అన్వేషించండి

Aditi Govitrikar: పవన్ కళ్యాణ్ హీరోయిన్... 17 ఏళ్ల తర్వాత తిరుమలలో ప్రత్యక్షం... రీఎంట్రీ కోసం ప్లాన్ వేసిందా?

Pawan Kalyan Thammudu Actress: పవన్ కళ్యాణ్ మూవీ 'తమ్ముడు'లో హీరోయిన్ గా నటించిన అదితి గోవిత్రికర్ తాజాగా తిరుమలలో ప్రత్యక్షమైంది. మరి ఆమె తిరుమల వెంకన్నను ఏం కోరుకుందో తెలుసుకుందాం పదండి.

కొంతమంది హీరోయిన్లు ఒకే ఒక సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంటారు. కానీ ఆ తర్వాత ఊహించని విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కనిపించకుండా మాయమవుతారు. అలాగే చాలా కాలం తరువాత సడన్ గా కనిపించి సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ (Pawam Kalyan) 'తమ్ముడు' మూవీలో నటించిన హీరోయిన్ కూడా ఇలాగే చేసింది. ఒకప్పటి హీరోయిన్ అదితి గోవిత్రికర్ తాజాగా తిరుమలలో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'తమ్ముడు'. ఈ మూవీ వచ్చి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ, క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. పవన్ ఫ్యాన్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమాలలో ఇది కూడా ఒకటి. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వినడానికి మూవీ లవర్స్ బాగా ఇష్టపడతారు. ఈ సినిమాలోని ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఎన్ని తరాలు మారినా బోర్ కొట్టవనే చెప్పాలి. ఇక 1999లో వచ్చిన పవన్ కెరీర్ లోనే మరచిపోలేని హిట్ గా మారిన 'తమ్ముడు' సినిమాలోని పాటల సంగతి పక్కన పెడితే, ఇందులో హీరోయిన్ గా నటించిన అదితి గోవిత్రీకర్ గురించి మాట్లాడుకోవాలి.

Also Readరానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?

'తమ్ముడు' తరువాత తెలుగులో పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ కొన్నాళ్లకే టాలీవుడ్ కు గుడ్ బై చెప్పింది. బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేసి అలరించింది. పైగా కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేసింది. కానీ ఇప్పుడు ఆమె ఎవ్వరికీ గుర్తు లేదు. ఫోటో చూసినప్పటికీ మళ్లీ 'తమ్ముడు' మూవీలో ఆమె ఎలా ఉండేదో ఒకసారి చూస్తేనే గానీ గుర్తు పట్టలేని పరిస్థితి. ఇలాంటి టైంలో సడన్ గా తాజాగా తిరుమలలో ప్రత్యక్షమైంది ఈ అమ్మడు. శ్రీవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన అదితి కెమెరాల కంటికి చిక్కింది. దీంతో ఆమె ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇన్ని ఏళ్ల తర్వాత అందరినీ చూడడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. 'దాదాపు 17 ఏళ్ల తరువాత బాలాజీ టెంపుల్ కు వచ్చాను' అని గుర్తు చేసుకుంది. 'నేను తెలుగులో తమ్ముడు సినిమా చేశానన్న విషయం మీ అందరికీ తెలుసు. ఇకపై మరిన్ని తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను' అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది.

అంటే ఇన్నేళ్ల తరువాత ఆమె సడన్ గా ఇలా ప్రత్యేక్షమవ్వడం వెనుక పెద్ద ప్లానే ఉందన్న మాట. మొత్తానికి శ్రీవారి సాక్షిగా తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలని ఉందంటూ అసలు విషయాన్ని వెల్లడించింది. అయితే పవన్ కళ్యాణ్ తో అప్పట్లో సినిమా చేసి మైమరిపించిన ఈ బ్యూటీని, ఇప్పటి తరం డైరెక్టర్లు ఎవరు తెరపై చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారో చూడాలి. కాగా ఇప్పటికే భూమిక, సిమ్రాన్, లయ వంటి ఒకప్పటి హీరోయిన్లు రీఎంట్రీ ఇచ్చి అడపాదడపా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నారు. మరి రీఎంట్రీలో అదితి అదృష్టం ఎలా ఉండబోతుందో చూడాలి.

Read Also : Kanguva: ‘దేవర’నూ ట్రోల్ చేశారు... మిక్డ్స్ టాక్, డీఎస్పీ మ్యూజిక్‌పై విమర్శలపై స్పందించిన ‘కంగువ’ నిర్మాత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - ఈ ఫార్ములా రేస్ వ్యవహారంపై విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Embed widget