విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్ ట్రైన్
విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య జర్నీ చేయాలంటే బస్ అయినా కారు అయినా కనీసం 5 గంటలు..అదే ఫ్లైట్ లో వెళితే..బోర్డింగ్ అవీ ఇవీ కలిపి ఎంత లేదన్నా 2-3గంటలు పట్టేస్తుంది. అదే హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కి...విజయవాడలో కేవలం పావుగంటలో దిగితే..ఓ సారి ఊహించుకోండి. ఇదేదో మాయో అద్భుతమో కాదు..మరికొన్నేళ్లలో ఈ ఊహకు అందని విషయం నిజం కానుంది. అదే హైపర్ లూప్ టెక్నాలజీ. దీన్ని చెప్పాలంటే ముందు మనం దీని సైన్స్ ఏంటో మాట్లాడుకోవాలి. జనరల్ గా ఏదైనా వస్తువు స్పీడ్ గా వెళ్లాంటే ఎదురుగా వచ్చే ఎయిర్ ప్రెజర్ ను తట్టుకోవాలి. మీరు బైక్ మీద స్పీడ్ గా వెళ్తే ఏమతుంది గాలి భయంకరంగా మీ మోహాన్ని కొడుతూ ఉంటుంది కదా..ఆ స్పీడ్ గాలే ప్రెజర్ ను క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఆ ఒత్తిడిని దాటుకుని మీరు వేగంగా వెళితే ఎంత వేగంగా అయినా వెళ్లిపోవచ్చు. అందుకోసం పుట్టిందే ఈ హైపర్ లూప్ టెక్నాలజీ. దీన్ని ప్రమోట్ చేసి ఈ టెక్నాలజీ తో అద్భుతాలు చేయొచ్చు అని ప్రచారం చేస్తోంది..ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ కృషి చేస్తోంది ఎలన్ మస్క్. స్పేస్ ఎక్స్, ట్విట్టర్, టెస్లా, న్యూరా లింక్ లాంటి ప్రాజెక్టులతో పాటు ఆయనకు హైపర్ లూప్ మీద వర్క్ చేసే కంపెనీస్ ఉన్నాయి.