అన్వేషించండి

AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?

COVID Alert in Andra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనాకు చెందిన ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కేసులు నమోదైనట్లు నిర్ధారణ అయింది. ఇది ప్రమాదకర ఒమిక్రాన్ ఒక సబ్-వేరియంట్ కాగా, దీని లక్షణాలు ఇలా ఉన్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ వెలుగులోకి వచ్చింది.
  • కడపలో నలుగురు రోగుల శాంపిల్స్‌లో దీనిని గుర్తించారు.
  • ఇది ఒమిక్రాన్ ఉప-వేరియంట్, ప్రమాదకరంగా కనిపించడం లేదు.
  • లక్షణాలుంటే పరీక్షలు చేయించుకొని అప్రమత్తంగా ఉండాలని సూచన.

COVID Alert in Andra Pradesh: ఆంధ్రప్రదేశ్ నుండి కరోనాకు సంబంధించి ఒక కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ బయటపడినట్లు తెలిపారు. కడప జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలిన నలుగురు రోగుల శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించారు. ఇప్పుడు అక్కడ నుండి వచ్చిన నివేదికలో ఆ నలుగురి శాంపిల్స్‌లో ఒమిక్రాన్ యొక్క RF.5 సబ్-లైనీజ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. మంత్రి శనివారం రాత్రి విడుదల చేసిన తన అధికారిక పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని తెలియజేశారు మరియు ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్ ద్వారా ఈ విషయంపై చర్చించారు. అసలు పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కోవిడ్ 19 కేసులు నమోదు కావడంతో పాటు మరణాలు సైతం సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులపై ఏపీ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా వైరస్ కేసులు ఒమిక్రాన్ RF.5 వేరియంట్ అని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కడప జిల్లాల్లో ఇటీవల కొందరికి కోవిడ్ 19 పాజిటివ్ రావడంతో శాంపిల్స్ సేకరించి, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఆ నివేదిక చెక్ చేయగా నలుగురి శాంపిల్స్ లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు. ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సత్యకుమార్ నిరంతరం టచ్‌లో ఉండి కేసుల నమోదు, వైరస్ వ్యాప్తి అంశాలపై చర్చిస్తున్నారు. తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, లక్షణాలు ఉన్న వారు వెంటనే కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించారు. 

RF.5 వేరియంట్ అంటే ఏమిటి.. ఎక్కడి నుండి వచ్చింది?

RF.5 అనేది కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఒక సబ్ వేరియంట్. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌కు చెందిన ఇలాంటి అనేక సబ్ వేరియంట్ కేసులను ఇదివరకే ఇప్పటికే గుర్తించారు. వాటిలో RF.5 సబ్ వేరియంట్ కూడా ఒకటి. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విష్ణువర్ధన్ కరోనా కేసులపై స్పందించారు. ఈ వేరియంట్ సహజంగానే రూపాంతరం చెందిందని, JN.1 వేరియంట్ నుండి జరిగిందని తెలిపారు. అది LF.7 ద్వారా వ్యాపించి PY.1.1.1 శాఖకు చేరుకుందని, ఆ తర్వాత దాని నుండి RF.5 వేరియంట్ ఏర్పడిందని వివరించారు. రెండు వేరియంట్లు కలవడం వల్ల ఏర్పడిన వేరియంట్ కాదని అధికారులు తెలిపారు. కేవలం కరోనా వైరస్‌పై నిఘా ఉంచే సాధారణ జీనోమిక్ సర్వైలెన్స్ ప్రక్రియలోనే ఈ వేరియంట్ గుర్తించారు.

Also Read: Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి

ఈ వేరియంట్ ప్రమాదకరమా.. దీని లక్షణాలు ఏమిటి?

ఇప్పటివరకు అందిన ఆధారాల ప్రకారం, RF.5 వేరియంట్ మిగిలిన ఒమిక్రాన్ వేరియంట్ల కంటే ఎక్కువ ప్రమాదకరం అని సంకేతాలు ఏవీ లేవని విష్ణువర్ధన్ తెలిపారు. ప్రజలు కేవలం అప్రమత్తంగా ఉండాలని, RF.5 లక్షణాలు కూడా మిగిలిన ఒమిక్రాన్ సబ్-వేరియంట్ల లాగే ఉన్నాయని పేర్కొన్నారు. వీటి లక్షణాలలో జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు ఉన్నాయి. ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే, చాలా తీవ్రమైన కేసు అని భావించాల్సిన అవసరం లేదన్నారు. అయినప్పటికీ పరీక్ష చేయించుకోవడం, డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు.

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో ఏ కొత్త కోవిడ్ వేరియంట్ కనుగొనబడింది?

ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్ RF.5 వేరియంట్ కనుగొనబడింది. కడప జిల్లాలోని నలుగురు రోగుల శాంపిల్స్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఇది నిర్ధారణ అయింది.

RF.5 వేరియంట్ అంటే ఏమిటి మరియు అది ఎలా ఏర్పడింది?

RF.5 అనేది కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఒక సబ్-వేరియంట్. ఇది JN.1 వేరియంట్ నుండి సహజంగా రూపాంతరం చెంది ఏర్పడింది.

RF.5 వేరియంట్ ప్రమాదకరమా మరియు దాని లక్షణాలు ఏమిటి?

RF.5 వేరియంట్ మిగిలిన ఒమిక్రాన్ వేరియంట్ల కంటే ఎక్కువ ప్రమాదకరం అని ప్రస్తుతం ఆధారాలు లేవు. దీని లక్షణాలు జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Calcium-Rich Foods : కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
కాల్షియం లోపం రాకుండా ఎముకలు బలం(Stronger Bones)గా ఉండాలంటే.. ఈ 3 ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget