Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Manchu : టీవీ9 రిపోర్టర్‌ను కొట్టడంపై మంచు మోహన్ బాబు మరో సంచలన ఆడియో రిలీజ్ చేశారు. తాను కరెక్టే చేశానని.. న్యాయమా.. అన్యాయమో ఆలోచించాలని ప్రజల్నికోరారు.
Mohanbabu New Audio: మీడియా ప్రతినిధిని కొట్టడంపై మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలో కీలక విషయాలు ఆయన మాటల్లోనే :
కుటుంబసమస్యల్లో బయట వాళ్లు జోక్యం చేసుకోవచ్చు. వందకు వంద శాతం కాకపోవచ్చు.. 95 నుంచి 96 శాతం కుటుంబాల్లో సమస్యల్లో ఉంటాయి. కొంత మంది ఉన్నవి లేనివి చెబుతూంటారు. ఇదంతా ప్రజలకు తెలుసు. ఇప్పుడు ప్రజలు కూడా.. రాజకీయ నాయకులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. టీవీల్లో వస్తున్నాయి..మీడియా, సోషల్ మీడియాలో వస్తోంది.
ఆ రోజు నా బిడ్డ మనోజ్ కుమార్ గేటు తోసుకుని లోపలికి వచ్చాడు. ఆ విషయం రైటా రాంగా అన్నది తర్వాత మాట్లాడుకోవచ్చు. పత్రికా సోదరులు నా ఇంటి ముందు నాలుగు రోజుల నుంచి వ్యాన్లు పెట్టుకుని ఉండటం ఎంత వరకు న్యాయం?. నేను అప్పటికి బయటకు వెళ్తున్నప్పుడు చెప్పాను.. నాకు కుటుంబసమస్యలు ఉన్నాయి.. నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను.. దయచేసి నా ప్రైవసీని గౌరవించండి అని కోరారు. నేను ఎలాంటి వాడ్నో అందరికీ తెలిసు. నా హృదయంలోని ఆవేదన చెప్పనలవి కాదు.
రాత్రుల్లు.. గేటు పగులగొట్టి..గేటు తోసేసి ఎవరైనా ఇంట్లోకి రావొచ్చా?. వచ్చిన వారు ఎవరో నా మీద పగపెట్టుకుని వచ్చి ఉంటారని నా సందేహం. అయితే వాళ్లను తిట్టాలని కొట్టాలని నేను అనుకోలేదు. వారు ఉద్యోగస్తులు. నేను కూడా కూలీవాడ్నే. భగవంతుడు అందరికీ కూలీ ఇస్తూంటాడు. అతను కొట్టాననే చెబుతున్నాడు తప్ప..మైకు తీసుకు వచ్చి నోట్లో పెట్టాం .. కన్ను పోవచ్చు. కన్ను పోలేదు.. కానీ కంటి కింద తగిలింది. కాస్త పైకి తగిలి ఉంటే. గుడ్డి అయ్యేది. అతనికి చెవికి తగిలిందని అంటున్నారు. ఆ చీకట్లో ఏం జరిగిందో తెలియలేదు. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలి ఉండవచ్చు. నేను దానికి బాధపడుతున్నా. అతనూ నాకు తమ్ముడే.
అతని భార్య, పిల్లలు ఎంత బాధిపడి ఉంటారో అని ఆలోచిస్తున్నారు. సినిమాలో నటిస్తాను తప్ప నిజ జీవితంలో నటించను. నాకు ఉన్నది ఒక్కటే ఆలోచన.. ఎందుకు కొట్టాలి ?. వారు గేటు బయట ఉండి .. నేనే ఆవేశంలో వెళ్లి కొట్టి ఉంటే వంద కేసులు పెట్టి ఉండవచ్చు. అలా కొట్టి ఉంటే నేనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయేవాడ్ని. నా ఇంటి గేటు తోసుకు వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. మా సమస్య మేం చర్చించుకుంటాం. మధ్యవర్తులు అక్కర్లేదు. కట్టుబట్టలతో మద్రాస్‌కు వెళ్లా. చెప్పులు సగం అరిపోయి దశలో నేను మద్రాస్ కు వెళ్లా. కష్టార్జితంతో నేను సంపాదించుకున్నాను. చేయగలిగినంత సాయం చేశాను.
అన్నీ మర్చిపోయి కొట్టింది మాత్రమే మాట్లాడుతున్నారు. ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చిందో అభిమానులు గుర్తించారు. న్యాయాధిపతులు, మీడియా ప్రతినిధులు, ప్రజలు కూడా ఇలా ఇంట్లోకి దూసుకు వచ్చి గోల చేస్తే ఏం చేస్తారు? . రేపు కూడా నేను టీవీ పెట్టొచ్చు. అతనికి గాయం అయిన దానికి చాలా చింతిస్తున్నాను. అంత కంటే ఏం చేయగలను ?. అతను చేసిందేమిటి ? . ప్రజలారా మీరే చూడాలని ..నేను చేసింది న్యాయమా.. అన్యాయమా మీరో ఆలోచించాలని కోరారు.