Harom Hara Teaser: సమరం మొదలు పెడితే, సంభవామి సంతకం నాదే అవ్వాలి- సుధీర్ బాబు ‘హరోమ్ హర’ టీజర్ అదిరిపోయిందిగా!
Harom Hara Teaser: యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న తొలి పాన్ ఇండియన్ మూవీ ‘హరోమ్ హర’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.
Sudheer Babu Pan India Film Harom Hara Teaser: తెలుగు సినిమా పరిశ్రమలో వైవిధ్య భరిత చిత్రాలు చేయడంలో ముందుంటారు నటుడు సుధీర్ బాబు. ఆయన తాజాగా ఓ పాన్ ఇండియన్ మూవీలో నటిస్తున్నారు. ‘హరోమ్ హర’ పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి వారెవ్వా అనే కామెంట్స్ వినిపించాయి. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. ఇదే జోష్ లో మేకర్స్ టీజర్ ను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు.
5 భాషల్లో ‘హరోమ్ హర’ టీజర్ విడుదల
‘హరోమ్ హర’ మూవీ టీజర్ ను ఒకేసారి ఐదు భాషల్లో విడుదల చేశారు మేకర్స్. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ అయ్యింది. ఈ టీజర్లను ఆయా భాషల్లోని సూపర్ స్టార్లు విడుదల చేశారు. హైదరాబాద్‍లోని ఏఏఏ సినిమాస్‍లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ లో, తెలుగు టీజర్ ను పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఆవిష్కరించారు. అటు కన్నడలో కిచ్చా సుదీప్, మలయాళంలో మమ్ముట్టి, తమిళంలో విజయ్ సేతుపతి, హిందీలో టైగర్ ష్రాఫ్ ఈ టీజర్ ను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగానే ఇవాళ (నవంబర్ 27) మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు టీజర్ రిలీజ్ చేశారు.
పవర్ ఫుల్ డైలాగ్స్, అదిరిపోయే యాక్షన్ సీన్లు
1.43 నిమిషాల నిడివితో ‘హరోమ్ హర’ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. తిరగబడ్డ జనాలను పోలీసులు అదుపు చేస్తున్న దృశ్యాలతో టీజర్ మొదలవుతుంది. ఆ తర్వాత సుధీర్ బాబు ఫార్మల్ డ్రెస్ లో ఓ గదిలోకి వస్తారు. “అందరూ పవర్ కోసం గన్ పట్టుకుంటారు. కానీ. ఇది ఏడేడో తిరిగి నన్ను పట్టుకుంది” అంటూ నోట్లో బుల్లెట్, చేతిలో రివాల్వర్ తో కనిపిస్తాడు. “ఇది నాకేమో చెప్తా ఉంది. అది నీ గొంతు నుంచి వినపడుతా వుంది” అనే డైలాగ్ చెప్తాడు. “ఈ కాలంలో అంతా మంచిగా ఉంటే ముంచేస్తారు. తెగిస్తేనే తగ్గి నడుచుకుంటారు” అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంటుంది. “ఏం సుబ్రమణ్యం కదలకుండా ఉన్నావ్? ఏదో ఒకటి చెప్పు” అంటూ సునీల్ సుధీర్ ను అడుగుతాడు. “భయపడితే సింగాన్ని కూడా సేద్యానికి వాడుకుంటావు. అది భయపెడితేనే అది అడవికి రాజు అని ఒళ్లు దగ్గర పెట్టుకుంటావు” అంటూ సుధీర్ చెప్పే సమాధానం ఓ రేంజిలో ఉంటుంది. “వాడు సమరమే మొదలు పెడితే, ఆ సంభవామి సంతకం నాదే అవ్వాలి” అంటూ సుధీర్ డైలాగ్ సైలెండ్ వయిలెన్స్ పుట్టిస్తోంది. మొత్తంగా తన మార్క్ యాక్షన్ సీన్లతో సుధీర్ బాబు ఆకట్టుకున్నాడు. కొన్ని వర్గాల మధ్య వైరాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు అర్థం అవుతోంది.
ఇక ‘హరోమ్ హర’ చిత్రంలో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతున్న‘హరోమ్ హర’ షూటింగ్ చివరి దశకు చేరకుంది. ఈ సినిమాను 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. జ్ఞానసాగర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర్ సిమిమాస్ బ్యానర్‌పై, సుమంత్ జీ నాయుడు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ‘హరోమ్ హర’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్.
Read Also: ఫిల్మ్ ఫేర్ ఓటీటీ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘జూబ్లీ’ - ఉత్తమ నటుడు, నటి అవార్డులు ఎవరికి?
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply