By: ABP Desam | Updated at : 14 Jan 2022 01:11 PM (IST)
Image Credit: Social Media
అయప్ప స్వామి దీక్షను ఎక్కువగా దక్షిణాది భక్తులే పాటిస్తారనే సంగతి తెలిసిందే. దీంతో, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్.. అయ్యప్ప మాలలో కనిపించేసరికి అంతా షాకయ్యారు. మొదట్లో ఏదో సినిమా షూటింగ్ కోసం నల్ల దుస్తులు, మాలతో కనిపించారని ఆయన అభిమానులు అనుకున్నారు. అయితే, ఆయన నిజంగానే అయ్యప్ప దీక్ష చేపట్టారని తెలిసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. అయ్యప్ప దీక్ష పాటించాలంటే ఎంతో నిష్టగా ఉండాలి. ఇరుముడులతో శబరిమల కొండెక్కిన తర్వాతే దీక్ష విరమించాలి.
అజయ్ దేవగన్.. 41 రోజులపాటు దీక్షలో ఉండటమే కాకుండా కఠిన నియమాలు పాటించారని తెలిసింది. దీక్షలో ఉన్నన్ని రోజులు ఆయన నేలపైనే నిద్రపోయారని, కాళ్లకు చెప్పులు ధరించలేదని ఆయన సన్నిహితులు తెలిపారు. అనంతరం ఆయన ఇరుముడితో శబరిమలకు వెళ్లారు. మాలలో ఉన్న అజయ్ దేవగన్ ఫొటోలను ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
బాలు మున్నంగి అనే జ్యోతిష్కుడి సూచనతో అజయ్ దేవగన్ అయ్యప్ప దీక్షను పాటించారు. గురుస్వామి వెంకట్ రెడ్డి అజయ్ దేవగన్ ఇంటికెళ్లి.. స్వయంగా మాలాధారణ చేయించారు. అనంతరం ఆయన దీక్షలో పాటించాల్సిన నియమాలు గురించి వివరించారు. ప్రస్తుతం అజయ్ దేవగన్ మాలలో ఉన్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR చిత్రంలో అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 7న విడుదల కావల్సిన ఈ చిత్రం కోవిడ్-19 నిబంధనల వల్ల వాయిదా పడింది. దీంతో ప్రేక్షకులు మరోసారి ఈ చిత్రం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
Bollywood actor Ajay Devgn visits Sabarimala temple
— Manjunath_P (@group_mvm) January 13, 2022
It is good to see such changes in Bollywood. #Bollywood #AjayDevgn #SwamiSharnamAyyap pic.twitter.com/ywIwyo1oky
Also Read: సమంతతో త్రివిక్రమ్ ప్లాన్.. నిజమేనా..?
Also Read: 'అవతార్ 2' రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్.. ఫ్యాన్స్ కు పండగే..
Also Read: మలైకాకి బ్రేకప్ చెప్పేశాడా..? ఇదిగో క్లారిటీ..
Also Read: మెగా హీరో కొత్త సినిమా టైటిల్ ఇదేనా..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Bigg Boss Season 7 Day 18 Updates: ఒక్కటైన ప్రియాంక, శోభ - ప్రిన్స్‌కు మళ్లీ షాక్, లోన్ తీసుకొని వచ్చానంటూ కన్నీళ్లు
Gandharvudu Jr: జూనియర్ ‘గంధర్వుడు’గా వస్తోన్న జనతా గ్యారేజ్ నటుడు!
Anil Kapoor: ఏఐ టెక్నాలజీపై కోర్టుకెక్కిన అనిల్ కపూర్ - పర్సనాలిటీ రైట్స్ కోసం పోరాటం, అసలు వాటి అర్థమేంటి?
Bigg Boss Season 7 Telugu: శోభాశెట్టితో సందీప్ కుమ్మక్కు? గౌతమ్‌కు అన్యాయం - ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది!
Bigg Boss Telugu: బిగ్ బాస్ ‘బొచ్చు’ ఫాంటసీ - కంటెస్టెంట్లకు క్షవరం తప్పదా, ఆయనకైతే ఏకంగా అరగుండు!
Nara Lokesh: మరికొన్ని రోజులు ఢిల్లీలోనే లోకేశ్! ఆ పరిణామంతో ఒక్కసారిగా మారిన నిర్ణయం!
IND Vs AUS: ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో భారత్ విక్టరీ - చివరి వరకు ఉండి గెలిపించిన కెప్టెన్ కేఎల్!
Pocharam Srinivas: చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ స్పీకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత
/body>