అన్వేషించండి

Slum Dog Husband Trailer: ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ట్రైలర్: కుక్కతో బ్రహ్మాజీ కొడుకు పెళ్లి - కక్కుర్తి ఎక్కువైతే ఇంతే!

నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా తెరకెక్కిన మూవీ ‘స్లమ్ డామ్ హస్బెండ్’. కుక్కతో పెళ్లి అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తీశారు. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

Slum Dog Husband Trailer: టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఈయన ‘పిట్ట కథలు’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ‘పిట్ట కథలు’ సినిమాలో ఓ పాత్రలో మాత్రమే కనిపించారు. ఆ మూవీ తర్వాత చాలా రోజులు సంజయ్ రావు పెద్దగా ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఇప్పుడు తాజాగా ఆయన హీరో గా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీలో ప్రణవి మానుకొండ హీరోయిన్ గా చేసింది. ఈ మూవీకు ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.  

జాతకదోషం పోవాలని కుక్కని పెళ్లి చేసుకొని..

నటుడు సంజయ్ రావు తన మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు తన రెండో సినిమాగా కామెడీ ఎంటర్టైనర్ జోనర్ కథను ఎంచుకొని అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఇక సినిమా ట్రైలర్ విషయానికొస్తే.. సినిమాలో హీరో హీరోయిన్ ప్రేమలో పడతారు. ఎవరికి వారు తమకు పెళ్లి చేయాలంటూ ఇంట్లో గొడవ చేస్తూ ఉంటారు. తర్వాత ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఇంతదాకా వచ్చాక వారి జాతకాలు కలవకపోవడంతో కొత్త సమస్య మొదలవుతుంది. అయితే జాతక దోషం పోవాలి అంటే ముందు అబ్బాయికి తూతూ మంత్రం పెళ్లి చేయాలని పంతులు మెలికపెట్టడంతో ఓ కుక్కకిచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత హీరో హీరోయిన్ పెళ్లికి జరుగుతుంది. కరెక్ట్ గా తాళి కట్టే సమయానికి కొంతమంది వచ్చి పెళ్లి జరగడానికి వీల్లేదని అంటారు. మొదటి భార్య కుక్క ఉండగా రెండో పెళ్లేంటని నిలదీస్తారు. దీనిపై కోర్ట్ కు కూడా వెళతారు. అయితే తర్వాత ఏమైంది? వారి పెళ్లికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? కోర్ట్ ఏం చెప్పింది? చివరికి వాళ్లు పెళ్లి చేసుకున్నారా లేదా అనేదే సినిమా. 

కామెడీ ఎంటర్టైనర్ గా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’..

సినిమా ట్రైలర్ చూస్తుంటే మూవీ మొత్తం ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. కుక్కతో పెళ్లి అనే కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు మూవీ టీమ్. ఇలాంటి కాన్సెప్ట్ లు తెలుగు సినిమా కామెడీ సీన్లలో చూసే ఉంటాం. అయితే ఇదే లైన్ తో మూవీ తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ మూవీను తెరకెక్కించారు దర్శకుడు. ట్రైలర్ లో కామెడీ పాళ్లు బాగానే కనిపిస్తున్నాయి. డైలాగ్స్, మ్యూజిక్ కూడా పర్వాలేదనిపిస్తోంది. అలాగే సినిమాలో నటుడు అలీ, సప్తగిరి, బ్రహ్మాజీ వంటి నటులు కూడా ఉన్నారు. మరి ఈ మూవీతో సంజయ్ రావు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి మరి. మైక్ మూవీస్ బ్యానర్‌పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

Also Read: ఆ సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న 'ధమాకా' బ్యూటీ శ్రీలీల - ఆ సినిమా చేసి ఉంటే?

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget