అన్వేషించండి

World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు

Chess Championship: ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన 14వ రౌండ్‌లో నువ్వా.? నేనా.? అన్నట్లుగా సాగిన గేమ్‌లో విజయం వరించింది.

Gukesh As World Chess Championship: యువ కెరటం దొమ్మరాజు గుకేశ్ (Gukesh) సంచలనం సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా)తో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచాడు. గురువారం జరిగిన 14వ రౌండ్‌లో నువ్వా.? నేనా.? అన్నట్లుగా సాగిన గేమ్‌లో చివరికి గుకేశ్‌నే విజయం వరించింది. విశ్వనాథన్ ఆనంద్ (5 సార్లు) తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేశ్ చరిత్ర సృష్టించాడు.

అతిపిన్న వయస్కుడిగా రికార్డు

ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన అతిపిన్న వయస్కుడిగా గుకేశ్ రికార్డు సృష్టించాడు. 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. 2012 తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా గుకేశ్ నిలిచాడు. ఈయన తమిళనాడులోని తెలుగు కుటుంబానికి చెందినవాడు. కాగా, బుధవారమే ఈ ఫలితం తేలాల్సి ఉండగా.. సుమారు 5 గంటలపాటు సాగిన 13వ రౌండ్‌లో ప్రత్యర్థులిద్దరూ పాయింట్‌ను పంచుకున్నారు. గుకేశ్ గట్టిగానే ప్రయత్నించినా.. ప్రశాంతంగా ఆడిన 32 ఏళ్ల లిరెన్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు. దీంతో చెరో 6.5 పాయింట్లతో మ్యాచ్ డ్రా అయ్యింది. గురువారం జరిగిన 14వ రౌండ్‌లో విజయంతో ఒక పాయింట్ సాధించిన గుకేశ్ 7.5తో విజేతగా నిలిచాడు.

చెస్ ప్రపంచం దృష్టిలో.. మంచి ఫామ్‌లో ఉన్న 18 ఏళ్ల గుకేశ్ ఫేవరెట్. అతను.. నెపోమ్నియాషి, కరువానా, నకముర వంటి మేటి గ్రాండ్ మాస్టర్స్‌ను తోసిరాజని క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలవడం ద్వారా లిరెన్‌తో పోరుకు అర్హత సాధించి.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఆ తర్వాత చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిసారి స్వర్ణం గెలవడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. 

'పదేళ్ల కల సాకారమైంది'

18 ఏళ్ల ప్రాయంలోనే ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడంతో తన పదేళ్ల కల సాకారమైందన్నాడు. ఈ క్షణం కోసం తాను దశాబ్దాలుగా కలలు కన్నానని, అది నెరవేరినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ విజయాన్ని ఊహించలేదని.. అందుకే కాస్త భావోద్వాగానికి లోనయ్యాడని చెప్పాడు. 'ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్‌లో గెలవాలనే కల.. నాకంటే నా తల్లిదండ్రులకే ఎక్కువ ఉంది. వారి ప్రోత్సాహం ఎనలేనిది. నా దృష్టిలో డింగ్ లిరెన్ నిజమైన ప్రపంచ ఛాంపియన్. అతడి ఓటమి బాధగా ఉంది. డింగ్, అతని బృందానికి ధన్యవాదాలు. విజయం సాధిస్తానని ఊహించలేదు. కానీ, అవకాశం రావడంతో పావులు కదిపా. పదేళ్ల కల నెరవేరింది. ఈ క్షణం కోసం పదేళ్లుగా కలలు కన్నా. ఊహించని విజయానికి భావోద్వేగానికి గురయ్యా. ఈ ఛాంపియన్‌షిప్ గెలిచినంత మాత్రాన నేనేనీ ఉత్తమ ప్లేయర్‌ను కాదు. అది కేవలం మాగ్నస్ కార్ల్‌సనే' అని గుకేశ్ పేర్కొన్నాడు. 

రాష్ట్రపతి ప్రశంసలు

గుకేశ్.. దేశం గర్వపడేలా చేశారని భారత రాష్ట్రపతి పేర్కొన్నారు. 'అద్భుతమైన విజయం సాధించిన గుకేశ్‌కు అభినందనలు. అతడి అసమాన ప్రతిభ, కృషి, సంకల్పాల ఫలితమే ఈ విజయం. చెస్ చరిత్రలో గుకేశ్ పేరును సుస్థిరం చేయడమే కాకుండా లక్షలాది మంది యువతకు గొప్ప కలలు కనేందుకు ఈ గెలుపు ప్రేరణగా నిలుస్తుంది.' ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

Also Read: Rohit Vs Jaiswal: జైస్వాల్‌ను హోటల్‌లో వదిలేసి ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోయిన రోహిత్‌ టీం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Happy Birthday Rajinikanth: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Embed widget