Maa Elections: విష్ణు అలా అనడం బాధేసింది.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు
రీసెంట్ గా నామినేషన్ వేసిన అనంతరం ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు ఘాటుగా కామెంట్ చేశారు. దానికి ఆయన కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. తాజాగా ఈ పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేశారు ప్రకాష్ రాజ్.
టాలీవుడ్ లో 'మా' ఎలెక్షన్స్ రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తమ ప్యానల్స్ ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 10న జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటినుంచే ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఒకరినొకరు దూషించుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. రీసెంట్ గా నామినేషన్ వేసిన అనంతరం ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు ఘాటుగా కామెంట్ చేశారు. దానికి ప్రకాష్ రాజ్ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయ్యారు.
Also Read:త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను.. హాస్పిటల్ నుంచి సాయి ధరమ్ తేజ్ ట్వీట్
తాజాగా ఈ పరిస్థితిని చల్లబరిచే ప్రయత్నం చేశారు ప్రకాష్ రాజ్. ఇటీవల 'రిపబ్లిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనే నిర్ణయంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రితో పాటు కొందరు మంత్రులను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. అయితే పవన్ వ్యాఖ్యలతో సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. అయితే ఈ విషయంలో ప్రకాష్ రాజ్ ను ఇన్వాల్వ్ చేస్తూ.. 'ప్రకాష్ రాజ్ ఇండస్ట్రీ వైపు ఉన్నారా..? లేక పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారా..?' అని ప్రశ్నించాడు.
ఈ విషయంపై ప్రకాష్ రాజ్ తనదైన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. 'పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో కలెక్షన్స్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్' అంటూ ఘాటుగా బదులిచ్చారు. ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇలా మాట్లాడడంపై ప్రకాష్ రాజ్ మరోసారి మీడియాకు వివరణ ఇచ్చారు. మోహన్ బాబు బంగారమని.. ఆయన కొడుకులు విష్ణు, మనోజ్, కూతురు లక్ష్మీ అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు.
గతంలో లక్ష్మీ చేసి రెండు కార్యక్రమాలకు కూడా హాజరయ్యానని, వ్యక్తిగతంగా వారంటే చాలా గౌరవం, అభిమానం అని అన్నారు. కానీ మంచు విష్ణు ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు పొంతన లేకుండా.. 'ప్రకాశ్ రాజ్ ఇండస్ట్రీ పక్కనున్నాడా..లేక పవన్ కల్యాణ్ పక్కనున్నాడా' అనడం కొద్దిగా బాధేసిందని.. అందుకే అలా మాట్లాడానే తప్ప వ్యక్తిగతంగా వేరే కారణాలు లేవని చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్. మరి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి!
Also read: చైతూ-సామ్ లైఫ్‌లో అజ్ఞాత వ్యక్తి.. ప్రీతమ్ జుకల్కర్ కామెంట్స్ ఆమె గురించేనా? అందుకే విడాకులా?
Also read: 'మోసగాళ్లు ఎప్పటికీ బాగుపడరు'.. సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించో..?
Also read: చైతన్య-సమంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమన్న కంగనా..
Also Read: చివరికి గెలిచేది ప్రేమే... వారికి తప్పదు పతనం, సామ్ భావోద్వేగం