అన్వేషించండి

Chiranjeevi: చిరంజీవి బర్త్‌డేకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న కూతురు సుష్మిత

చిరంజీవి పుట్టిన రోజు నేపథ్యంలో ఆయన కుమార్తె సుష్మిత ఓ వెబ్‌సీరిస్‌‌తో సర్‌పైజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుష్మిత తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే ‘షూట్ అవుట్ ఎట్ అలైర్’ అనే వెబ్ సీరిస్‌ను ‘జీ5’లో విడుదల చేశారు. తాజాగా మరో వెబ్‌సీరిస్‌ను కూడా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు పురస్కరించుకుని ఓ చిత్రం టైటిల్‌ను ప్రకటించనున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  

‘‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మీకు మరో ఫన్ అందించబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. డాడీ బర్త్‌డే నేపత్యంలో ఆగస్టు 21న అదెంటో వెల్లడిస్తాం’’ అని సుష్మిత పేర్కొన్నారు. ఆమె పోస్టు చేసిన వీడియో ప్రకారం.. అది ప్రేమ కథలా అనిపిస్తోంది. అయితే, అది వెబ్‌సీరిస్ లేదా సినిమానా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ చిత్రానికి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించనున్నారు.

గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి విడుదలైన ‘షూట్ అవుట్ ఎట్ అలైర్’ వెబ్‌సీరిస్‌లో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబరు 25 నుంచి జీ5‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్‌సీరిస్‌కు ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. ఈ సిరిస్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. సంపత్ రాజ్, నందినీ రాయ్, శరణ్యలో ఇతర పాత్రల్లో కనిపిస్తారు. ఇందులో ప్రకాశ్ రాజ్ డీఎస్పీగా సూర్యనారాయణ పాత్రలో, శ్రీకాంత్ ఐజీ ప్రవీణ్ చాంద్‌గా నటించారు. ఓ టెర్రరిస్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 

చిరంజీవి ఒకవైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే టాలీవుడ్ సమస్యలపై దృష్టిపెట్టారు. తాజాగా ఆయన తెలుగు సినీ పరిశ్రమ పెద్దలతో ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా, లాక్‌డౌన్ వల్ల సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ ధరలు తదితర విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు. చిరు పుట్టిన రోజు నేపథ్యంలో ‘ఆచార్య’ నుంచి మరో సర్‌ప్రైజ్ రావచ్చని అభిమానులు భావిస్తున్నారు. 

Also Read: జిమ్‌లో మెగాస్టార్‌‌తో ప్రకాష్ రాజ్ ‘చిరు’ మంతనాలు.. ‘మా’లో కాకరేపుతున్న ట్వీట్

Also Read: చిరు vs మోహన్ బాబు.. ‘మా’ ఎన్నికల్లో.. ఎవరి పంతం నెగ్గనుంది?

Also Read: చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. బాలయ్య, మోహన్ బాబు ఎక్కడ?

టాప్ హెడ్ లైన్స్

Anasuya Bharadwaj : భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
భర్త చనిపోతే బొట్టు, గాజులు తీసేయాలా? - అనసూయ ఎమోషనల్ వీడియో
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
NBK111 Release Date : NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్! - బాలయ్య మూవీ షూటింగ్ మళ్లీ ఎప్పుడంటే?
Miss Apoorva: బోల్డ్ & బ్యూటిఫుల్ మిస్ అపూర్వ.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో దుమ్మురేపుతోన్న కామనర్.. మోడలింగ్ నుంచి గ్లామర్ హౌస్ వరకు!
బోల్డ్ & బ్యూటిఫుల్ మిస్ అపూర్వ.. బిగ్ బాస్ అగ్నిపరీక్షలో దుమ్మురేపుతోన్న కామనర్

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget