By: ABP Desam | Updated at : 31 Dec 2021 05:02 PM (IST)
టాలీవుడ్ హీరోలపై అనగాని సత్యప్రసాద్ విమర్శలు
సినిమాల్లో ఎవరైనా వేధిస్తూంటే హీరోయిజం చూపించే హీరోలు ఇప్పుడు సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఎందుకు మాట్లాడటం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నంచారు. సినిమా టిక్కెట్ రేట్లు, ఆన్ లైన్ టిక్కెటింగ్, ధియేటర్ల సీజ్ వంటి అంశాలు టాలీవుడ్‌ను వేధించడానికేనని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ హీరోలు ఎందుకు నోరు మెదపలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. కావేరి నది జలాలు సమస్యపై అక్కడి సినీ పరిశ్రమంతా ఏకతాటిపై వచ్చారని, జల్లికట్టు అంశంపై తమిళ హీరోలంతా స్పందించారని కానీ ఏపీలో మాత్రం టాలీవుడ్‌ను వేధిస్తున్నా హీరోలు నోరు మెదపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.
Also Read: నాలుగు గోడల మధ్య జరిగేది... నచ్చేలా చూపించారు... 2021లో బోల్డ్ అటెంప్ట్స్!
విశాఖలో స్టూడియోలకు గత ప్రభుత్వం భూమి కేటాయిస్తే దాన్ని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఇవ్వకున్నా ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. సినీ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఆధారపడ్డారని తనిఖీల పేరుతో థియేటర్లు మూతపడుతుండడంతో చాలా మంది ఉపాధి కోల్పోతున్నారని అనగాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సినిమాలు ప్రజలు చూడాలి కానీ, ప్రజల కష్టాలు మాత్రం ఈ సినిమా హీరోలకు పట్టవా? అని అనగాని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులను కూడా ప్రభుత్వ పెద్దలు ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు. ఇప్పుడు థియేటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన విమర్శించారు.
Also Read: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. తాజాగా టిక్కెట్ రేట్లను పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చింది. అయితే ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. టిక్కెట్ రేట్లను దారుణంగా తగ్గించేయడమే కాకుండా తనిఖీల పేరుతో చాలా ధియేటర్లను క్లోజ్ చేస్తున్నారు. అయినప్పటికీ టాలీవుడ్‌కుచెందిన వారెవరూ మాట్లాడటం లేదు. గతంలో పవన్ కల్యాణ్ ఆన్ లైన్ టిక్కెటింగ్ అంశంపై మాట్లాడితే ఇండస్ట్రీలో ఎవరూ సపోర్ట్‌గా రాలేదు. దాంతో ఆయన కూడా మాట్లాడటం మానేశారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వ నిర్ణయాలు టాలీవుడ్‌కు వ్యతిరేకంగానే వచ్చాయి. హీరో నాని నోరు మెదపడంతో తెర మీదకు దిల్ రాజు వచ్చి ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. కానీ విడుదలైన సినిమాలు మాత్రం ఏపీలో కలెక్షన్లు కోల్పోతున్నాయి.
Also Read: టాలీవుడ్ లో యూనిటీ లేదు.. వైరల్ అవుతోన్న నాని వ్యాఖ్యలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Ambika Rao Passed Away: గుండెపోటుతో సీనియర్ నటి అంబికా రావు మృతి
Kaduva Postponed: ఓ వారం వెనక్కి వెళ్లిన పృథ్వీరాజ్ - 'కడువా' విడుదల వాయిదా
Actor Prasad: చెట్టుకి ఉరేసుకొని చనిపోయిన నటుడు - కారణమేంటంటే?
Tollywood: ప్లాప్ సినిమాలను బ్లాక్ బస్టర్స్ అంటున్నారే!
Modern Love Hyderabad: అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'మోడర్న్ లవ్ హైదరాబాద్' - ట్రైలర్ చూశారా?
Hyderabad Traffic News: హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు, ఈ టైంలో ఈ మార్గాల్లో అస్సలు వెళ్లొద్దు!
Kuppam Politics : కుప్పం బరిలో హీరో విశాల్, వైసీపీ నయా ప్లాన్-సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం!
KCR to Raj Bhavan: నేడు కొత్త సీజే ప్రమాణ స్వీకారం, సీఎం KCR రాజ్ భవన్‌కు వెళ్తారా?
Vizag Public Library: చిన్నారులను ఆకట్టుకుంటున్న జంగిల్ లైబ్రరీ - వైజాగ్‌లో ప్రయోగం సక్సెస్