Rajamouli: ప్రేమకథ ప్లేస్‌లో 'ఆర్ఆర్ఆర్' ఎలా వచ్చింది? రాజమౌళి వైఫ్ చేసిందేమిటి?
'బాహుబలి 2' తర్వాత రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' తీయాలనుకోలేదు. ఇద్దరు సూపర్‌స్టార్స్‌తో మరో సినిమా ప్లాన్ చేశారు. మరి, 'ఆర్ఆర్ఆర్' ఎలా వచ్చింది? అంటే.. అందుకు కారణం రమా రాజమౌళి అని చెప్పక తప్పదు.
'బాహుబలి: ద కంక్లూజన్'... ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాసిన సినిమా. తెలుగు సినిమా ఇండస్ట్రీ సత్తా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పిన సినిమా. 'బాహుబలి 2' రికార్డులు సృష్టించిన తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎటువంటి సినిమా తీస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. 'మగధీర' తర్వాత 'మర్యాద రామన్న' తీసినట్టు ఓ చిన్న సినిమా తీస్తారా? లేదంటే... 'ఈగ' తరహాలో హీరోలు అవసరం లేని కొత్త కథను చెబుతారా? అని ప్రేక్షకులే కాదు, పరిశ్రమ ప్రముఖులు సైతం ఆలోచించారు. అయితే... 'ఆర్ఆర్ఆర్' అనౌన్స్ చేసి రాజమౌళి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
'ఆర్ఆర్ఆర్'... అదీ నందమూరి, కొణిదెల (మెగా) కుటుంబాలకు చెందిన ఇద్దరు యంగ్‌స్టార్స్‌తో అనేసరికి అదే హాట్ టాపిక్ అయ్యింది. అసలు, 'బాహుబలి' తర్వాత రాజమౌళి నిజంగానే 'ఆర్ఆర్ఆర్' తీయాలని అనుకున్నారా? అంటే... 'కాదు' అని చెప్పాలి. ఆయన చెప్పిన మాటే ఇది.
Also Read: Tollywood 2021 Review: కాలర్ ఎగరేసిన కమర్షియల్ సినిమా... దుమ్ము దులిపేసిన స్టార్స్!
అవును... 'బాహుబలి 2' తర్వాత 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తీయాలని రాజమౌళి అనుకోలేదు. ఓ ప్రేమకథ తెరకెక్కించాలని ఆయన అనుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, యాక్సన్ సీన్స్ లేని చిన్న సినిమా చేయాలనుకున్నారు. ఇద్దరు సూపర్‌స్టార్స్, ఓ అమ్మాయిని పెట్టి ముక్కోణపు ప్రేమకథా చిత్రం రూపొందించాలని రాజమౌళి భావించారు. ఇదీ ఆయన ప్లాన్. అయితే... ఆ ప్రేమకథా చిత్రం స్థానంలో 'ఆర్ఆర్ఆర్' రావడానికి కారణం ఆయన భార్య రమా రాజమౌళి. తాను లవ్ స్టోరి తీయాలనే ఐడియాను రాజమౌళి చెప్పగా... *నువ్ లవ్ స్టోరి తీస్తే ఎవరు చూస్తారు?* అని రమా రాజమౌళి అన్నారట. దాంతో రాజమౌళి హార్ట్ బ్రేక్ అయ్యింది. ఆలోచన మారింది. ఆర్ఆర్ఆర్ వచ్చింది. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు... ఇద్దరు రియల్ లైఫ్ హీరోలను తీసుకుని ఫిక్షనల్ స్టోరి అల్లారు.
ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, అలీసన్ డూడీ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read: Telugu Hero Vs Tamil Hero 2021: సామాన్యుడికి దూరంగా తెలుగు హీరో!? మనలో ఒకడిగా కనిపించలేరా!?
Also Read: Item Songs of the Year 2021: సెక్సీ లేడీస్... ఐటమ్ సాంగ్స్ అదుర్స్!
Also Read: మహేష్‌తో సినిమా... స్క్రిప్ట్ సిట్టింగ్స్ గురించి రాజమౌళి రియాక్షన్!
Also Read: యువరానర్... వీళ్లే ఈ ఏడాది ఆన్-స్క్రీన్ లాయర్స్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి