By: ABP Desam | Updated at : 26 Sep 2023 03:48 PM (IST)
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల(Photo Credit: Sreekanth Addala/Instagram)
తెలుగు సినిమా పరిశ్రమలో పలు మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కాయి. వాటిలో కొన్ని చిత్రాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. ఎవర్ గ్రీన్ మూవీస్ గా నిలిచిపోయాయి. వాటిలో ఓ చిత్రం ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’. 2013 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మహేశ్ బాబు, వెంకటేష్ హీరోలుగా నటించారు. సమంత, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఈ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్నా, ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే ప్రేక్షకులు ఎగబడి చూస్తుంటారు. ఈ సినిమాకు కల్ట్ అభిమానులున్నారు. ఈ సినిమాలోని డైలాగులు, పాటలు, హీరోల నటన అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమా గురించి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కీలక విషయాలు వెల్లడించారు. దశాబ్దం క్రితం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ తీస్తే ఎలా ఉంటుందని నిర్మాత దిల్ రాజుకు వచ్చినట్లు చెప్పారు. అంతేకాదు, ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని దర్శకుడు శ్రీకాంత్ కు చెప్పారట దిల్ రాజు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకాంత్ అడ్డాల చెప్పారు. "ఈ మధ్యే దిల్ రాజు ఓసారి నాతో ఓ విషయం చెప్పారు. తెల్లవారు జామున 4 గంటలకు ఆయనకు ఓ ఐడియా వచ్చిందట. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సీక్వెల్ చేయాలి అనిపించిందట. అద్భుత విజయాన్ని అందుకున్న సినిమాకు పార్ట్-2 చేయాలి అన్నారు. దానికి నేను ఒకటే చెప్పాను. ఆ కాంబినేషన్ మరోసారి కుదరాలి. ఆ మూవీ క్రేజ్ అలాగే కొనసాగించాలంటే దానికి తగిన కథ కావాలి. కథ ఏమైనా రెడీ అయితే చెబుతానని అన్నాను" అని వెల్లడించారు.
తాజాగా ‘పెదకాపు 1’ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సీక్వెల్ గురించి మాట్లాడారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమాలో సీక్వెల్ చేయగల కంటెంట్ ఉందన్నారు. "’సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమా తీయడానికి ముందు ఒకటే ఆలోచించాను. ఓ మంచి ఫ్యామిలీని చూపించాలి. వారిలో మంచి ఆలోచనలు ఉండాలి. వారి గొప్ప సంస్కారం చూపించాలి అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. అక్కడి వరకే ఆ కథ అనుకున్నాను. చూపించాను. దానికి కొనసాగింపు ఉండాలని చెప్పారు దిల్ రాజు. నిజమే అనిపించింది” అన్నారు. అప్పట్లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ సినిమా తీయడానికి 4 సంవత్సరాలు పట్టిందని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారితోని ఈ సినిమా సీక్వెల్ చేయాలంటే సాధ్యం అవుతుందో? కాదో? అని అనుమానం వ్యక్తం చేశారు.
విరాట్ కర్ణ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘పెదకాపు 1’ సెప్టెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ‘అఖండ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు శ్రీకాంత్. ఛోటా కే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. రావు రమేష్, ఆడుకల్లం నరేన్, అనసూయ, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.
Read Also: పండండి బిడ్డకు జన్మనిచ్చిన స్వర భాస్కర్- పేరు కూడా పెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Naga Panchami December 8th Episode విభూది దాటొద్దని మోక్షకు కండీషన్.. వీడ్కోలు చెప్పేసి తన చితి తానే పేర్చుకున్న పంచమి!
Yash19 : యశ్ కొత్త సినిమాకు వెరైటీ టైటిల్ - ఆసక్తి పెంచేసిన గ్లిమ్స్ వీడియో!
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ రివ్యూ, ‘యానిమల్ పార్క్’ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Allu Arjun: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - సలార్, డంకీ తో పాటూ 'దేవర' కూడా?
Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే
Extra Ordinary Man Review - ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ: నితిన్ నవ్వించారా? హిట్ అందుకుంటారా?
CM Jagan Vs TDP : టీడీపీ, వైసీపీ మధ్య పొటాటో రాజకీయం - అంతా జగనే చేశారా ?
Best Selling EV Brands: భారతదేశంలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కారు కంపెనీలు ఇవే - టాప్‌లో ఏ కంపెనీ ఉందంటే?
/body>