Naga Chaitanya: ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదు.. నాగచైతన్య ఎందుకు అలా అన్నాడంటే?
ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రో కబడ్డీలో తెలుగు టైటాన్స్‌కు సపోర్ట్ చేస్తూ నాగచైతన్య ట్వీట్ చేశారు.
డిసెంబర్ 22వ తేదీ నుంచి జరగనున్న ప్రో కబడ్డీ హంగామా అప్పుడే మొదలైపోయింది. టీమ్స్‌ను సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగారు. మన తెలుగు జట్టు అయిన తెలుగు టైటాన్స్‌ను యువసామ్రాట్ నాగచైతన్య సపోర్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్ కూడా చేశారు.
ఈ ట్వీట్‌లో ‘జెర్సీ మాత్రమే కాదు కవచమది.. గ్రౌండ్ మాత్రమే కాదు పోరాట స్థలమది.. ఆయుధాలు లేకుండా జరిగే ఈ అత్యుత్తమ యుద్ధంలో @Telugu_Titans సత్తాచాటడానికి సిద్ధమంటుంది. రా.. చూద్దాం! #VivoProKabaddi Dec 22 నుంచి మీ #StarSportsTelugu.’ అని పేర్కొన్నారు.
నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్‌తో ‘థ్యాంక్యూ’, కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వంలో సోగ్గాడే చిన్నినాయన సీక్వెల్ అయిన ‘బంగార్రాజు’ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే వెబ్ సిరీస్ కూడా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి.
బంగార్రాజు సినిమా సంక్రాంతి బరిలోకి దిగనుందని వార్తలు వస్తున్నాయి. సోగ్గాడే చిన్నినాయన వంటి బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్ కావడం, మనం తర్వాత నాగార్జునతో కలిసి నాగచైతన్య నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక థ్యాంక్యూ ఓటీటీలో విడుదల అవుతుందని వార్తలు వచ్చినప్పటికీ.. కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. గ్యాంగ్ లీడర్ తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే.
జెర్సీ మాత్రమే కాదు కవచమది 💪
— chaitanya akkineni (@chay_akkineni) December 12, 2021
గ్రౌండ్ మాత్రమే కాదు పోరాట స్థలమది 🤜🤛
ఆయుధాలు లేకుండా జరిగే ఈ అత్యుత్తమ యుద్ధంలో 🔥
@Telugu_Titans సత్తాచాటడానికి సిద్ధమంటుంది 🥳
రా.. చూద్దాం! 😍
#VivoProKabaddi
Dec 22 నుంచి
మీ #StarSportsTelugu 📺 pic.twitter.com/w9Gn5L6ck4
Also Read: 'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?
Also Read: ఇక సహించేదే లేదు.. శిక్ష పడేవరకు పోరాడతా.. రవి సీరియస్..
Also Read: 'ఐకాన్' సినిమా అటకెక్కినట్లే.. ఇదిగో క్లారిటీ..
Also Read: 'నువ్ నన్ను భరించావా..? లేక నటించావా..?' మానస్ ని ప్రశ్నించిన పింకీ..
Also Read: రజనీకాంత్ పవర్ఫుల్ పంచ్‌లకు ఎవరైనా పడిపోవాల్సిందే... కొన్ని డైలాగులు ఇవిగో
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి