Balakrishna In Action Mode : కత్తి పట్టిన బాలకృష్ణ - విదేశాల్లో ఊచకోత
నట సింహం నందమూరి బాలకృష్ణ టర్కీలో ఉన్నారు. NBK107 కోసం యాక్షన్ సీన్స్ షూటింగ్ చేస్తున్నారు. కత్తి పట్టిన బాలకృష్ణ... ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నారు.
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇప్పుడు టర్కీలో ఉన్నారు. ఆగస్టు నెలాఖరున ఆయన అక్కడికి వెళ్ళారు. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో చేస్తున్న సినిమా (NBK107) షూటింగ్ స్పీడుగా చేస్తున్నారు. ఆల్రెడీ ఒక సాంగ్, కొన్ని సీన్స్ తెరకెక్కించారు. ఇప్పుడు ఫైట్ సీన్స్ తీస్తున్నారు.
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో...
టర్కీలోని ఇస్తాంబుల్ లో తెరకెక్కిస్తున్న NBK 107 యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ ఫైట్ మాస్టర్లు, కవల సోదరులు రామ్ - లక్ష్మణ్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆన్ లొకేషన్ స్టిల్స్, వీడియోస్ నెట్టింట లీక్ అయ్యాయి. కత్తి పట్టిన బాలకృష్ణ... ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్న వీడియో అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ అంటే ఫ్యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. ఆయన చేసిన ఫ్యాక్షన్ ఫిల్మ్స్, వాటిలో యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. ఆ యాక్షన్ సన్నివేశాలు అన్నిటికీ మించేలా ఈ సినిమాలో ఫైట్స్ ఉంటాయని టాక్.
ఫైట్ తీయడానికి ముందు సాంగ్ తీశారు!
ఆగస్టు 24 తర్వాత NBK107 యూనిట్ టర్కీ వెళ్ళింది. ఫైట్స్ తీయడానికి ముందు... బాలకృష్ణ, హీరోయిన్ శ్రుతీ హాసన్ (Shruti Hassan) మీద ఒక పాటను చిత్రీకరించారు. దానికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమా కోసం శ్రుతీ హాసన్‌కు నీరజా కోన స్టైలింగ్ చేస్తున్నారు.
సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు!
శ్రుతీ హాసన్ కాకుండా ఈ సినిమాలో మరో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. అందులో మలయాళ భామ హానీ రోజ్ ఒకరు. తన క్యారెక్టర్ టిపికల్ తెలుగు సినిమా హీరోయిన్ తరహాలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తమిళ అమ్మాయి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు.
డిసెంబర్ రిలీజ్?
ఈ సినిమాను తొలుత సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. అయితే... చిరంజీవి 154 (వాల్తేరు వీరయ్య) సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటోంది. అందుకని, బాలయ్య సినిమాను ముందుకు తీసుకొస్తున్నారు. అఖండ డిసెంబర్ నెలలో విడుదలైంది. ఆ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందని ఈ ఏడాది ఆఖరున విడుదల చేయాలని భావిస్తున్నారట.
మూడు టైటిల్స్‌లో బాలకృష్ణ ఓటు దేనికి?
NBK107 చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. 'జై బాలయ్య', 'అన్న గారు' (Balakrishna Annagaru Movie), 'రెడ్డి గారు' టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట. ఈ మూడింటిలో బాలకృష్ణ దేనికి ఓటు వేస్తే... దాన్ని అధికారికంగా వెల్లడించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని టాక్.
Also Read : 'గాడ్ ఫాదర్' క్లైమాక్స్ - చిరు, సల్మాన్ ఫ్యాన్స్‌కు ట్రీట్ - ఎక్స్‌క్లూజివ్ న్యూస్ ఏంటంటే?
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై NBK 107 తెరకెక్కుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు.
Also Read : 'మెగా'స్టార్ మాస్ రికార్డు - 'వాల్తేరు వీరయ్య' ఓటీటీ రైట్స్ ఎంతంటే?