Samantha: 'పుష్ప'లో సమంత స్పెషల్ సాంగ్.. ఇదిగో క్లారిటీ..
సమంత స్పెషల్ సాంగ్ లో నటించబోతుందంటూ 'పుష్ప' చిత్రబృందం అనౌన్స్ చేసింది.
అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా 'పుష్ప'. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మొదటి భాగాన్ని డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఓ పాటను చిత్రీకరిస్తుండగా.. ఇంకొక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఐటెం సాంగ్. దీన్ని ఎంతో స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. ఈ పాటలో ఓ స్టార్ హీరోయిన్ కనిపించబోతుందంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.
తాజాగా ఈ విషయంపై చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. సమంత స్పెషల్ సాంగ్ లో నటించబోతుందంటూ చిత్రబృందం అనౌన్స్ చేసింది. సుకుమార్ కి, సమంతకు మధ్య మంచి రిలేషన్ ఉంది. అందుకే తన సినిమాలో ఐటెం సాంగ్ లో నటించమని అడిగారట సుకుమార్. అతడిపై ఉన్న గౌరవంతో సమంత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్ లాస్ట్ సినిమా 'రంగస్థలం'లో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. ఈసారి సమంతను తీసుకొచ్చారు సుకుమార్.
ఈ పాటలో బన్నీతో కలిసి మాస్ స్టెప్పులు వేయబోతుంది సమంత. సినిమాకి ఈ పాట హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. నవంబర్ మూడో వారం నుంచి హైదరాబాద్ లో ఈ పాటను చిత్రీకరిస్తారట. ప్రస్తుతం సమంత చాలా బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఆమె ఐటెం సాంగ్ ఒప్పుకోవడం విశేషం. ఇటీవలే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తుంది.
The supremely talented @Samanthaprabhu2 is going to groove for a sizzling number in #PushpaTheRise 💥💥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/u46bMIBkFL
— Pushpa (@PushpaMovie) November 15, 2021
Also Read: గిరిజనుల కోసం కోటి.. రియల్ సినతల్లికి రూ.10 లక్షలు.. హీరో సూర్యపై ప్రశంసలు
Also Read: 'ఆర్ఆర్ఆర్', 'రాధే శ్యామ్'కు దారిస్తూ... వెనక్కి వెళ్లిన 'గంగూబాయి కథియవాడి'
Also Read: సన్నీ & కో ని టార్గెట్ చేశారా... బిగ్ బాస్ హౌస్ లో పదకొండోవారం నామినేషన్ల హీట్
Also Read: విజేతగా నిలిచేది ఒక్కడే... ఆ ఒక్కడు నువ్వే ఎందుకు అవ్వాలి?... చెర్రీ వాయిస్‌తో అదిరిపోయిన గని టీజర్
Also Read: హీరోయిన్ షాలు చౌరాసియాపై కేబీఆర్ పార్క్ దగ్గర దాడి... ఖరీదైన మొబైల్ లాకెళ్లిన దుండగుడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి