అన్వేషించండి

Pawan Kalyan - Rana Daggubati: పవన్ కల్యాణ్ రారు... అభిమానులకు షాక్ ఇచ్చిన రానా దగ్గుబాటి స్టేట్మెంట్

The Rana Daggubati Show: 'ది రానా దగ్గుబాటి షో'కు పవన్ కళ్యాణ్ హాజరయ్యే ఛాన్స్ లేదని తేల్చేశారు హోస్ట్ రానా. మరి పవర్ స్టార్ ఈ షోలో కన్పించకపోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.

స్టార్స్ కు ఇటీవల కాలంలో మీడియా నుంచి కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు ఎదురవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎవరు ఎలాంటి ప్రశ్న వేసినప్పటికీ, ఆ టైంలో సెలబ్రిటీలు ఎలా స్పందిస్తారు అన్నదే ముఖ్యం. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి (Rana Daggubati)కి కూడా తాజాగా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అయితే ఇదొక ఎత్తు అనుకుంటే, అదే ఈవెంట్ లో రానా దగ్గుబాటి తన షోకి పవన్ కళ్యాణ్ రారు అంటూ బాంబు పేల్చి పవర్ స్టార్ అభిమానులకు షాక్ ఇచ్చారు. 

రానా దగ్గుబాటి హోస్టుగా 'ది రానా దగ్గుబాటి షో'ను చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ షో మొదలు కాబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను శుక్రవారం రిలీజ్ రిలీజ్ చేశారు రానా. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. అయితే ఈవెంట్ లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకి రానా సమాధానం చెప్పారు. అందులో భాగంగా ఓ జర్నలిస్ట్ "మీ షోని పాన్ ఇండియా స్టార్లతో కాకుండా టైర్ 2 హీరోలతో ఎందుకు ప్రారంభించారు?" అని ప్రశ్నించారు. దీంతో ఈ ప్రశ్నకు ఒకసారిగా అవాక్కైన రానా నవ్వును ఆపుకోలేక పోయారు. ఆయన స్పందిస్తూ "అవి ఏమైనా ట్రైన్ బెర్తులా? ఈ బెర్త్ లను ఎవరు బుక్ చేశారు?" అని నవ్వుతూ ప్రశ్నించారు. దీంతో సదరు వ్యక్తి "అంటే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి పాన్ ఇండియా స్టార్లతో షోని మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ వాళ్లతో కాకుండా ట్రైలర్ ని చూస్తే ఇతర హీరోలు ఉన్నట్టుగా కనిపిస్తోంది" అంటూ సమాధానం చెప్పాడు.

Also Readరానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?

దీంతో రానా "సినిమాలు తీసే వాళ్ళకు లెక్కలు ఉంటాయేమో గాని ప్రేక్షకులకు ఉండవు. కంటెంట్ నచ్చితే కచ్చితంగా సినిమా చూస్తారు. ఒక ప్రాంతీయ సినిమాగా తెరకెక్కిన 'హనుమాన్'ను ప్రపంచవ్యాప్త ప్రేక్షకులు చూసి ఆదరించారు. అలాగే 'బాహుబలి' మూవీకి ముందు మేము కూడా నార్త్ ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు. సినిమానే నటినటులను స్టార్స్ ను చేస్తుంది. టైర్ 1, టైర్ 2 అనేది చెప్పుకోవడానికి బాగుంటుందేమో గానీ నేను దాన్ని నమ్మను" అని చెప్పుకొచ్చారు. ఇక ఇంతకు ముందు తను చేసిన షోకు, ఈ ప్రోగ్రాంకి అస్సలు సంబంధం ఉండదని, ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగిన చర్చలు, వార్తల గురించి ఈ షోలో ప్రస్తావన ఉండదని క్లారిటీ ఇచ్చారు. ఒక్కో ఎపిసోడ్ ను నాలుగు గంటల పాటు చిత్రీకరించగా, దాదాపు 40 నిమిషాల నిడివితో స్ట్రీమింగ్ కాబోతోందని వెల్లడించారు. 

ఇక పనిలో పనిగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ గురించి చెప్పుకోవాలి. ఆయన ఇప్పటికే 'అన్ స్టాపబుల్' అనే సెలబ్రిటీ టాక్ షోలో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రానా టాక్ షోలో కూడా పవన్ కళ్యాణ్ స్టార్ కూడా ఎంట్రీ ఇస్తారేమోనని పవర్ స్టార్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ రానా మాట్లాడుతూ "పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి మా షోకు వచ్చే ఛాన్స్ లేదు" అని ముందుగానే  తేల్చి చెప్పేశారు. ఇది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే విషయమే. ఇదిలా ఉండగా ఈ షోలో రిషబ్ శెట్టితో చేసిన ఎపిసోడ్ తనకు చాలా స్పెషల్ అని చెప్పుకొచ్చారు. "ఎందుకంటే నాకు కన్నడ రాదు, ఆయనకు తెలుగు రాదు. రిషబ్ హిందీలో బాగా మాట్లాడుతారు. కానీ నాకు హిందీలో ప్రశ్నలు వేయడం రాదు" అని చెప్పుకొచ్చారు. అయితే ఇద్దరికీ తమిళం కొంతవరకు తెలియడంతో దాంతోనే మేనేజ్ చేశారట. 

Read Also : Aditi Govitrikar: పవన్ కళ్యాణ్ హీరోయిన్... 17 ఏళ్ల తర్వాత తిరుమలలో ప్రత్యక్షం... రీఎంట్రీ కోసం ప్లాన్ వేసిందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attack On Media: గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
గతి తప్పిన మంచు కుటుంబ వివాదం - మోహన్ బాబు చుట్టూ బిగస్తున్న ఉచ్చు
Google Trending Searches: 2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
2024 గూగుల్‌ సెర్చ్‌లో ఐపీఎల్‌, పవన్ కల్యాణ్‌, కల్కి, సలార్‌ టాప్‌
Mokshagna Debut Movie: వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
వెయ్యి కోట్ల సినిమా దర్శకుడితో నందమూరి వారసుడి మొదటి సినిమా... ప్రశాంత్ వర్మ ఫిల్మ్ క్యాన్సిల్ కావడంతో!
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
Prakasam District News: బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
బ్రెయిన్ ట్యూమర్‌ తగ్గాలని 40 రోజులపాటు చర్చిలో ప్రార్థనలు- బాలిక మృతి- ప్రకాశం జిల్లాలో దారుణం
PAN 2.0 - Aadhaar: పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
పాన్ 2.0 కార్డ్‌ను కూడా ఆధార్‌తో లింక్ చేయాలా, సర్కారు ఏం చెప్పింది?
RBI Governor Salary: ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌ జీతం ఎంత, ఎలాంటి సౌకర్యాలు లభిస్తాయి?
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Embed widget