అన్వేషించండి

Sai Dharam Tej: త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను.. హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్.. ఎట్టకేలకు తన అభిమానులను పలకరించాడు.

మాదాపూర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. ఎట్టకేలకు కోలుకున్నాడు. ఆదివారం సాయంత్రం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. థమ్స్ అప్ చూపిస్తూ.. ‘‘నా మీద, నా చిత్రం ‘రిపబ్లిక్’ సినిమాపై మీరు చూపించిన ప్రేమ, అప్యాయతలకు ధన్యవాదాలు అనే పదం చాలా చిన్నది. త్వరలోనే మిమ్మల్ని చూస్తాను’’ అని ఆయన ట్వీట్ చేశాడు. దీంతో టాలీవుడ్ అభిమానుల సంతోషానికి అవధుల్లేవు. సాయి ధరమ్ తేజ్ స్వయంగా ఈ ట్వీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

సెప్టెంబరు 10న దుర్గంచెరువు వద్ద బైకు మీద ప్రయాణిస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవలే పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నారు. అయితే, ఇప్పటివరకు సాయి ధరమ్ తేజ్ స్పందించకపోవడంతో.. అతడి ఆరోగ్యం ఎలా ఉందనే ఆందోళన అభిమానుల్లో ఉంది.  ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తేజ్‌ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది.

ప్రమాదం జరిగిన రోజు నుంచి అపస్మారక స్థితిలో ఉన్న తేజ్ ఇప్పుడు స్పృహలోనే ఉన్నారని, సెప్టెంబరు 20న వెంటిలేటర్‌ కూడా తొలగించామని వైద్య బృందం వెల్లడించింది. ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ శ్వాస తీసుకోడానికి ఇబ్బందిపడ్డాడు. దీంతో వైద్యులు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు. ప్రస్తుతం తేజ్ తనంతట తానే ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు. దీంతో ఐసీయూ నుంచి సాధారణ గదికి షిఫ్ట్ చేశారు. ఆరోగ్యం కూడా మెరుగుపడటంతో  తేజ్‌ త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.  

Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?

ప్రమాదం జరిగిన దాదాపు మూడు వారాల తర్వాత సాయి ధరమ్ తేజ్ తమ అభిమానులను ట్విట్టర్ ద్వారా పలకరించారు. ఆయన ఆరోగ్యం కోలుకోవాలని అభిమానులు ఎంతో కోరుకున్నారు. కొందరు ఆలయాల్లో కూడా పూజలు చేయించారు. తేజ్ ఆరోగ్యం గురించి కలత చెందవద్దని చిరంజీవి చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ సినిమా ఇటీవలే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. దీంతో తేజ్.. తన అభిమానులకు ఈ విధంగా ధన్యవాదాలు తెలుపుకున్నాడు. 

Also Read: రిపబ్లిక్ సమీక్ష: ఆలోచింపజేసే అరుదైన సినిమా.. అయితే?

Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Tiger Shroff: ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్... ఎటాక్ తర్వాత టైగర్ ష్రాఫ్ పాడ్‌కాస్ట్ వైరల్
ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, స్టెమ్ సెల్ ట్రీట్మెంట్... ఎటాక్ తర్వాత టైగర్ ష్రాఫ్ పాడ్‌కాస్ట్ వైరల్
Sigma Movie OTT : ఓటీటీలోకి సీఎం విజయ్ కొడుకు కొత్త మూవీ - సందీప్ కిషన్ యాక్షన్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సీఎం విజయ్ కొడుకు కొత్త మూవీ - సందీప్ కిషన్ యాక్షన్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Ramayana Songs : సీతారాముల కల్యాణం... అద్భుత ఘట్టం - 'రామాయణ' రంగులు రంగులే సాంగ్ లిరిక్స్
సీతారాముల కల్యాణం... అద్భుత ఘట్టం - 'రామాయణ' రంగులు రంగులే సాంగ్ లిరిక్స్
Romantic Drama OTT : ఓటీటీలోకి హర్ష్ రోషన్ తెల్లకాగితం - తెలుగు రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి హర్ష్ రోషన్ తెల్లకాగితం - తెలుగు రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Two Day Marwar Festival 2026 In Jodhpur Heritage Camel Contingent | రాజస్థాన్‌లో రాజపుత్రుల వారసత్వ వేడుకలు - మీసాల పోటీలు కూడా స్పెషల్
Gambhir's Secret Words to Tilak Varma | న్యూజిలాండ్‌పై భారత్ సంచలన గెలుపు
IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
El Nino Impact: విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
విద్యుత్ కొరత ఉన్నప్పటికీ తెలంగాణలో రైతులకు ఎక్కువ గంటలు సరఫరా
Ban on non-BS6 vehicles: కాలుష్యంపై కఠిన చర్యలు.. నాన్‌-BS6 వెహికల్స్‌కు నో ఎంట్రీ, PUC లేకుంటే పెట్రోల్‌ కూడా దొరకదు!
మీ వెహికల్‌ BS6 కాదా? అయితే, నవంబర్‌ 1 నుంచి సిటీలోకి 'నో ఎంట్రీ'!
Andhra Pradesh Weather Update: తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
తీవ్ర వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 12 జిల్లాలపై అర్ణాబ్ తుపాను తీవ్ర ప్రభావం
Bihar Politics: జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
జేడీయూ నుంచి 6 ఏళ్లు బహిష్కరణ.. కొత్త పార్టీ పెడతానంటూ అనంత్ సింగ్ కీలక ప్రకటన
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Viral Video: నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
నువ్వు కాల్ ఇవ్వలేదు.. రేయ్ రెండు అని చెప్పురా- తిలక్ వర్మ, నితీష్ రెడ్డి మాటలు వైరల్
Two Wheeler Technology: ఇప్పుడు టూవీలర్లలోనూ లగ్జరీ కార్లకు పోటీగా స్మార్ట్‌ ఫీచర్లు.. ఇలాంటివి ఉన్నట్లు మీకు తెలుసా?
కార్లలోనే కాదు.. టూవీలర్లలోనూ అదిరిపోయే స్మార్ట్ ఫీచర్లు! మీ బండిలో ఇవి ఉన్నాయా?
Crime Thriller OTT : నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
నగరంలో వరుస హత్యలు... శవాలను చంపే సైకో కిల్లర్ - ఓటీటీలోకి ఆది సాయి కుమార్ క్రైమ్ థ్రిల్లర్
Embed widget