RGV on Dog Attack Incident: పేదరికమే ప్రదీప్ కుటుంబం చేసిన నేరం - వీధి కుక్కల ఘటనపై ఆర్జీవి ఆగ్రహం
వీధి కుక్కల దాడిలో చనిపోయిన ప్రదీప్ కటుంబానికి వర్మ అండగా నిలిచారు. ప్రదీప్ కోసం న్యాయం చేయనున్నట్లు వెల్లడించారు. వారిది పేద కుటుంబం కావడం వల్లే ఎవరూ సపోర్టు చేయడం లేదని మండిపడ్డారు.
హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు ప్రదీప్ చనిపోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణం అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని, హైదరాబాద్ మేయర్ ను టార్గెట్ చేస్తూ ట్వీట్స్ చేశారు. అంతేకాదు, ప్రదీప్ కుటుంబం తరపున న్యాయపోరానికి దిగారు. అంతర్జాతీయ లాయర్ తో కేసు టేకప్ చేయిస్తున్నట్లు వెల్లడించారు. అతడి కుటుంబానికి కచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడుతానని తెలిపారు. తాజాగా ప్రదీప్ కుటుంబ పరిస్థితిపై ఆయన ట్వీట్ చేశారు. “ప్రదీప్ కుటుంబం చేసిన నేరం పేదరికం. అందుకే వారికి పెద్ద పెద్ద సంస్థలు మద్దతు ఇవ్వడం లేదు. ఈ ఘటనతో ఓట్లు రాలవనే ఎవరూ అండగా నిలవడం లేదు” అంటూ తాజాగా సోషల్ మీడియాలో వెల్లడించారు.
View this post on Instagram
ఇంటర్నేషనల్ లాయర్ తో వర్మ న్యాయపోరాటం
ప్రదీప్ కుటుంబానికి న్యాయం చేయడం కోసం అంతర్జాతీయ న్యాయవాదిని రంగంలోకి దించారు రామ్ గోపాల్ వర్మ. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ‘‘ఈ విషయం తెలియజేస్తున్నందుకు ఎంతో థ్రిల్‌గా ఫీలవుతున్నాను. వీధి కుక్కల దాడిలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగేలా పోరాడటం కోసం మిస్టర్ శ్రీనివాస్ కావేటి(జ్యూరీస్ డాక్టరేట్, ఎల్‌ఎల్‌ఎం) అంతర్జాతీయ లాయర్ ఈ కేసును టేకప్ చేశారు’’ అని చెప్పారు. బాధిత కుటుంబంతో పాటు సదరు లాయర్ ఉన్న ఫోటోని ఈ మేరకు వర్మ షేర్ చేశారు.
ప్రభుత్వానికి 5 ప్రశ్నలు సంధించిన ఆర్జీవీ
మరోవైపు బాలుడిపై వీధి కుక్కల దాడికి సంబంధించి అంశంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల బెడద నియంత్రణకు ఏం చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించింది. తాజాగా ఈ అంశంపై హకోర్టు విచారణ జరిపింది. అటు ఈ ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వానికి దర్శకుడు వర్మ 5 ప్రశ్నలకు సంధించారు. నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటనపై సరైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆర్జీవీ. ఈ మేరకు తన ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలన్నారు.
1. డియర్ గవర్నమెంట్, ఈ ఘటన నేపథ్యంలో కుక్కల బెడద నియంత్రణకు తక్షణ చర్యలు ఏం తీసుకున్నారు?
2. చిన్నారుల ప్రాణాల కంటే కుక్కలే మీకు ముఖ్యమైతే వాటిని దత్తత తీసుకొని డాగ్ షెల్టర్లకు తరలించవచ్చు. కానీ, ప్రజలనే దత్తత తీసుకోమని చెప్పటం ఏంటి?
3. నాలుగు కోట్లకు పైగా ఉన్న కుక్కల సంరక్షణకు ప్రభుత్వం దగ్గర సరైన వనరులు లేకపోతే, జంతు ప్రేమికుల నుంచే ఆ డబ్బులను తీసుకోవచ్చు కదా?
4. అన్ని కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తామనేది సుదీర్ఘమైన ప్రక్రియ. కానీ, ప్రస్తుతం అవి జనాలను చంపేస్తున్నాయి? ఈ విషయంలో ఏ చర్యలు తీసుకుంటున్నారు?
5. కుక్కల దాడిలో చనిపోయిన బాలుడి కుటుంబానికి ఎంత పరిహారం ఇస్తారు? మేయర్ విజయలక్ష్మీ ఎంత పరిహారం ఇస్తారు? అని ఆర్జీవి ప్రశ్నించారు.
మేయర్ విజయలక్ష్మిపై ఓరేంజిలో సెటైర్లు
ఇదే విషయాన్నికి సంబంధించి మేయర్ గద్వాల విజయలక్ష్మీని ఆర్టీవీ టార్గెట్ చేశారు. విజయ లక్ష్మీ నివాసంలో అంబర్ పేట సంఘటనలో బాలుడిని చంపేసిన కుక్కలనే కాకుండా.. కనీసం ఐదు వేల కుక్కలని వదిలేయాలని మంత్రి కేటీఆర్ ను కోరాడు. మేయర్ కుక్కల మధ్యలో కూర్చొని కుక్కల్ని ఎంత ప్రేమగా చూస్తారో? ఏయే కుక్కలకి ప్రేమగా అన్నం తినిపిస్తుందో చూడాలని ఉందంటూ కామెంట్ చేశారు. అటు బాధిత బాలుడి తరఫున ఆర్జీవీ న్యాపోరాటం చేయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.
Also Read : అగ్ని ప్రమాదానికి గురైన మెగాస్టార్ మూవీ సెట్ - దాని కాస్ట్ ఎంతంటే?