News
News
X

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

తమిళనాడు అవతల ప్రేక్షకుల్లో మాత్రం 'పొన్నియిన్ సెల్వన్' సినిమాపై ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంది.

FOLLOW US: 
ప్రముఖ దర్శకుడు మణిరత్నం(Maniratnam) తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'పొన్నియిన్ సెల్వన్'(Ponniyin Selvan). చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కిన సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియన్ సెల్వన్' నవల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగం సెప్టెంబర్ 30న విడుదల కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా కొనసాగుతున్నాయి.
 
చియాన్ విక్రమ్ ఆదిత్య కరికాలుడిగా, జయం రవి అరుణ్ మొళి వర్మగా, ఇంకా కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, జయరాం, ప్రకాష్ రాజ్, పార్తిబన్ ఇలా భారీ స్టార్ కాస్ట్ ఈ సినిమా సొంతం. ఇప్పుడున్న ప్యాన్ ఇండియా ట్రెండ్ కు మణిరత్నం సత్తా ఏంటో చాటే మంచి అవకాశంగా సినీ విశ్లేషకులు 'పొన్నియిన్ సెల్వన్'ను భావిస్తున్నారు. అయితే తమిళంలో ఈ సినిమాకి ఉన్న హైప్.. మిగిలిన భాషల్లో లేదు.
 
Poor start for advance bookings in Hyderabad: 'బాహుబలి' తరహాలో ఈ సినిమా దేశవ్యాప్తంగా యుఫోరియా క్రియేట్ చేస్తుందని చిత్రబృందం ఆశిస్తోంది కానీ తమిళనాడు అవతల ప్రేక్షకుల్లో మాత్రం సినిమాపై ఆసక్తి అంతంతమాత్రంగానే ఉంది. హైదరాబాద్ లో అయితే ఈ సినిమాకి సరైన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరగడం లేదు. ఏఎంబీ, ప్రసాద్స్ లో తప్ప మిగిలిన మల్టీప్లెక్స్ లలో ఎక్కడా కూడా టికెట్స్ బుక్ అవ్వడం లేదు. ఆ రెండు థియేటర్లలో కూడా ఎక్కువగా సినిమా ఇండస్ట్రీకి చెందినవారే టికెట్స్ బుక్ చేసి ఉంటారు. 
 
తెలుగులో దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ టికెట్ బుకింగ్స్ లో అది రిఫ్లెక్ట్ అవ్వడం లేదు. ఇలానే గనుక కంటిన్యూ అయితే కష్టమే. ఒక్కసారి రిలీజైన తరువాత పాజిటివ్ టాక్ వస్తే కచ్చితంగా టికెట్స్ తెగుతాయి. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!
 
అమెరికాలో 'పొన్నియిన్ సెల్వన్' క్రేజ్:
అమెరికాలో ఈ సినిమాకి భారీ క్రేజ్ కనిపిస్తుండడం విశేషం. అమెరికా ప్రీమియర్స్ కోసం వారం ముందే అక్కడ పెద్ద ఎత్తున టికెట్లు అమ్ముడవుతున్నాయి. రిలీజ్ కి ఐదు రోజుల ముందే ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ల మార్కుని అందుకుంది. ప్రీసేల్స్ బాగా పుంజుకున్నాయి. అయితే చాలా వరకు తమిళ వెర్షన్ కోసమే బుకింగ్స్ జరిగినట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ వెర్షన్స్ కి అక్కడ కూడా పెద్దగా హైప్ లేదు. దీన్ని బట్టి తమిళ జనాలు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారని అర్ధమవుతోంది. ప్రీమియర్స్ కి ముందే సినిమా మిలియన్ మార్క్ ను టచ్ చేస్తుందని.. ప్రీమియర్స్ పూర్తయ్యేసరికి 1.5 మిలియన్ మార్కుని అందుకున్న ఆశ్చర్యం లేదని అంటున్నారు. తమిళనాడులో కూడా ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయమని తెలుస్తోంది.
Published at : 27 Sep 2022 03:59 PM (IST) Tags: Maniratnam Aishwarya rai Ponniyin Selvan Trisha Vikram Ponniyin Selvan poor bookings

సంబంధిత కథనాలు

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Nani: హిట్ 3లో హీరో ఎవరో అప్పుడే తెలుస్తుంది - ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని ఏమన్నారంటే?

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు: అడివి శేష్

Adivi Sesh: రాజమౌళికి నేను ఏకలవ్య శిష్యుడిని - ఆయన అసలు బాహుబలి హిట్ అవుతుందా అన్నారు:  అడివి శేష్

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

Vishwak Sen: హిట్ యూనివర్స్‌లో నెక్స్ట్ ఏం అవుతుందో  - నాకు కూడా ఫోన్ వస్తదేమో - విష్వక్‌సేన్ ఏమన్నాడంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

Pushpa The Rise: రష్యాలో కూడా తగ్గేదే లే - రిలీజ్ ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Chiranjeevi IFFI Award : ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్న చిరంజీవి | ABP Desam

Chiranjeevi IFFI Award : ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్న చిరంజీవి | ABP Desam