అన్వేషించండి
Advertisement
Time Travel Tollywood Movies: టైమ్ మిషన్ తో మన హీరోల ఆటలు!
గతంలో టైమ్ మిషన్ నేపథ్యంలో 'ఆదిత్య 369' సినిమా వచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాను సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు.
టాలీవుడ్ లో ఒక జోనర్ లో వచ్చిన సినిమా హిట్ అయిందంటే చాలు.. వెంటనే అదే జోనర్ లో పదుల సంఖ్యలో సినిమాలు వస్తుంటాయి. ఇలా ఫార్ములా చుట్టూ తిరుగుతుంటారు దర్శకనిర్మాతలు. 'ప్రేమ కథా చిత్రమ్' సినిమా హిట్ అయిన తరువాత వరుసగా హారర్ కామెడీ సినిమాలు చాలా వచ్చాయి. ఆ తరువాత లవ్ స్టోరీ జోనర్ లో వందల సినిమాలు వచ్చాయి. ఇప్పుడేమో మన వాళ్లు టైమ్ మిషన్ మీద పడ్డారు. చాలా మంది దర్శకులు ఇప్పుడు టైమ్ మిషన్ నేపథ్యంలో కథలు రాసుకుంటున్నారు.
గతంలో టైమ్ మిషన్ నేపథ్యంలో 'ఆదిత్య 369' సినిమా వచ్చింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాను సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా ఒక సెన్సేషన్. ఆ తరువాత ఇప్పటివరకు ఈ కాన్సెప్ట్ ను టాలీవుడ్ జనాలు టచ్ చేయలేదు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా 'ఆదిత్య 999'ను సిద్ధం చేస్తున్నారు. దీనికి బాలయ్య కథ అందించడం విశేషం. ఈ సినిమాతో తన కొడుకు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయనున్నారు బాలయ్య. 2023లో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే బాలకృష్ణ స్వయంగా ఈ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.
ఈ సినిమా మొత్తం టైమ్ మిషన్ కాన్సెప్ట్ తోనే రూపొందించబోతున్నారు. ఇక దీంతో పాటు ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా కూడా టైమ్ మిషన్ కాన్సెప్ట్ తోనే ఉంటుందట. దాంతో పాటు సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ ఇలా రెండు, మూడు జోనర్లను మిక్స్ చేసి సినిమా తీయబోతున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి 'ప్రాజెక్ట్ కె' అని పేరు పెట్టారు. టైమ్ మిషన్ కాన్సెప్ట్ కావడంతో దర్శకుడు నాగ్ అశ్విన్ కథ విషయంలో సింగీతం శ్రీనివాసరావు సాయం తీసుకున్నారు.
టైమ్ మిషన్ ఎక్కిన హీరో.. ఫ్యూచర్ లోకి వెళ్లడమే ఈ కథా నేపథ్యమని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్ ను నిర్మించనున్నారు. సినిమాలో ఎక్కువ శాతం షూటింగ్ ఫిల్మ్ సిటీలోనే నిర్వహించనున్నారు. రీసెంట్ గానే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇదిలా ఉండగా.. ప్రభాస్ లానే మరో యంగ్ హీరో కూడా టైమ్ మిషన్ ఎక్కుతాడట.
ఓ కొత్త దర్శకుడు చెప్పిక కథకు హీరో శర్వానంద్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తోనే ఈ సినిమాను కూడా తెరకెక్కించనున్నారు. సాధారణంగా టైమ్ ట్రావెల్ అంటే గతంలోకో, భవిష్యత్ లోకో వెళ్లి, అప్పట్లో వేరే వారి వ్యవహారాలు ఎలా వుంటాయో గమనించడం. కానీ ఈ సినిమాలో అలా కాదు. శర్వా, అతని స్నేహితులు టైమ్ ట్రావెల్ తో తమ బాల్యంలోకే వెళ్తారు. తమ స్టూడెంట్ డేస్ ఎలా గడిచాయి..? తమ స్నేహాలు, ప్రేమలు, ఇలాంటి అన్నీ తెలుసుకుంటారట. ఈ పాయింట్ అయితే డిఫరెంట్ గా ఉంది మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion