Rains Update: అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
Andhra Pradesh Rains News | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి ఏపీలో వర్షాలు కురవనున్నాయి. అది బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు చేరుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Weather Updates in AP and Telagnana | ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింతగా బలపడుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్పపీడనం బుధవారం నాటికి శ్రీలంక- తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో కొన్ని జిల్లాల్లో డిసెంబర్ 15 వరకు కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో డిసెంబర్ 10న అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో (ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో) అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని.. వర్షాలకు తడవకుండా పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలలో ఉంచాలని సూచించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెట్ల కిందకు, పాత భవనాలలోకి వెళ్లకూడదని సూచించారు.
District forecast of Andhra Pradesh dated 09-12-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/vUcppsTeJk
— MC Amaravati (@AmaravatiMc) December 9, 2024
తెలంగాణలో వాతావరణం
తెలంగాణలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఉదయం పూట పొగ మంచు ఏర్పడే అవకాశం ఉందని, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు అవుతాయని అధికారులు తెలిపారు. గరిష్టంగా నిజామాబాద్ లో 33.7 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 32.3 డిగ్రీలు, మెదక్‌లో 31.2 డిగ్రీలు నమోదైంది. అత్యల్పంగా మెదక్ లో 20 డిగ్రీలు, హకీంపేటలో 20.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 20.7 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ వాఖ వెల్లడించింది.
हैदराबाद शहर के लिए ज़ोन-वार पूर्वानुमान दिनांक: /Zone-wise forecast for Hyderabad city dated: 09.12.2024@ghmc @HYDTP @IASassociation @TelanganaCMO pic.twitter.com/3uaSvA7S3m
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) December 9, 2024
హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం పూట పొగమంచు కురిసే అవకాశం ఉంది. నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంత్రం తెలిపింది. దక్షిణ, నైరుతి దిశలో గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల మేర నమోదు అవుతున్నాయి.
నెం | ఏరియా | గరిష్ట ఉష్ణోగ్రత | కనిష్ట ఉష్ణోగ్రత |
1 | ఆదిలాబాద్ | 32.3 | 20.7 |
2 | భద్రాచలం | 30.6 | 22.2 |
3 | హకీంపేట్ | 27.9 | 20.4 |
4 | దుండిగల్ | 30.1 | 21.6 |
5 | హన్మకొండ | 28.5 | 21 |
6 | హైదరాబాద్ | 28.4 | 21.5 |
7 | ఖమ్మం | 28 | 22 |
8 | మహబూబ్ నగర్ | 27.1 | 22.2 |
9 | మెదక్ | 31.2 | 20 |
10 | నల్గొండ | 28.2 | 21.4 |
11 | నిజామాబాద్ | 33.7 | 22.5 |
12 | రామగుండం | 30.4 | 22.4 |