News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Samantha: బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే.. 

సమంత నాటు స్టెప్పులు ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. బన్నీని గిచ్చుతూ.. అతడి ఒళ్లో కూర్చొని సమంత వేసిన స్టెప్ అయితే వేరే లెవెల్.

FOLLOW US: 
Share:

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతను వెండితెరపై గ్లామర్ క్వీన్ గా చూసి చాలా కాలమవుతుంది. గత రెండు, మూడు ఏళ్లలో ఆమె నటించిన ఏ సినిమాలో కూడా గ్లామర్ షో చేయలేదు. చివరిగా సమంత 'జాను' అనే సినిమాలో కనిపించింది. ఇందులో కూడా గర్ల్ నెక్స్ట్ డోర్ పాత్రలోనే దర్శనమిచ్చింది ఈ బ్యూటీ. అల్లు అర్జున్ నటిస్తోన్న 'పుష్ప' సినిమాలో మాత్రం ఊరమాస్ అవతారంలో గ్లామర్ షో చేస్తూ కనిపించబోతుంది సమంత.

సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో సమంతను ఐటెం సాంగ్ కోసం తీసుకున్నారు. ఇటీవలే ఈ సాంగ్ షూటింగ్ పూర్తయింది. లిరికల్ వీడియోను కూడా విడుదల చేశారు. 'ఊ అంటావా.. మావా.. ఊఊ అంటావా' అంటూ సాగే ఈ పాట మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా సమంత గెటప్ చూసిన ఫ్యాన్స్.. ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

తాజాగా చిత్రబృందం ఈ సాంగ్ కి సంబంధించి చిన్న వీడియోను వదిలింది. 19 సెకన్ల ఈ వీడియోలో సమంత నాటు స్టెప్పులు ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. బన్నీని గిచ్చుతూ.. అతడి ఒళ్లో కూర్చొని సమంత వేసిన స్టెప్ అయితే వేరే లెవెల్. ఇంత చిన్న ప్రోమోతోనే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారంటే.. ఇక వెండితెరపై ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. 

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో పాటలు, ట్రైలర్ రికార్డులను తిరగరాశాయి. ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తొలిసారి ఈ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అవుతున్నాడు బన్నీ. 

Published at : 13 Dec 2021 09:24 AM (IST) Tags: Allu Arjun samantha Sukumar Pushpa Movie oo antava maava oo oo antava mava song

ఇవి కూడా చూడండి

Salaar Vs Dunki : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?

Salaar Vs Dunki : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?

King of Kotha: ఎట్టకేలకు ‘కింగ్ ఆఫ్ కోత’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?

King of Kotha: ఎట్టకేలకు ‘కింగ్ ఆఫ్ కోత’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?

Sundeep Kishan New Movie : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

Sundeep Kishan New Movie : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్‌ రిలీజ్!

Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్

Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్

టాప్ స్టోరీస్

Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు

Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Chandrababu News: చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి

Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా

Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!

Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!