RRR Movie: తెలంగాణలో 'ఆర్ఆర్ఆర్' టికెట్ రేట్స్ ఇవే... బడ్జెట్ ఎంతో రివీల్ చేసిన తెలంగాణ ఛాంబర్!
తెలంగాణలో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 'ఆర్ఆర్ఆర్' సినిమా టికెట్ రేట్స్‌ను ఫిక్స్ చేశారు.
ఏపీలో 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా బెనిఫిట్ షోలు పడతాయా? టికెట్ రేట్ పెంచుకోవడానికి అనుమతులు లభిస్తాయా? అన్నది ఇంకా క్లారిటీ లేదు. టికెట్ ధరల పరిశీలనకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ ఎప్పుడు రిపోర్టు ఇస్తుందో చెప్పలేం. అయితే... ఏపీ పొరుగున ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణలో టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతులు వచ్చాయి. దాంతో 'ఆర్ఆర్ఆర్' టికెట్ రేట్స్ పెరిగాయి.
జీఎస్టీతో కలిసి మల్టీప్లెక్స్‌లలో రూ. 290, సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 175 చొప్పున 'ఆర్ఆర్ఆర్' టికెట్ రేట్స్ ఉంటాయని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేసింది. రెండు వారాల తర్వాత టికెట్ రేట్స్ తగ్గించవచ్చని కూడా పేర్కొంది. మరోవైపు చిన్న సినిమా టికెట్ రేట్స్ పెంచవద్దని అందరికీ చెప్పినట్టు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు సునీల్ నారంగ్ తెలిపారు.
Also Read: ఆర్ఆర్ఆర్‌కూ ఏపీలో అవే టిక్కెట్ ధరలు.. ఏమీ తేల్చకుండానే కమిటీ తొలి భేటీ వాయిదా !
"రూ. 600 కోట్లు పెట్టి 'ఆర్ఆర్ఆర్' సినిమా తీశారు. నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ రూ. 80 కోట్లు పెట్టి కొన్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సినిమా వరల్డ్ విజువల్ వండర్. భారీ బడ్జెట్ పెట్టి గ్రాండియర్‌గా తీశారు" అని సునీల్ నారంగ్ తెలిపారు.
Also Read: 'సేనాపతి' రివ్యూ: రాజేంద్ర ప్రసాద్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. జనవరి 7న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. జనవరి 6వ తేదీ సాయంత్రం 6 నుంచి తెలంగాణలో ప్రీమియర్ షోలు వేయడానికి ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.
Also Read: బాలకృష్ణతో సినిమా ప్రకటించిన దర్శకుడు... స్క్రిప్ట్ రెడీ!
Also Read: 'అర్జున ఫల్గుణ' రివ్యూ: అర్జునుడు బలయ్యాడా? బతికాడా?
Also Read: 'గాలోడు' టీజర్.. సుడిగాలి సుధీర్ మాస్ అవతార్..
Also Read: రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
Also Read: అజిత్ అలా చేయడం చాలా ఇబ్బందిగా అనిపించింది.. రాజమౌళి వ్యాఖ్యలు..
Also Read: TDP MLA On HEROS : తమిళ హీరోలు ప్రజల కోసం పోరాడతారు... తెలుగు హీరోలు తమ కోసం కూడా నోరెత్తలేరా ? .. టీడీపీ ఎమ్మెల్యే ఘాటు విమర్శలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి