Salaar Shooting Update : 'సలార్' షూటింగ్ షురూ.. యాక్షన్ మోడ్ లో రెబెల్ స్టార్..
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోయిన సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయి.
![Salaar Shooting Update : 'సలార్' షూటింగ్ షురూ.. యాక్షన్ మోడ్ లో రెబెల్ స్టార్.. Prabhas and Prashanth Neel's Salaar Movie Shooting begins and at rapid pace Salaar Shooting Update : 'సలార్' షూటింగ్ షురూ.. యాక్షన్ మోడ్ లో రెబెల్ స్టార్..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/04/8d36dda3bac83a68c654fadc65634508_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ఆగిపోయిన సినిమా షూటింగ్స్ ఇప్పుడిప్పుడే తిరిగి ప్రారంభమవుతున్నాయి. అటు థియేటర్లు కూడా ఓపెన్ కావడం.. చిత్రాలు కూడా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంటుండతంతో.. వీలైనంతవరకు తమ సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో పడ్డారు మేకర్స్. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'సలార్' షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన.. శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
'కేజీఎఫ్' సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు విశేష స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ది మోస్ట్ వయిలెంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వయిలెంట్ అంటూ ప్రభాస్ డిఫరెంట్ లుక్‌లో చూపించాడు ప్రశాంత్ నీల్.
Also Read : RadheShyam Release: ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్ద సర్ప్రైజ్.. 'రాధేశ్యామ్' రిలీజ్ డేట్ ఫిక్స్!
ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. సోమవారం హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో నిన్న అర్థరాత్రి ఒంటిగంట వరకు పాల్గొన్నట్లు హీరోయిన్ శ్రుతిహసన్ తన ఇన్‌స్టాలో వెల్లడించింది. ఇక ఈ షెడ్యూల్లో ఆగస్ట్ 8 నుంచి ప్రభాస్ పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఇంతకుముందు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను రామగుండం పరిసర ప్రాంతాల్లో తెరకెక్కించారు. ఆ తర్వాత ముంబైలోనూ కొన్ని సీన్స్ తీశారు.
ఈ సినిమాతో పాటు.. ప్రభాస్ 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' సినిమాల్లో నటిస్తున్నాడు. అలానే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు షురూ చేశారు. ఇందులో దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు కనిపించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ప్రభాస్ సరసన.. పూజా హెగ్డే నటిస్తుండగా.. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ – గీతాకృష్ణ ప్రొడక్షన్స్ – టీ సిరీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Also Read : Upcoming Telugu Films List : సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. రచ్చ మాములుగా ఉండదేమో!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)