Vikram Trailer: 'విక్రమ్' తెలుగు ట్రైలర్ వచ్చేసింది - ఫ్యాన్స్ కు యాక్షన్ ట్రీట్
కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' సినిమా తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు.

స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందిస్తోన్న యాక్షన్ ఎంటర్టైనర్ 'విక్రమ్'. ఇంతకు ముందు కార్తీ హీరోగా 'ఖైదీ', విజయ్ హీరోగా 'మాస్టర్' చిత్రాలకు లోకేష్ దర్శకత్వం వహించారు. తెలుగులోనూ 'ఖైదీ' భారీ విజయం సాధించింది. 'మాస్టర్' సినిమాకు తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ ఆదరణ లభించింది. భారీ వసూళ్లు సాధించింది. విజయ్ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని లోకేష్ సినిమా తీశారని పేరొచ్చింది. ఇప్పుడు 'విక్రమ్'తో మరో విజయంపై ఆయన గురి పెట్టారు.
ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్లు, టీజర్లు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇటీవల సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా సినిమా తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రముఖ హీరో రామ్ చరణ్ ఈ ట్రైనర్ ను లాంచ్ చేశారు. ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతిల పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అందరిని సమానంగా చూపిస్తూ ట్రైలర్ కట్ చేశారు దర్శకుడు. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ ఓ రేంజ్ లో ఎలివేట్ అయింది.
చాలా కాలం తరువాత కమల్ నటించిన సినిమా కావడం.. పైగా స్టార్ హీరోలు ఉండడంతో బజ్ ఓ రేంజ్ లో ఏర్పడింది. ఈ సినిమాలో హీరో సూర్య కూడా కనిపించబోతున్నారు. కానీ ట్రైలర్ లో ఆయన క్యారెక్టర్ ను చూపించలేదు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివాని నారాయణన్, కాళిదాస్ జయరామ్, అర్జున్ దాస్ తదితరులు నటిస్తున్నారు. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది.
Also Read: ఎన్టీఆర్30 టెరిఫిక్ అప్డేట్ - ఫ్యాన్స్ కు పూనకాలే!
Glad to release the Action packed #Vikram Telugu trailer#VikramHitlisthttps://t.co/3EFvSmFSmt
— Ram Charan (@AlwaysRamCharan) May 20, 2022
My heartfelt wishes to @ikamalhaasan sir, @Dir_Lokesh @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial @RKFI & Team!
Good luck to @actor_nithiin @SreshthMovies for the Telugu release pic.twitter.com/M2RDYwodID
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

