Tollywood Year Ender 2021: నాలుగు గోడల మధ్య జరిగేది... నచ్చేలా చూపించారు... 2021లో బోల్డ్ అటెంప్ట్స్!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి 2021 ఓ కొత్త దారి చూపింది. నాలుగు గోడల మధ్య జరిగే విషయాన్ని జాగ్రత్తగా చెబితే నలుగురికీ నచ్చుతుందని, జనాలు ఆదరిస్తారని చెప్పింది. 2021లో వచ్చిన బోల్డ్ అటెంప్ట్స్, సినిమాలు...
శృంగారం...
లైంగిక అవసరం!
ఇద్దరి మధ్య ఏకాంతం...
పునఃసృష్టికి మూలమైన సంభోగం!
కాదేదీ కథకు అనర్హం...
తెలుగు సినిమాకు 2021 చెప్పిన సూత్రం!
ఆడ, మగ మధ్య నాలుగు గోడల మధ్య జరిగే విషయాన్ని చెప్పడానికి ఒకప్పుడు నలుగురు ఏమనుకుంటారో అని అందరూ ఆలోచించేవారు. నలుగురిలో ఎవరైనా మాట్లాడడానికి మొహమాట పడేవారు. అటువంటి స్క్రీన్ మీద చెప్పాలంటే? మన దర్శక - నిర్మాతలు, నటీనటులు కూడా ఆలోచించేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. బోల్డ్ అటెంప్ట్స్ చేయడానికి ఫిల్మ్ మేకర్స్ ముందుకు వస్తున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఒకప్పుడు హీరో హీరోయిన్ ముద్దు పెట్టుకునే సన్నివేశాలు చూపించాల్సి వస్తే... పెదవులు దగ్గరకు వచ్చిన తర్వాత పువ్వును అడ్డుగా చూపించేవారు. ఆ తర్వాత కిస్సులు, లిప్ లాక్స్ తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకు వేసి బెడ్ రూమ్ సీన్స్ చూపించే స్థాయికి తెలుగు సినిమా చేరుకుంది. శృంగారం అనగానే కొందరు బూతుగా చూస్తారు. అయితే... మానవ జీవితంలో అదీ ఓ భాగమే. దాన్ని దర్శకులు కళాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. నాలుగు గోడల మధ్య జరిగే విషయాన్ని నలుగురికీ నచ్చేలా చెప్పి విజయాలు అందుకున్నారు.
ఆడ (హీరోయిన్), మగ (హీరో) మధ్య కలయికే 2021లో వచ్చిన కొన్ని సినిమాల్లో కీలక అంశం (కీ పాయింట్) అయ్యింది. ఆ సినిమాలు ఏమిటో చూడండి.
'ఉప్పెన'... కటింగ్ కాదు, ప్రేమకు కొత్త నిర్వచనం!
'ఉప్పెన'... మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముద్దుల మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన సినిమా. ప్రేక్షకుల ముందుకు రావడానికి ముందే సినిమా క్లైమాక్స్‌లో ఏముందో లీకైంది. మెగా మేనల్లుడి తొలి సినిమాకు అటువంటి కథను ఎంపిక చేసుకుంటారా? అని కొందరు సందేహించారు. మరి కొందరు క్లైమాక్స్ పాయింట్ మీద కామెడీ చేశారు. అయితే... సినిమాలో 'కట్టింగ్' విషయాన్ని దర్శకుడు చివరి వరకూ దాచి పెట్టాడు. 'కటింగ్' అనేది సినిమాలో మెయిన్ పాయింట్ కాదు. జీవిత భాగస్వామి నుంచి మహిళలు శృంగారం మాత్రమే కోరుకోరని ప్రేమకు కొత్త నిర్వచనం ఇచ్చారు. నలుగురినీ మెప్పించారు. ఇప్పటి వరకూ హీరోలుగా పరిచయమైన మెగా ఫ్యామిలీ యంగ్‌స్టర్స్ కమర్షియల్, ఫ్యామిలీ సినిమాలతో వచ్చారు. వైష్ణవ్ తేజ్ డేరింగ్ స్టెప్ వేశారు. తొలి సినిమాతో భారీ విజయం అందుకున్నారు.
Also Read: Tollywood 2021 Review: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
వకీల్ సాబ్... ఆర్ యు ఏ వర్జిన్?
హిందీ హిట్ 'పింక్'ను తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్ చేశారు. పవన్ కల్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు కథలో మార్పులు చేశారు. కానీ, ఆత్మను మాత్రం మార్చలేదు. అవ్వడానికి 'వకీల్ సాబ్' కోర్టు రూమ్ డ్రామా ఎవ్వచ్చు. కానీ, ఆ కథకు మూలం మాత్రం నాలుగు గోడల మధ్య జరిగిన అంశమే. ముగ్గురు అమ్మాయిలు స్నేహితులతో కలిసి ఓ రిసార్టుకు వెళతారు. తనకు ఇష్టం లేకున్నా... బలవంతం చేయడంతో అబ్బాయిపై ఓ అమ్మాయి దాడి చేస్తుంది. దాంతో ఆమె క్యారెక్టర్ మీద దాడి మొదలవుతుంది. కోర్టులో 'ఆర్ యు ఏ వర్జిన్?' అని అమ్మాయిని అడిగే వరకూ వెళుతుంది. శృంగారం విషయంలో మహిళ అభిప్రాయానికి విలువ ఇవ్వాలని, ఆఖరికి అమ్మాయి 'నో' అంటే 'నో' అనే అర్థం అని బలంగా చాటి చెప్పిన సినిమా 'వకీల్ సాబ్'. మహిళ మనసుకు విలువ ఇచ్చిన సినిమా ఇది! మహిళల చుట్టూ తిరిగే ఇటువంటి కథను పవన్ కల్యాణ్ వంటి స్టార్ చేయడం అభినందనీయం!
Also Read: Item Songs of the Year 2021: సెక్సీ లేడీస్... ఐటమ్ సాంగ్స్ అదుర్స్!
ఏక్ మినీ కథ... చిన్నదా? పెద్దదా?
2021లో వచ్చిన బోల్డ్ అటెంప్ట్స్ అన్నిటిలోనూ 'ఏక్ మినీ కథ' బోల్డ్ అటెంప్ట్ అని చెప్పాలి. ఇప్పటివరకూ తెలుగు తెరపై ఎవరూ డిస్కస్ చేయని పాయింట్‌ను సిన్మా క్రియేటర్ మేర్లపాక గాంధీ 'ఏక్ మినీ కథ'లో డిస్కస్ చేశారు. తనది చిన్నదని తనలో తాను బాధపడే ఓ యువకుడి కథను సినిమాలో చెప్పారు. బెడ్ మీద పెర్ఫార్మెన్స్‌కు సైజ్‌తో సంబంధం లేదని చెప్పిన చిత్రమిది. ఓ విధంగా జనాలను ఎడ్యుకేట్ చేసే సినిమా ఇది. చాలా మంది అబ్బాయిల్లో ఉన్న ఓ లైంగిక సందేహానికి సమాధానం ఇచ్చిన చిత్రమిది.
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
లవ్ స్టోరీ... లైంగిక వేధింపులు!
సున్నితమైన సినిమాలు తీసే శేఖర్ కమ్ముల నుంచి 2021లో వచ్చిన సినిమా 'లవ్ స్టోరీ'. ఇదో ప్రేమకథ. అయితే... అందులోనూ ఆయన ఓ సామాజిక అంశాన్ని స్పృశించారు. ఇంట్లో ఎదురయ్యే లైంగిక వేధింపుల గురించి సినిమాలో చెప్పారు. నాలుగు గోడల మధ్య... తన అనుకున్న మనుషుల నుంచి... వేధింపులు ఎదురైనప్పుడు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న అమ్మాయి మనోవేదనను మనసును తాకేలా చెప్పడంలో శేఖర్ కమ్ముల సఫలీకృతం అయ్యారు. సినిమా కీ పాయింట్స్‌లో అదొకటి.
Also Read: Telugu Hero Vs Tamil Hero 2021: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?
సినిమాలో ప్రధాన అంశం అదేనని చెప్పలేం గానీ... 'రంగ్ దే', 'శ్రీదేవి సోడా సెంటర్', 'మేస్ట్రో', 'మహా సముద్రం', 'శ్యామ్ సింగ రాయ్' సినిమాల్లోనూ బెడ్ రూమ్ సీన్స్ ఉన్నాయి. 'రంగ్ దే'లో హీరోయిన్ అంటే హీరోకి పడదు. తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటారు. ఉన్నత చదువుల కోసం విదేశాలు వెళతారు. ఓ మూమెంట్‌లో ఇద్దరూ ఒకటవుతారు. దాంతో హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది. ఆ తర్వాత కథ కొత్త మలుపు తీసుకుంటుంది. 'శ్రీ దేవి సోడా సెంటర్'లోనూ హీరో హీరోయిన్లు కలిసినట్టు చూపిస్తారు. అయితే... ఎక్కడా అసభ్యత ఉండదు. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య ప్రేమను వ్యక్తం చేయడానికి రొమాన్స్‌ను దర్శక, రచయితలు ఎంచుకుంటున్నారు.
Also Read:ప్రేమకథ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వచ్చింది? రాజమౌళి వైఫ్ చేసిందేమిటి?
Also Read: నానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన తమన్... ఇద్దరి మధ్య గొడవ ఏంటి!?
Also Read: Theaters Issue In AP: ఏపీలో 'ఆర్ఆర్ఆర్'కు ఇది ప్లస్సే... మరి, టికెట్ రేట్స్ సంగతి?
Also Read: ఎన్టీఆర్... రామ్‌చరణ్... ఆర్ఆర్ఆర్... అది పబ్లిసిటీ స్టంటా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి