అన్వేషించండి

Vaisshnav Tej: వైష్ణవ్ తేజ్-క్రిష్ మూవీ టైటిల్ ఖరారు.. ఫస్ట్ లుక్ వీడియో అదుర్స్

పంజా వైష్ణవ్‌ తేజ్‌ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. చిత్ర యూనిట్ శుక్రవారం సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసింది.

‘ఉప్పెన’ సినిమాతో హిట్ కొట్టిన హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌.. మరో చిత్రంతో మెగా అభిమానులను అలరించేందుకు సిద్ధమైపోతున్నాడు. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో వైష్ణవ్.. కటారు రవీంద్ర యాదవ్‌గా విభిన్న పాత్రలో కనిపించనున్నాడు. ‘కొండపాలెం’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టైటిల్‌ను ‘కొండ పొలం’గా ఖరారు చేశారు. ఈ చిత్రం మోషన్ పోస్టర్‌, ఫస్ట్‌లుక్ పోస్టర్లను శుక్రవారం విడుదల చేశారు. 

ఇందులో వైష్ణవ్ తేజ్ గడ్డంతో కనిపించాడు. తలకు ఎర్రగుడ్డ కట్టుకున్న తేజ్.. ప్రతి నాయకులపై దాడికి దిగుతున్నట్లుగా ఫస్ట్‌లుక్ సీన్‌లో కనిపించింది. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఆమె ఓబులమ్మ అనే గ్రామీణ యువతి పాత్ర పోషిస్తోంది. కోటా శ్రీనివాసరావు, నాజర్, అన్నపూర్ణ, హేమా, ఆంటోనీ, రవి ప్రకాష్, మహేష్ విట్టా, రచ్చ రవి, ఆనంద్ విహారి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

ఫస్ట్ లుక్ వీడియో:

ఫస్ట్ లుక్ పోస్టర్:

పవన్ కళ్యాణ్ నటించిన ‘జానీ’ సినిమాలో బాలనటుడిగా పరిచయమైన వైష్ణవ్ తేజ్.. ఆ తర్వాత చిరంజీవి నటించిన ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.’, ‘అందరివాడు’ సినిమాల్లో నటించాడు. 2020లో ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తాజాగా ‘కొండపొలం’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏడాదిలోనే మరో రెండు సినిమాల్లో నటించేందుకు అంగీకరించాడు. మూడో చిత్రం కూడా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కేతిక శర్మ, బాలీవుడ్ బ్యూటీ శోభితా రానాలను హీరోయిన్లుగా ఫిక్స్ చేసినట్లు తెలిసింది. మరో చిత్రం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

Also Read: చిరంజీవి బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న కూతురు సుష్మిత

Also Read: జిమ్‌లో మెగాస్టార్‌‌తో ప్రకాష్ రాజ్ ‘చిరు’ మంతనాలు.. ‘మా’లో కాకరేపుతున్న ట్వీట్

Also Read: చిరు vs మోహన్ బాబు.. ‘మా’ ఎన్నికల్లో.. ఎవరి పంతం నెగ్గనుంది?

Also Read: చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. బాలయ్య, మోహన్ బాబు ఎక్కడ?

టాప్ హెడ్ లైన్స్

Laya Emotional Drama OTT : అత్తను వేధించే కోడలిగా లయ - ఓటీటీలోకి కొత్త మూవీతో ఎంట్రీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
అత్తను వేధించే కోడలిగా లయ - ఓటీటీలోకి కొత్త మూవీతో ఎంట్రీ... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Irumudi OTT : థియేటర్లలో బ్లాక్ బస్టర్... ఓటీటీలో మిక్స్‌డ్ రెస్పాన్స్ - ఇరుముడిలో ఆ లాజిక్స్ మిస్ అయ్యారా?... ట్రెండింగ్ నెం.1లో మూవీ
థియేటర్లలో బ్లాక్ బస్టర్... ఓటీటీలో మిక్స్‌డ్ రెస్పాన్స్ - ఇరుముడిలో ఆ లాజిక్స్ మిస్ అయ్యారా?... ట్రెండింగ్ నెం.1లో మూవీ
Mrunal Thakur Social Thriller OTT : నాలుగేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ మూవీ - సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నాలుగేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ మూవీ - సస్పెన్స్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad IMAX Theatre : హైదరాబాద్‌లో IMAX ఓపెనింగ్‌ డేట్ ఫిక్స్ - మహేశ్ బాబు 'వారణాసి'కి ముందే మరో విజువల్ వండర్ స్క్రీనింగ్
హైదరాబాద్‌లో IMAX ఓపెనింగ్‌ డేట్ ఫిక్స్ - మహేశ్ బాబు 'వారణాసి'కి ముందే మరో విజువల్ వండర్ స్క్రీనింగ్

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mega DSC Sports Quota: ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
ఆటలో గాయాల కంటే వైసీపీ దుష్ప్రచారమే ఎక్కువ బాధిస్తోంది: స్పోర్ట్స్ కోటా డీఎస్సీ టీచర్లు
Asian Games Medal: షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా.. వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
షూటింగ్‌లో బోణీ కొట్టిన భారత్.. ఇలావేనిల్ డబుల్ ధమాకా, వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో సిల్వర్ సాధించిన షూటర్..
Suryapet Road Accident: హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
హైదరాబాద్ - ఖమ్మం హైవేపై కారు దగ్ధం, డాక్టర్ సజీవ దహనం కావడంతో విషాదం
South Coast Railway: కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం
కాకినాడ నుంచి రైలు మార్గంలో వుడ్ పల్ప్ రవాణా.. భారత రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం
AP Local Body Elections: ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు పోలింగ్ స్టేషన్ల జాబితా ప్రకటన.. త్వరలో ఎలక్షన్ నోటిఫికేషన్
Danam Nagender Disqualification: ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
ఫైటర్ ఉపఎన్నికకు రెడీ..! దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
AP TS Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
Embed widget