అన్వేషించండి

రణ్ వీర్, అలియా ‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’ ఫస్ట్ లుక్ రిలీజ్

ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ 51వ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ చిత్రం "రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ" మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఎలక్ట్రిఫైయింగ్ అవతార్‌లో రణ్ వీర్, అలియాలు ఆకర్షిస్తున్నారు

Karan Johar : భారతీయ చలన చిత్రంలో గత 25 సంవత్సరాలుగా అభిమానులను అలరిస్తోన్న కరణ్ జోహార్ మే 25న 51వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అద్భుతమైన అప్ డేట్ ను రిలీజ్ చేశారు. ‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘కుచ్ కుచ్ హోతా హై’ నుంచి ‘ఏ దిల్ హై ముష్కిల్’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ లాంటి ఎన్నో హిట్ సినిమాలను కరణ్ జోహార్ అందించారు. మే 25తో ఆయన 51 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. అంతే కాకుండా సినీరంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పుట్టినరోజు వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ranveer Singh (@ranveersingh)

‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’ ఫస్ట్ లుక్ రిలీజ్

కరణ్ జోహార్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ రివీలైంది. అతని రాబోయే చిత్రం, ‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’ ఫస్ట్-లుక్ పోస్టర్‌ను మేకర్స్ గ్రాండ్ గా ఆవిష్కరించారు. స్టార్ నటులు అలియా భట్, రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్..  అభిమానులకు ‘కభీ ఖుషీ కభీ ఘమ్’తో పాత మల్టీ-స్టారర్ వైబ్‌లను మళ్లీ తిరిగి వస్తుందని మేకర్స భావిస్తున్నారు. ఈ సందర్భంగా రిలీజైన మూవీ ఫస్ట్ లుక్‌లో రణవీర్, అలియా ఎలక్ట్రిఫైయింగ్ అవతార్‌లో తమ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో అబ్బురపరుస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt)

దీంతో పాటు నటుడు రణ్ వీర్ సింగ్, అలియా భట్ కూడా తమ సింగిల్ పోస్టర్లను తమ తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ‘మీట్ రాకీ’ అంటూ రణ్ వీర్, ‘మీట్ రాణి’ అంటూ అలియా తమ ఫస్ట్ లుక్ ను షేర్ చేశారు. వీరి పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రణవీర్, అలియాతో పాటు ధర్మేంద్ర, షబానా అజ్మీ, జయా బచ్చన్‌లతో పలువురు ప్రముఖులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించనున్నారు. కాగా ‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’ సినిమా జూలై 28, 2023న థియేటర్లలోకి రానుంది.

నిర్మాతగా 25 సంవత్సరాలు

కరణ్ చిత్ర నిర్మాతగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వం వహించిన అన్ని చిత్రాల జ్ఞాపకాలతో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, కాజోల్, రాణి ముఖర్జీ, అలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, రణ్‌వీర్ సింగ్, వివిధ సంస్థలకు చెందిన ఫుటేజీలు ఉన్నాయి. దాంతో పాటు తన రాబోయే దర్శకత్వ ప్రాజెక్ట్, ‘రాకీ ఔర్ రాణి కీప్రేమ్ కహానీ’లోని అన్ సీన్ గ్లింప్సెస్ ను కూడా షేర్ చేశారు. “నేను దర్శకుడిగా 25 సంవత్సరాలకు పూర్తి చేసుకున్నందుకు కృతజ్ఞత తప్ప మరేమీ చెప్పలేను. ఈ ప్రయాణంలో నేను పెరిగాను, ఏడ్చాను, నవ్వాను.. జీవించాను" అంటూ ఆయన క్యాప్షన్ లో రాసుకొచ్చాడు.

Read Also : విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన కంగనా రనౌత్

టాప్ హెడ్ లైన్స్

Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Balakrishna Koratala Siva Movie: కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
కొరటాలతో బాలకృష్ణ సినిమా ఆగిందా? యూనిట్ ఇన్‌సైడ్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే?
Podarillu Serial Today August 18th:పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
పొదరిల్లు: పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Embed widget