ఓటీటీలో ‘వివాహ భోజనంబు’.. సందీప్ కిషన్ బంపర్ ఆఫర్, ఇలా చేస్తే ఫ్రీ సబ్‌స్క్రిప్షన్
సత్య హీరోగా.. సందీప్ కిషన్ నిర్మించిన ‘వివాహ భోజనంబు’ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సందీప్ బంపర్ ఆఫర్ ప్రకటించాడు.
కమెడియన్ సత్యను హీరోగా పరిచయం చేస్తూ హీరో సందీప్ కిషన్ నిర్మించిన ‘వివాహ భోజనంబు’ సినిమా ఓటీటీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సందీప్ అతిథి పాత్రలో కనిపిస్తాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 27న ‘Sony Liv’ ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ ప్రేక్షకులకు బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తాను చెప్పినట్లు చేస్తే ఆ సినిమాను వెయ్యి కుటుంబాలకు ఆ సినిమాను ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తానని తెలిపాడు.
‘‘రెండు గంటలపాటు ప్రేక్షకులకు నాన్-స్టాప్ వినోదం పంచే ఉద్దేశంతో ‘వివాహ భోజనంబు’ సినిమాను రూపొందించాం. ఇందుకు దర్శకుడు రామ్ అబ్బరాజు, హీరో సత్యతో చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు. ‘సోనీ లివ్’ ఈ చిత్రం ద్వారా తెలుగులో డిజిటల్ వేదిక మీదకు అడుగుపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో వెయ్యి తెలుగు కుటుంబాలకు ఉచితంగా ‘సోని లివ్’ సబ్‌స్క్రిప్షన్ కానుకగా ఇవ్వనున్నాను’’ అని తెలుపుతూ ట్వీట్ సందీప్ ట్వీట్ చేశాడు. ‘వివాహ భోజనంబు’ రిలీజ్ పోస్టర్‌తోపాటు మీ ఫ్యామిలీ ఫొటోను తనకు పంపినట్లయితే.. మొదటి వెయ్యి కుటుంబాలకు Sony Liv ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తానని తెలిపాడు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించండి.
కరోనా సమాయంలో పెళ్లి చేసుకున్నవారి కష్టాలను ఈ సినిమాలో ఫన్నీగా చూపించనున్నారు. లాక్‌డౌన్ వల్ల బంధువులంతా వరుడి ఇంట్లో చిక్కుకుపోతే ఎలా ఉంటుందనే ఈ సినిమా కథాంశం. ఇందులో కమెడియన్ సత్య పిసినారి వరుడిగా కనిపించనున్నాడు. 21 రోజులపాటు బంధువులను పోషించడానికి ఎలాంటి అతడు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? వాళ్ళని బయటకు పంపించడానికి ఎలాంటి ప్లాన్లు వేశాడు అనేది వినోదాత్మకంగా చూపిస్తున్నారు.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సత్యకు జోడిగా ఆర్జవీ రాజ్ నటిస్తోంది. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శివన్నారాయణ, టీఎన్‌ఆర్, కల్పలత, కీర్తి, నిత్య శ్రీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మణికందన్ సినిమాటోగ్రఫీ అందించారు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. అనివీ సంగీతం అందించారు.
‘వివాహ భోజనంబు’ ట్రైలర్:
Also Read: చిరంజీవి బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న కూతురు సుష్మిత
Also Read: వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ వీడియో అదుర్స్