Samantha: ఆమిర్ ఖాన్ తో అక్కినేని ఫ్యామిలీ డిన్నర్ పార్టీ.. సమంత ఎక్కడ..? అంటూ నెటిజన్ల ప్రశ్నలు
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' సినిమా భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా దూసుకుపోతుంది. తొలిరోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిదిన్నర కోట్లు వసూలు చేసింది. దీంతో 'లవ్ స్టోరీ' టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో బిజీగా ఉంది. మరోపక్క ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమిర్ ఖాన్ కు అక్కినేని ఫ్యామిలీ గ్రాండ్ గా డిన్నర్ పార్టీ ఇచ్చింది.
Also Read: లవ్‌స్టోరీ సమీక్ష: గుండె బరువెక్కించే సందేశం.. ప్రేమకథ రూపంలో..
ఈ పార్టీకి నాగార్జున, నాగచైతన్య, అఖిల్ లతో పాటు దర్శకుడు శేఖర్ కమ్ముల, సాయిపల్లవి హాజరై సరదాగా గడిపారు. తాజాగా ఈ ఫోటో బయటకొచ్చింది. ఇందులో సమంత కనిపించలేదు. దీంతో నెటిజన్లు సమంత ఎక్కడ..? అంటూ ఈ ఫోటోపై కామెంట్స్ చేస్తున్నారు. డిన్నర్ పార్టీని సమంత కావాలనే మిస్ చేసిందంటూ ఎవరికి తోచినట్లు వారు కామెంట్స్ చేస్తుండగా.. సమంత అభిమానులు మాత్రం ఆమెని సపోర్ట్ చేస్తున్నారు.
ఈ ఫొటోలో అమల కూడా కనిపించడం లేదని.. ఆ విషయం ఎందుకు ప్రశ్నించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. ఈ మధ్యకాలంలో అక్కినేని ఫ్యామిలీలో జరుగుతోన్న ఈవెంట్స్ లో సమంత పెద్దగా కనిపించకపోవడంతో సామ్-చైతు విడాకుల రూమర్లు మరింత ఎక్కువగా వినిపిస్తున్నాయి. పోనీ సమంత ఏమైనా బిజీగా ఉండి ఈ ఈవెంట్స్ స్కిప్ చేస్తుందా అంటే అదీ కాదు. రీసెంట్ గా తన స్నేహితులతో కలిసి పార్టీలో పాల్గొంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ సంగతి పక్కన పెడితే.. 'లవ్ స్టోరీ' సినిమా విడుదలైన సెప్టెంబర్ 24నే యాభై ఏళ్ల క్రితం ఏఎన్నార్ నటించిన 'ప్రేమ్ నగర్' సినిమా విడుదలవిడుదలై ఘన విజయాన్ని సాధించింది. దీంతో నాగార్జున 'లవ్ స్టోరీ' సినిమా విషయంలో కాస్త ఎమోషనల్ అయ్యారని టాక్. ఇక చైతు 'లాల్ సింగ్ చద్దా' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో బాలరాజు అనే తెలుగు ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారు. గతంలో ఏఎన్నార్ కూడా బాలరాజు పేరుతో తీసిన మంచి విజయాన్ని సొంతం చేసుకుందని నాగార్జున గుర్తుచేసుకున్నారట!