అన్వేషించండి

Sreeleela: ఆ సూపర్ హిట్ మూవీని మిస్ చేసుకున్న 'ధమాకా' బ్యూటీ శ్రీలీల - ఆ సినిమా చేసి ఉంటే?

వరుస సినిమాలతోదూసుకుపోతోన్న టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల..కెరీర్ ప్రారంభంలో ఓ తెలుగు సినిమా మిస్ చేసుకుందట. నాగశౌర్య హీరోగా 2018లో వచ్చిన ఛలో సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా వచ్చిన అవకాశాన్ని మిస్ చేస్కుందట

Sreeleela : నటి శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. బిజీయెస్ట్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబు వంటి అగ్ర హీరోలతోనూ కలిసి నటిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ఓ వార్త తెగ హల్ చల్ చేస్తోంది. అప్పట్లో నాగశౌర్య హీరోగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం 'ఛలో'ను శ్రీలీల మిస్‌ చేసుకుందట. ‘ఛలో’లో శ్రీలీల కథానాయికగా నటించాల్సి ఉందని నాగశౌర్య ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'ఛలో'లో శ్రీలీల హీరోయిన్‌గా నటించుందని తొలుత ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఆ సినిమాలో నటించలేదు. దీంతో ఆమె స్థానంలో మరో కన్నడ నటి రష్మిక మందన్నాను తీసుకున్నారు. ‘ఛలో’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక ఇప్పుడు స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. 'ఛలో' విడుదలైన మూడేళ్ల తర్వాత శ్రీలీల దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి సందD'తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే..

అలా 'పెళ్లి సందD'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రీలీల.. తన అందం, నటనతో పాపులారిటీని తెచ్చుకుంది. ఇటీవల మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'ధమాకా'లో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ ఒక్క సినిమాతో శ్రీలీలకు మరింత క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం తెలుగులో వరుసగా సుమారు 10 సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. చివరికి.. రష్మిక అవకాశాలను కూడా శ్రీలీల కొట్టేస్తున్నట్లు టాక్.

ఛలో గురించి..

2018లో విడుదలైన ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. దర్శకుడిగా ఆయనకు ఇదే మొదటి సినిమా. ఇరా క్రియేషన్స్ బ్యానర్ ఫై ఉష ముళ్ళపూరి నిర్మించిన ఈ సినిమా నాగశౌర్య కెరీర్ లో ఎక్కువ వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. అంతే కాదు ఈ సినిమా ఆయనకు మంచి పేరు కూడా తీసుకువచ్చింది. అంతే కాదు ఈ సినిమాలో నటనకు గానూ కమెడియన్ సత్యకు ఉత్తమ హాస్య నటుడి కేటగిరీలో 2018 సైమా అవార్డు కూడా లభించింది.

మహేష్ బాబుతో..

శ్రీలీల లైనప్ లో ఉన్న సినిమాల్లో ఒకటి మహేష్ బాబు హీరోగా వస్తోన్న 'గుంటూరు కారం'లో ఆమె మేయిన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా రమ్యకృష్ణ, రఘుబాబు, ప్రకాష్ రాజ్, సునీల్, జయరాం తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ మూవీ పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా బాగా అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ మూవీని 2024 సంక్రాంతి కానుకగా మేకర్స్ జనవరి 13న విడుదల చేయనున్నారు. 

పవన్ కళ్యాణ్ తో..

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీష్ శంకర్  తెరకెక్కిస్తోన్న తాజా సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh). ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే హీరోయిన్ శ్రీలీల కూడా షూటింగ్ లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో కథానాయుకగా పూజా హెగ్డే పేరు కూడా వినిపిస్తోంది. కాగా దానిపై అధికారి ప్రకటన ఇంకా వెలువడలేదు.

Read Also : Oscar Committee : ఆస్కార్ కమిటీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి - మళ్ళీ కాలర్ ఎగరేసేలా చేసిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Rajamouli Reaction : రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
రాజమౌళి మూవీలో పీవీ సింధు? - ఫన్‌ రిప్లై... సోషల్ మీడియాలో కొత్త చర్చ
Niharika Konidela : పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
పింక్ ఎలిఫెంట్ గోత్రం... నిహారిక నక్షత్రం - నేషనల్ అవార్డ్ విన్నింగ్ హ్యాపీ మూమెంట్స్
Anupama Parameswaran : అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!
అనుపమ పరమేశ్వరన్‌కు బ్రేకప్? - కేరళ కుట్టి అలా పోస్ట్ చేశారేంటి!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget