Radhe Shyam Event: ప్రేమకథ మాత్రమే కాదు.. అంతకుమించి.. ప్రభాస్ ఏం అన్నారంటే?
రాధే శ్యామ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్, దర్శకుడు రాధా కృష్ణ కుమార్ మాట్లాడారు.
రాధే శ్యామ్ కేవలం ప్రేమ కథ మాత్రమే కాదని.. ఇందులో అంతకు మించిన ట్విస్టులు ఉంటాయని ప్రభాస్ అన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో ప్రభాస్ మాట్లాడారు. ‘గోపీకృష్ణ బ్యానర్‌పై గతంలో కూడా చాలా మంచి సినిమాలు వచ్చాయి. కరోనా వైరస్ పాండమిక్ సమయంలో చిత్ర బృందం చాలా కష్టపడింది. రెండేళ్లు జార్జియా, ఇటలీ మిగతా దేశాల్లో షూట్ చేశారు. దానికి నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పాలి. ’
‘రాధే శ్యామ్ లవ్‌స్టోరీనే కానీ, అంతకుమించి ఉంటుంది. సినిమాటోగ్రాఫర్ మనోజ్ చాలా అందంగా సినిమాని తెరకెక్కించారు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఐదేళ్ల పాటు ఈ సినిమా మీదనే పని చేశారు. నిజంగా తన ఓపికను మెచ్చుకోవాలి. ఈ సినిమాలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ అందరినీ మెప్పిస్తుంది.’ అన్నారు.
డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కూడా ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ సినిమా రాయడానికి 18 సంవత్సరాలు, తీయడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని చెప్పారు. తన గురువు చంద్రశేఖర్ యేలేటి దగ్గర ఈ పాయింట్ విన్నట్లు తెలిపారు. ఈ సినిమాలు యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండవని పేర్కొన్నారు.
అమ్మాయికి, అబ్బాయికీ మధ్య జరిగే యుద్ధాలే ఉంటాయని, అమ్మాయి కోసం ఒక అబ్బాయి సప్త సముద్రాలు దాటుకుంటూ ఎలా వెళ్లాడన్నది కథ అని తెలిపారు. మనోజ్ పరమహంస ప్రతి సన్నివేశాన్ని బృందావనంలా చూపించారని పేర్కొన్నారు. నిర్మాతలు వంశీ, ప్రమోద్, విక్కీ లేకపోతే ఈ సినిమా లేదన్నారు. ప్రభాస్ తన కోసం చాలా చేశారన్నారు. జనవరి 14న అందరూ రండి.. ప్రేమించుకుందామంటూ ముగించారు.
ఈ సినిమాలో కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సత్యరాజ్, మేజర్ రవిచంద్రన్, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. 2022 జనవరి 14వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: సమంతకు అండగా రంగంలోకి దిగిన ఫ్రెండ్... భావోద్వేగ పోస్టు
Also Read: థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్... ఏపీ ప్రభుత్వం మీద నాని సెటైర్స్
Also Read: అది నా ఇష్టం! మీ క్యారెక్టర్ సంగతేంటి?... సైలెంట్‌గా క్లాస్ పీకిన అనసూయ!
Also Read: శ్రీరామ చంద్ర కాళ్లు చూస్తే కన్నీళ్లు ఆగవు... ఎంత పని చేశావ్ 'బిగ్ బాస్'!
Also Read: కొమురం భీముడో... కొమురం భీముడో... ఎన్టీఆర్ సాంగ్ ప్రోమో వచ్చింది! చూశారా?
Also Read: 'భీమ్లా నాయక్' వాయిదా పడింది... నాగార్జున దూకుడు పెరిగింది!
Also Read: Thaggedhe Le: ‘నీ అంత బాగా చేయలేదు బన్నీ’ అన్న జడ్డూ.. ఎందుకంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి