  చూపించే ప్రయత్నం చేస్తున్నారు.  అయి ట్రూడో వ్యాఖ్యలపై స్వదేశంలో విమర్శలు వెల్లువెత్తుతున్నా రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ట్రూడో  సిక్కు వర్గాల మద్ధతు కోసం ప్రయత్నిస్తుండటం ప్రస్తుకం చర్చాంశనీయంగా మారింది.  అయితే వచ్చే ఎన్నికల్లో తిరిగి ట్రూడో ప్రాతినిధ్యం వహించే పార్టీ ఓటమి తప్పదన్న ప్రచారం విరివిగా సాగుతోంది. అయితే కొన్ని సంఘాల  ఆకాంక్షల కోసం రెండు ప్రజాస్వామ్య దేాశాల  మధ్య సంబంధాలను చెడగొట్టకోవడం రాజనీతిజ్ఞత అనిపించుకోదు.

 

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
Diwali In UNESCO Intangible Cultural Heritage List : దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
MNREGA Job Cards: MNREGA జాబితా నుంచి 16 లక్షల పేర్లు తొలగింపు! మీ పేరు ఉందో లేదో చూసుకోండి!
MNREGA జాబితా నుంచి 16 లక్షల పేర్లు తొలగింపు! మీ పేరు ఉందో లేదో చూసుకోండి!

వీడియోలు

India vs South Africa T20 Records | మొదటి టీ20లో ఐదు పెద్ద రికార్డులు బ్రేక్‌!
Hardik Record Sixes Against South Africa | హార్దిక్ పాండ్యా సిక్సర్‌ల రికార్డు
Sanju Samson Snubbed For Jitesh Sharma | ఓపెనింగ్ పెయిర్ విషయంలో గంభీర్‌పై విమర్శలు
Shubman Gill Continuous Failures | వరుసగా విఫలమవుతున్న శుబ్మన్ గిల్
Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parakamani case: పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
పరకామణి కేసులో ఐటీ, ఈడీ - ఎఫ్ఐఆర్ నమోదుకు హైకోర్టు ఆదేశం - సంచలనాలు ఉంటాయా?
Telangana Panchayat Elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్దం- ఉదయం 7 గంటల నుంచి పోలింగ్‌
Diwali In UNESCO Intangible Cultural Heritage List : దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
దీపావళికి అరుదైన గుర్తింపు- యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు, ఏయే పండుగలకు ఘనత లభించింది?
MNREGA Job Cards: MNREGA జాబితా నుంచి 16 లక్షల పేర్లు తొలగింపు! మీ పేరు ఉందో లేదో చూసుకోండి!
MNREGA జాబితా నుంచి 16 లక్షల పేర్లు తొలగింపు! మీ పేరు ఉందో లేదో చూసుకోండి!
Pilot Recruitment India: దేశీయ విమానయాన సంస్థల్లో ఎంతమంది పైలట్లు ఉన్నారు? ఇప్పుడు విదేశీ పైలట్లు భారతదేశంలో ఉద్యోగం ఎలా పొందవచ్చు?
దేశీయ విమానయాన సంస్థల్లో ఎంతమంది పైలట్లు ఉన్నారు? ఇప్పుడు విదేశీ పైలట్లు భారతదేశంలో ఉద్యోగం ఎలా పొందవచ్చు?
Amazon: ఇండియాలో అమెజాన్ ఉద్యోగాల విప్లవం -ఐదేళ్లలో పది లక్షల మందికి జాబ్స్ !
ఇండియాలో అమెజాన్ ఉద్యోగాల విప్లవం -ఐదేళ్లలో పది లక్షల మందికి జాబ్స్ !
Delhi Customs: నోట్ బుక్ తీసుకెళ్తున్నాడని ఎయిర్ పోర్టులో అరెస్ట్ - దానికే అరెస్టు చేస్తారా?.. అక్కడే అసలు ట్విస్ట్
నోట్ బుక్ తీసుకెళ్తున్నాడని ఎయిర్ పోర్టులో అరెస్ట్ - దానికే అరెస్టు చేస్తారా?.. అక్కడే అసలు ట్విస్ట్
Harish Rao On Telangana Rising Global Summit: రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోలా గ్లోబల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ షో! హరీష్ రావు తీవ్ర విమర్శలు
Embed widget