Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Janasena; పవన్ కల్యాణ్‌కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నేరుగా ఆయన కార్యాలయానికి ఫోన్ చేసి చంపేస్తామని హెచ్చరించిన వైనం కలకలం రేపుతోంది.
Threatening calls to Deputy Chief Minister Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపుతోంది. చంపేస్తామని హెచ్చరిస్తూ ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్స్ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఫోన్ చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను అభ్యంతకర భాషతో హెచ్చరిస్తూ మాట్లాడారు. మెసేజులు కూడా పంపించినట్లుగా తెలుస్తోంది. పేషీ సిబ్బంది బెదిరింపు కాల్స్, మెసేజులను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పవన్ సూచన మేరకు బెదిరింపు కాల్స్ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులకు తెలియచేశారు.
పవన్ ను భయపెట్టడానికే ఉద్దేశపూర్వకంగా బెదిరింపులకు పాల్పుడుతున్నారా ?
నేరుగా పవన్ కల్యాణ్ పేషీకే ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడటం, తిట్టడం చేసిన వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వెంటనే ఫోన్ నెంబర్ ను ట్రాక్ చేసి పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఇది ఆకతాయి చేసిన పనిగా పోలీసులు భావించడం లేదు. ఉద్దేశపూర్వకంగానే చేసిఉంటారని అనుమానిస్తున్నారు. పవన్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నందున వెళ్లకుండా చేసే వ్యూహంతో ఇలాంటి బెదిరింపులు చేసి ఉంటారని భావిస్తున్నారు.
సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఫోన్ చేసింది ఎవరు అన్నదానిపై పోలీసులు ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లుగా తెలుస్తోంది.అయితే వివరాలు వెల్లడించడండ లేదు. ఇలాంటి బెదిరిపుల్ని నేరుగా.. పేషీలకే ఫోన్ చేసి బెదిరించడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. ఉపముఖ్యమంత్రి భద్రతను మరంత కట్టుదిట్టం చేసే అవకాశం ఉంది.ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో భౌతిక దాడులు కూడా జరిగే అవకాశాలు ఉంటాయని ఇప్పటికే రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ బెదిరంపు కాల్స్ వెనుక రాజకీయ కుట్ర ఏమైనా ఉందా అన్నదానిపై పోలీసులు నిశీతంగా పరిశీలన జరిపే అవకాశం ఉంది.
Also Read: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?
ఇలాంటి బెదిరింపులకు భయపడని పవన్ కల్యాణ్
సాధారణంగా పవన్ కల్యాణ్ ఇలాంటి బెదిరింపులకు భయపడరు. ఆయన జనసేన పార్టీ చీఫ్ గానే ఉన్నప్పుడు అనేక బెదిరింపులు ఎదుర్కొన్నారు అయితే ఇప్పుడు డిప్యుటీ సీఎంగా ఉన్నారు.. నేరుగా డిప్యూటీ సీఎం పేషీకే ఫోన్ చేసిందున పోలీసులుక సమాచారం ఇవ్వడం బాధ్యత అని భావించినట్లుగా తెలుస్తోంది. ఇలాంటి బెదిరింపులకు ఎన్ని దిగినా నేరుగా దాడులకు దిగినా తన పనితీరులో.. ప్రజల్లోకి వెళ్లే తీరులో ఏ మార్పు ఉండదని అయన చెబుతూ ఉంటారు.